గతేడాది హిందీలో వచ్చి మంచి హిట్ సాధించిన సినిమాల్లో ధనుష్ నటించిన రొమాంటిక్ డ్రామా తేరే ఇష్క్ మే కూడా ఒకటి. ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.
తేరే ఇష్క్ మే ఓటీటీ రిలీజ్ డేట్

బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేసిన తేరే ఇష్క్ మే (Tere Ishq Mein) సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. గతేడాది నవంబర్ 28న థియేటర్లలోకి రాగా.. శుక్రవారం అంటే జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని గురువారం ఆ ఓటీటీ అధికారికంగా తెలిపింది.
“హృదయాలను కలిపేదే కాదు.. బ్రేక్ చేసేది కూడా అయిన ఆ ప్రేమ వచ్చేస్తోంది. తేరే ఇష్క్ మే నెట్‌ఫ్లిక్స్ లోకి రేపే రానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమా తెలుగులో అమర కావ్యంగా వచ్చింది. ఇప్పుడీ వెర్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. అలాగే తమిళంలోనూ అందుబాటులో ఉంటుంది.
తేరే ఇష్క్ మే మూవీ విశేషాలు
ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన తేరే ఇష్క్ మే మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు వసూళ్లు సాధించింది. రూ.95 కోట్లతో తెరకెక్కగా.. రూ.150 కోట్ల వరకు వసూలు చేసింది. ధురంధర్ మూవీ సునామీని తట్టుకొని మరీ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. వీటిలో హిందీ వెర్షన్ నుంచే చాలా వరకు వసూళ్లు వచ్చాయి. తెలుగు, తమిళ వెర్షన్లలో పెద్దగా సక్సెస్ కాలేదు.
తన ప్రవర్తన కారణంగా సస్పెండైన ఓ ఎయిర్ఫోర్స్ పైలట్, అతన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించే ఓ సైకాలజిస్ట్ స్టూడెంట్ లవ్ స్టోరీయే ఈ తేరే ఇష్క్ మే మూవీ. ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులు పడినా.. ఓవరాల్ గా సినిమాకు అంతగా పాజిటివ్ రివ్యూలు రాలేదు. అయితే ఐఎండీబీలో మాత్రం 7.5 రేటింగ్ నమోదైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయితే ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.
{{/usCountry}}తన ప్రవర్తన కారణంగా సస్పెండైన ఓ ఎయిర్ఫోర్స్ పైలట్, అతన్ని చక్కదిద్దడానికి ప్రయత్నించే ఓ సైకాలజిస్ట్ స్టూడెంట్ లవ్ స్టోరీయే ఈ తేరే ఇష్క్ మే మూవీ. ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులు పడినా.. ఓవరాల్ గా సినిమాకు అంతగా పాజిటివ్ రివ్యూలు రాలేదు. అయితే ఐఎండీబీలో మాత్రం 7.5 రేటింగ్ నమోదైంది. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా జనవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయితే ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.
{{/usCountry}}