...
...
Next Story

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆగస్ట్‌లో రాబోతున్న 10 క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. రష్మిక మూవీ కూడా..

Netflix August Release: నెట్‌ఫ్లిక్స్ లో వచ్చే నెల ఏం స్ట్రీమింగ్ కాబోతున్నాయా అని ఎదురు చూస్తున్నారా? అయితే ఈ లిస్ట్ మీ కోసమే. ఈ టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ఆగస్ట్ 2026లో రానున్న టాప్ 10 క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ ఇక్కడ చూడండి.

Published on: Jul 29, 2026, 19:58:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix August Release: ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఆగస్టు నెలలో మైండ్ బ్లాకింగ్ కంటెంట్ తో డిజిటల్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సినిమా లవర్స్, వెబ్ సిరీస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 10 క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఈ నెలలోనే స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆగస్ట్‌లో రాబోతున్న 10 క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. రష్మిక మూవీ కూడా..
Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆగస్ట్‌లో రాబోతున్న 10 క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. రష్మిక మూవీ కూడా..

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ల నుంచి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్, డ్రామా సిరీస్‌ల వరకు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ఈ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సమ్మర్‌స్లామ్ రచ్చ.. హిట్ వెబ్ సిరీస్‌ల కంబ్యాక్

యాక్షన్ ప్రియుల కోసం ప్రపంచ ప్రసిద్ధ 'WWE సమ్మర్‌స్లామ్ 2026' ఈవెంట్ ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. రోమన్ రీన్స్ vs సేథ్ రోలిన్స్, బ్రోక్ లెస్నర్ vs ఒబా ఫెమి (హెల్ ఇన్ ఎ సెల్), సీఎం పంక్ vs కోడీ రోడ్స్ వంటి మైండ్ బ్లాకింగ్ మ్యాచ్‌లు ఈ సారి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి.

ఆ తర్వాత జపాన్‌కు చెందిన హిట్ రియాలిటీ షో 'బ్యాడ్లీ ఇన్ లవ్' సీజన్ 2 ఆగస్టు 4న, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న 'మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్' సీజన్ 3 ఆగస్టు 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

'మై వాపస్ ఆవుంగా'.. సిద్ధార్థ్ ‘ఆపరేషన్ సేఫ్డ్ సాగర్’

ఆగస్టు 7వ తేదీ నెట్‌ఫ్లిక్స్ లవర్స్‌కి చాలా స్పెషల్ అని చెప్పాలి. స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా 'మై వాపస్ ఆవుంగా' (Main Waapas Aaonga) అదే రోజు డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. నసీరుద్దీన్ షా, దిల్జీత్ దొసాంజ్, వేదాంగ్ రైనా, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. దేశ విభజన సమయం నాటి ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 97.37 కోట్లు వసూలు చేసింది.

ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత వివాదాస్పద మేనేజర్ జోసే మోరిన్హో జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 3 పార్ట్‌ల డాక్యుమెంటరీ 'మోరిన్హో' ఆగస్టు 11న, నిజజీవిత ఘటనలతో చైల్డ్ అడాప్షన్ కాన్సెప్ట్‌పై వచ్చిన ఎమోషనల్ డాక్యుమెంటరీ 'ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్' ఆగస్టు 13న డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నాయి.

ఇక ఆగస్టు 14న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, గ్లామర్ బ్యూటీ కృతి సనన్ కాంబోలో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కాక్‌టైల్ 2' (Cocktail 2) నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద రూ. 143.33 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదే రోజున సన్నీ శాండ్లర్ నటించిన 'డోంట్ సే గుడ్ లక్' యూత్ డ్రామా, ఆగస్టు 18న అత్యంత ఖరీదైన సైనిక ఆపరేషన్ల ఆధారంగా రూపొందిన హై-వోల్టేజ్ ఇంటెన్స్ యాక్షన్ సిరీస్ 'సీల్ టీమ్' (SEAL Team) స్ట్రీమింగ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఆగస్ట్ రిలీజెస్

* ఆగస్ట్ 2: డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్

* ఆగస్ట్ 4: బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 (జపనీస్ రియాల్టీ షో)

* ఆగస్ట్ 6: మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3

* ఆగస్ట్ 7: మై వాపస్ ఆవూంగా మూవీ

* ఆగస్ట్ 7: ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్

* ఆగస్ట్ 11: మౌరిన్హో (ఫుట్‌బాల్ డాక్యు సిరీస్)

* ఆగస్ట్ 13: ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (డాక్యు డ్రామా)

* ఆగస్ట్ 14: కాక్‌టెయిల్ 2 మూవీ

* ఆగస్ట్ 14: డోంట్ సే గుడ్ లక్

* ఆగస్ట్ 18: సీల్ టీమ్ వెబ్ సిరీస్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe