నెట్‌ఫ్లిక్స్ తన మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను తీసుకొస్తోంది. ఢిల్లీలోని పట్పర్‌గంజ్ జిల్లా కోర్టులో జరిగే వింతైన కేసులు, అక్కడి లాయర్ల హడావిడిని నవ్వులు పూయించేలా చూపించిన 'మామ్లా లీగల్ హై' మొదటి సీజన్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సీజన్ 2 సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేస్తూ విడుదల తేదీని ప్రకటించింది.
ఏప్రిల్ 3న విచారణ మొదలు

నెట్‌ఫ్లిక్స్ తన కోర్ట్ రూమ్ కామెడీ వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై రెండో సీజన్ ప్రమోషన్లను ఆసక్తికరంగా చేపడుతోంది. కొన్ని రోజుల కిందట ఢిల్లీ వీధుల్లో కొంతమంది వ్యక్తులు కోతి వేషధారణలో వీపుపై '3rd April' అని రాసి తిరుగుతూ కనిపించారు.
ఇది దేని గురించి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. తాజాగా విడుదలైన టీజర్‌తో ఆ మిస్టరీ వీడింది. అది 'మామ్లా లీగల్ హై' సీజన్ 2 ప్రచారంలో భాగమేనని, ఏప్రిల్ 3న ఈ సిరీస్ విడుదల కాబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు.
ఈ సీజన్‌లో ఏం చూడబోతున్నాం?
రెండో సీజన్‌లో పట్పర్‌గంజ్ కోర్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. లాయర్ వి.డి. త్యాగి (రవి కిషన్) ఈసారి లాయర్ కోటు వదిలేసి జడ్జి కుర్చీ ఎక్కాలని కలలు కంటున్నారు. అయితే జడ్జిగా మారడం అనుకున్నంత సులభం కాదని అతనికి త్వరలోనే అర్థమవుతుంది. మునుపటి లాగే ఈసారి కూడా "నిజ జీవితంలో జరిగిన వింత సంఘటనల ఆధారంగా" క్రేజీ కేసులు, వింతైన క్లయింట్ల చుట్టూ కథ సాగుతుంది.
రవి కిషన్ ఏమన్నారంటే?
"త్యాగి ఈ సీజన్‌లో తనను తాను జడ్జిగా నిరూపించుకోవడానికి ఆరాటపడుతుంటాడు. ఇక్కడి ప్రతి కేసు సీరియస్ అయినప్పటికీ, మా లాయర్ల అప్రోచ్ మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. పట్పర్‌గంజ్ కోర్టులోని ఈ పిచ్చితనాన్ని మళ్ళీ ప్రేక్షకులకు చూపించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రవి కిషన్ పేర్కొన్నాడు.
{{/usCountry}}"త్యాగి ఈ సీజన్‌లో తనను తాను జడ్జిగా నిరూపించుకోవడానికి ఆరాటపడుతుంటాడు. ఇక్కడి ప్రతి కేసు సీరియస్ అయినప్పటికీ, మా లాయర్ల అప్రోచ్ మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. పట్పర్‌గంజ్ కోర్టులోని ఈ పిచ్చితనాన్ని మళ్ళీ ప్రేక్షకులకు చూపించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రవి కిషన్ పేర్కొన్నాడు.
{{/usCountry}}నైలా గ్రెవాల్ (అనన్య ష్రాఫ్), నిధి బిష్ట్ (సుజాత నేగి), అనంత్ వి. జోషి మళ్ళీ తమ పాత్రల్లో అలరించనుండగా.. కొత్తగా కుశా కపిల, దినేష్ లాల్ యాదవ్ (నిరహువా) జాయిన్ అవ్వడం సిరీస్‌పై అంచనాలను పెంచింది. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ ను చూసి ఎంజాయ్ చేసిన వాళ్లు ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానున్న రెండో సీజన్ కోసం సిద్ధంగా ఉండండి.