...
...
Next Story

Netflix Crime Thriller: థియేటర్లలో నిరాశపరిచినా నెట్‌ఫ్లిక్స్‌లో థ్రిల్లర్ మూవీ సంచలనం.. 3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్

Netflix Crime Thriller: కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో మేఘనా గుల్జార్ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ 'దాయరా' (Daayra) నెట్‌ఫ్లిక్స్‌లో అద్భుతమైన వ్యూస్ రాబడుతోంది. కేవలం 3 రోజుల్లోనే 3.2 మిలియన్ల వ్యూస్, 7.4 మిలియన్ల వాచ్ అవర్స్ సాధించింది.

Published on: Nov 18, 2026, 21:22:49 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Crime Thriller: థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు.. ఓటీటీ వేదికపైకి రాగానే అనూహ్యమైన ఆదరణ దక్కించుకోవడం ఇటీవల తరచూ చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి కలిసి నటించిన 'దాయరా' (Daayra) చిత్రం ఇదే కోవలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా సంచలనం సృష్టిస్తోంది.

దాయరా రికార్డు

నెట్‌ఫ్లిక్స్‌లో పృథ్వీరాజ్, కరీనా నటించిన దాయరా మూవీ సంచలనం
నెట్‌ఫ్లిక్స్‌లో పృథ్వీరాజ్, కరీనా నటించిన దాయరా మూవీ సంచలనం

ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ మోరల్ క్రైమ్ డ్రామా, సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో (హిందీ, మలయాళ భాషల్లో) అడుగుపెట్టగానే గ్లోబల్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక తొలి వారపు వ్యూస్ సాధించిన బాలీవుడ్ సినిమాల జాబితాలో 'కాక్‌టెయిల్ 2', 'ధమాల్ 4' వంటి చిత్రాలను వెనక్కి నెట్టి 'దాయరా' 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

కేవలం 3 రోజుల్లోనే 32 లక్షల వ్యూస్.. 14 దేశాల్లో హవా

నెట్‌ఫ్లిక్స్ సోమవారం నుంచి ఆదివారం వరకు వారపు వ్యూయర్‌షిప్ గణాంకాలను లెక్కిస్తుంది. 'దాయరా' శుక్రవారం (నవంబర్ 13) విడుదల కావడంతో, తొలి వారపు జాబితాలో కేవలం మూడు రోజుల (నవంబర్ 13-15) ప్రదర్శన మాత్రమే పరిగణనలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం రికార్డు స్థాయి గణాంకాలను నమోదు చేసింది.

నెట్‌ఫ్లిక్స్ అధికారిక డేటా ప్రకారం, 'దాయరా' తొలి వారంలో 3.2 మిలియన్ల (32 లక్షలు) వ్యూస్, 7.4 మిలియన్ల వ్యూయింగ్ హవర్స్ రికార్డు సాధించింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో 8వ స్థానంలో నిలిచింది.

2026లో థియేట్రికల్ రన్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై తొలి వారంలో అత్యధిక వ్యూస్ సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో 'దాయరా' 8వ స్థానాన్ని దక్కించుకుంది. థియేటర్లలో విజయం సాధించిన 'కాక్‌టెయిల్ 2', 'ధమాల్ 4' వంటి కామెడీ చిత్రాలను సైతం 'దాయరా' అధిగమించడం గమనార్హం.

టాప్ 10 ఇవే

1. ధురంధర్ (Dhurandhar): 7.6 మిలియన్లు

2. భూత్ బంగ్లా (Bhooth Bangla): 4.9 మిలియన్లు

3. మర్దానీ 3 (Mardaani 3): 4.4 మిలియన్లు

4. తేరే ఇష్క్ మే (Tere Ishk Mein): 3.8 మిలియన్లు

5. దే దే ప్యార్ దే 2 (De De Pyaar De 2): 3.5 మిలియన్లు

6. హక్ (Haq): 3.4 మిలియన్లు

7. ఆల్ఫా / బోర్డర్ 2 (Alpha | Border 2): 3.3 మిలియన్లు

8. దాయరా (Daayra): 3.2 మిలియన్లు

9. కాక్‌టెయిల్ 2 (Cocktail 2): 2.9 మిలియన్లు

10. ధమాల్ 4 (Dhamaal 4): 2.6 మిలియన్లు

ఏంటీ 'దాయరా' కథ? ఎందుకు ఇంతలా ఆకట్టుకుంటోంది?

వాస్తవ సంఘటనల స్ఫూర్తితో మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఒక యువతిపై జరిగిన దారుణ హత్యాచారం కేసులో నిందితులను డీసీపీ రమణ్ కుమార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎన్‌కౌంటర్ చేస్తారు. ప్రజల దృష్టిలో రమణ్ హీరోగా మారినప్పటికీ, ఆ ఎన్‌కౌంటర్ బూటకమనే అనుమానాలు తలెత్తుతాయి.

ఈ కేసును విచారించడానికి నియమితులైన సిట్ (SIT) అధికారిణి డీసీపీ అజూనీ కోహ్లీ (కరీనా కపూర్) నిజానిజాలను ఎలా వెలికితీశారు? తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధమైన విచారణ అనే రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తుంది. కరీనా, పృథ్వీరాజ్‌ల అద్భుత నటన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో మస్ట్ వాచ్ థ్రిల్లర్‌గా మార్చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks