...
...
Next Story

Netflix Crime Thriller: అర్ధరాత్రి నడిరోడ్డుపై గాయాలతో అమ్మాయి.. టైటిల్ మార్చుకొని ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్

Netflix Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ జానర్ లో చాలా మూవీస్, వెబ్ సిరీస్ తీసుకొచ్చింది. తాజాగా ఆ లిస్టులో మరో మూవీ చేరబోతోంది.

Published on: Oct 15, 2026, 14:03:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఒక్క రాత్రిలో ముగిసిపోయే కథతో వస్తున్న గజబ్ రాత్ అనే మూవీ ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. గతంలో వివాదాలు చెలరేగిన నేపథ్యంలో టైటిల్ మార్చుకొని వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

గజబ్ రాత్ మూవీ విశేషాలు

Netflix Crime Thriller: అర్ధరాత్రి నడిరోడ్డుపై గాయాలతో అమ్మాయి.. టైటిల్ మార్చుకొని ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్
Netflix Crime Thriller: అర్ధరాత్రి నడిరోడ్డుపై గాయాలతో అమ్మాయి.. టైటిల్ మార్చుకొని ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్

బాలీవుడ్‌లో పవర్ ఫుల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయీ (Manoj Bajpayee), స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే (Neeraj Pandey) కలిసి పనిచేస్తున్న మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'గజబ్ రాత్' (Gajab Raat) ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 23 నుంచి ఈ చిత్రం గ్లోబల్ వైడ్‌గా స్ట్రీమింగ్ కానుంది.

అంతకుముందు ఈ సినిమాకు 'ఘూస్‌ఖోర్ పండిట్' (Ghooskhor Pandat) అనే టైటిల్ ఫిక్స్ చేయగా, కొన్ని వివాదాల కారణంగా మేకర్స్ ఈ టైటిల్‌ను తాజాగా 'గజబ్ రాత్'గా మారుస్తూ అఫీషియల్ ప్రకటన జారీ చేశారు. ఘూస్‌ఖోర్ అంటే లంచగొండి అని అర్థం. అలాంటి పదం పక్కన పండిత్ అని చేర్చడంపై గతంలో వివాదం తలెత్తింది. దీంతో గజబ్ రాత్ అని ఈ టైటిల్ మార్చారు.

‘ఎన్నో స్టోరీలు, మరెన్నో పాత్రలు.. నిజం బయటపడటానికి ఉన్నది మాత్రం ఒకే రాత్రి’ అనే క్యాప్షన్ తో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మొత్తం అర్ధరాత్రి వేళ ఓ వాహనం నుంచి గాయాలతో కింద పడిన ఓ అమ్మాయి, ఆమెను చంపడానికి చేసే ప్రయత్నాల చుట్టూ సాగింది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు చంపడానికి చూస్తున్నారన్నది ఈ మూవీలో చూడొచ్చు.

నిజాయితీకి అత్యాశకు మధ్య నలిగే పోలీస్ కథ

పాత్రలో లోతుపాతులు, గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్లను ఇష్టపడే మనోజ్ ఈ సినిమాలో తనదైన నటనతో మరోసారి ఆడియన్స్‌ను కట్టిపడేయడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు సాకిబ్ సలీమ్, దివ్య దత్తా, నుష్రత్ భరుచా, శ్రద్ధా దాస్ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ బింజ్ వాచ్

నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పేయ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'స్పెషల్ 26' (Special 26), 'అయ్యారి' (Aiyaary) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు అదే జోనర్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న ఈ సినిమా సస్పెన్స్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ట్రీట్ ఇస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks