...
...
Next Story

నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్‌లో విమర్శకుల ప్రశంసలు పొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కోహ్రా’ రెండో సీజన్ ట్రైలర్ విడుదలైంది. బరుణ్ సోబ్టీతో పాటు కొత్తగా మోనా సింగ్ పోలీసు అధికారిగా మళ్లీ తిరిగి వచ్చారు. పంజాబ్‌లోని ఒక చిన్న పట్టణంలో జరిగిన హత్య, దాని చుట్టూ అల్లుకున్న అబద్ధాలు, రహస్యలే ఈ సీజన్ కథ.

Published on: Jan 29, 2026, 14:26:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

పొగమంచు కమ్మిన పంజాబ్ పొలాలు, చీకటి కోణాలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో 'కోహ్రా' (Kohrra) వెబ్ సిరీస్ ప్రపంచం మళ్లీ వచ్చేసింది. మొదటి సీజన్ ఘనవిజయం తర్వాత రెండో సీజన్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గురువారం (జనవరి 29) ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.

నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇందులో బరుణ్ సోబ్టీ తన పాత్రలో తిరిగి రాగా.. ప్రముఖ నటి మోనా సింగ్ కొత్త చీఫ్ ఇన్వెస్టిగేటర్‌గా జతకట్టింది. పంజాబ్‌లోని దలేర్‌పురా అనే చిన్న పట్టణంలో జరిగిన ఒక మహిళ హత్యను ఛేదించే క్రమంలో ఈ ఇద్దరు పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లు, అబద్ధాలు, మోసాలను ట్రైలర్ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

కోహ్రా సీజన్ 2 ట్రైలర్ హైలైట్స్

నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఈ కోహ్రా. తొలి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కోహ్రా అంటే పంజాబీలో పొగ మంచు అని అర్థం. అందుకు తగినట్లుగానే ఈ సిరీస్ లో చాలా వరకు ఆ పొగ మంచు నిండిన పంజాబ్ లోని ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండో సీజన్ కూడా అలాగే ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

తన సోదరుడి (అనురాగ్ అరోరా) పశువుల పాకలో ఒక మహిళ (పూజా) శవమై కనిపించడంతో ట్రైలర్ మొదలవుతుంది. ఆమె భర్త (రణ్‌విజయ్ సింఘా) పిల్లలతో అమెరికాలో ఉంటాడు. విచారణలో వైవాహిక బంధంలో ఎప్పుడూ గొడవలే అని తెలుస్తుంది. మరణించిన మహిళ డ్యాన్స్ పార్టనర్ సహా మరికొందరు అనుమానితుల జాబితాలో చేరడంతో కథ మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ చిక్కుముడులను విప్పడానికి ఏఎస్ఐ అమర్‌పాల్, ఎస్ఐ ధన్వంత్ కౌర్ ప్రయత్నిస్తుంటారు.

కోహ్రా వెబ్ సిరీస్‌పై ఎవరేమన్నారంటే?

ధన్వంత్ కౌర్ పాత్రలో నటిస్తున్న మోనా సింగ్ మాట్లాడుతూ.. "కోహ్రా ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఉత్సాహంగానూ, కాస్త భయంగానూ అనిపించింది. ఎందుకంటే దీని నెరేషన్ అంత గొప్పగా ఉంటుంది. ధన్వంత్ తక్కువగా మాట్లాడే మహిళ. కానీ ఆమె సంకల్పం చాలా గొప్పది. కష్టాన్ని, బాధ్యతను మోస్తూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది" అని వివరించింది.

కోహ్రా రెండో సీజన్‌కు సుదీప్ శర్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సౌరభ్ మల్హోత్రా, సుదీప్ శర్మ తదితరులు నిర్మించిన 'కోహ్రా' సీజన్ 2 ఫిబ్రవరి 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks