Netflix Movie: బాలీవుడ్‌లో సరికొత్త జోనర్‌తో అలరించేందుకు సిద్ధమైంది 'మా బహెన్'. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి, నేరుగా డిజిటల్ వేదికపైకి రాబోతోంది. 'తుమ్హారీ సులు', 'జల్సా' వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ త్రివేణి ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీని రూపొందించారు. ఒక విభిన్నమైన క్రైమ్ కామెడీ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
జూన్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ల్యాండింగ్

'మా బహెన్' మూవీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ మూవీతో ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ధర్నా దుర్గా బాలీవుడ్‌లోకి నటిగా అడుగుపెడుతుండటం విశేషం.
కిచెన్‌లో శవం.. కాలనీలో కలకలం
ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరూ ఊహించని విధంగా జరిగే విచిత్ర పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రేఖ (మాధురీ దీక్షిత్), ఆమె కూతుళ్లు జయ (తృప్తి డిమ్రి), సుష్మ (ధర్నా దుర్గా) ఒక సాధారణ కాలనీలో నివసిస్తుంటారు. వీరు ముగ్గురూ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే ఉంటారు. అయితే ఒకరోజు అనుకోకుండా వారి ఇంటి కిచెన్‌లో ఒక గుర్తుతెలియని శవం ప్రత్యక్షమవుతుంది.
ఆ శవాన్ని చూసి భయాందోళనకు గురైన ఆ తల్లి, కూతుళ్లు.. తాము చేయని నేరం నుండి ఎలా తప్పించుకోవాలి? ఆ శవాన్ని కాలనీ వాళ్లకు తెలియకుండా ఎలా దాచాలి? అని పడే తాపత్రయమే ఈ సినిమా. ఏ చిన్న రహస్యాన్ని కూడా దాచలేని పొరుగువారు ఉన్న కాలనీలో.. ఈ ముగ్గురు మహిళలు అబద్ధాలు ఆడుతూ, కంగారు పడుతూ చేసే పనుల వల్ల ఎలాంటి గందరగోళం సృష్టిస్తుందన్నదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
టీజర్‌లో ఏముందంటే?
ఇటీవలే విడుదలైన టీజర్‌లో తృప్తి డిమ్రి తన ఆన్-స్క్రీన్ తల్లి మాధురీ దీక్షిత్ ప్రవర్తనపై గొడవపడుతూ కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో వారి ఇంట్లో ఒక శవం బయటపడుతుంది. దాంతో భయపడిపోయిన ఈ ముగ్గురూ.. ఆ శవాన్ని మాయం చేయడానికి చేతులు కలుపుతారు. అయితే ఆ మర్డర్ తాము చేయలేదని వారు వాదిస్తారు. ఇంతకీ ఆ శవం ఎవరిది? అసలు ఆ హత్య చేసింది ఎవరు? అనేది నెట్‌ఫ్లిక్స్‌లో తేలనుంది.
{{/usCountry}}ఇటీవలే విడుదలైన టీజర్‌లో తృప్తి డిమ్రి తన ఆన్-స్క్రీన్ తల్లి మాధురీ దీక్షిత్ ప్రవర్తనపై గొడవపడుతూ కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో వారి ఇంట్లో ఒక శవం బయటపడుతుంది. దాంతో భయపడిపోయిన ఈ ముగ్గురూ.. ఆ శవాన్ని మాయం చేయడానికి చేతులు కలుపుతారు. అయితే ఆ మర్డర్ తాము చేయలేదని వారు వాదిస్తారు. ఇంతకీ ఆ శవం ఎవరిది? అసలు ఆ హత్య చేసింది ఎవరు? అనేది నెట్‌ఫ్లిక్స్‌లో తేలనుంది.
{{/usCountry}}ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. మాధురీ దీక్షిత్ (రేఖగా), తృప్తి డిమ్రి, ధర్నా దుర్గా, భోజ్‌పురి స్టార్ రవి కిషన్ (కీలక పాత్రలో)లతోపాటు గీతాంజలి కుల్కర్ణి, అరుణోదయ్ సింగ్, శార్దూల్ భరద్వాజ్ నటిస్తున్నారు. సురేష్ త్రివేణి, పూజా తోలాని కలిసి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు.
మేకర్స్ ఏమన్నారంటే?
చిత్ర నిర్మాత, అబుండెన్షియా ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ విక్రమ్ మల్హోత్రా మాట్లాడుతూ.. " 'మా బహెన్' అనేది ఒక అద్భుతమైన కథాంశంతో సాగుతూనే, మానవీయ సంబంధాల వెనుక ఉన్న ఎమోషనల్ నిజాలను చూపిస్తుంది. ఈ గందరగోళం, కామెడీ వెనుక.. ఒక కుటుంబం, సమాజం, ఈ జడ్జ్‌మెంటల్ ప్రపంచంలో బ్రతకడానికి మనుషులు తీసుకునే నిర్ణయాల చుట్టూ సాగే కథ ఇది" అని పేర్కొన్నారు.