Netflix Trending: సౌత్ ఇండస్ట్రీ సినిమాలు ఇటు బాక్సాఫీస్ ను శాసించడమే కాదు అటు ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతూనే ఉన్నాయి. తాజాగా అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ లోనూ సౌత్ ఇండియా సినిమాల జోరు క్లియర్ గా కనిపిస్తోంది.
ట్రెండింగ్ లో మూడు సినిమాలు

పాపులర్ ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో సౌత్ ఇండియా సినిమాల డామినేన్స్ క్లియర్ గా తెలుస్తోంది. లేటెస్ట్ గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ సినిమాల టాప్ 10 లిస్ట్ లో రెండు తమిళ సినిమాలు, ఓ తెలుగు మూవీ ఉంది. అవే.. విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి, మొద రాత్రి.
నెట్‌ఫ్లిక్స్ నంబర్ వన్
సూర్య లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విశ్వనాథ్ అండ్ సన్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 ట్రెండింగ్ నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో నంబర్ వన్ గా నిలిచింది. రెండు వారాలుగా ఆ మూవీ టాప్ లోనే ఉంది. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాకు 5.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఇరుముడి జోరు
థియేటర్లలో అదరగొట్టిన రవితేజ లేటెస్ట్ మూవీ ఇరుముడి. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఈ చిత్రానికి తిరుగులేదు. ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే ఈ సినిమా గ్లోబల్ ట్రెండింగ్ లో మూడో ప్లేస్ కు దూసుకెళ్లింది. రెండు రోజుల్లోనే ఈ మూవీకి నెట్‌ఫ్లిక్స్ లో 3.4 మిలియన్ వ్యూస్ దక్కాయి.
రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి మూవీ థియేటర్లలో రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.
మొద రాత్రి
{{/usCountry}}రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఇరుముడి మూవీ థియేటర్లలో రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.
మొద రాత్రి
{{/usCountry}}ఇక తమిళ రీసెంట్ సూపర్ హిట్ మూవీ మొద రాత్రి కూడా స్ట్రీమింగ్ లో వారెవా అనిపిస్తోంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ నాన్ ఇంగ్లీష్ టాప్ 10 లిస్ట్ లో ప్రస్తుం ఏడో ప్లేస్ లో ఉంది. ఈ సినిమాకు రెండు రోజుల్లో 1.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఫస్ట్ నైట్ రోజు తన భార్యను ఆమె లవర్ దగ్గరకు తీసుకెళ్లేందుకు ట్రై చేసే ఓ భర్త కథగా మొద రాత్రి మూవీ సాగుతుంది. కానీ ఆ లవర్ హ్యాండ్ ఇవ్వడంతో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.