నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఓ హిందీ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ సంచలనం రేపుతోంది. ఈ మూవీ పేరు ‘బారాముల్లా’. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా కేవలం ఒక వారం వ్యవధిలోనే నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల చార్ట్‌లో 3వ స్థానం దక్కించుకుంది. మరి ఆ మూవీ విశేషాలేంటో తెలుసుకోండి.
'బారాముల్లా' సంచలనం

మానవ్ కౌల్ ప్రధాన పాత్రలో నటించిన 'బారాముల్లా' మూవీ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో 3వ స్థానానికి చేరుకుంది. ఈ సినిమా ధనుష్ నటించిన ‘ఇడ్లీ కడాయ్’ని (4వ స్థానం) అధిగమించింది.
ఈ జాబితాలో 'మ్యాంగో' మొదటి స్థానంలో, 'ది ఉమన్ ఇన్ ది లైన్' రెండో స్థానంలో ఉన్నాయి. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ సినిమా గత శుక్రవారం అంటే నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. కశ్మీర్ లోని బారాముల్లా టౌన్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
'బారాముల్లా' స్టోరీ ఏంటంటే?
బారాముల్లా సినిమాకు ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వం వహించాడు. 2025లో విడుదలైన ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ కశ్మీర్‌లోని బారాముల్లాలో అదృశ్యమవుతున్న పిల్లల వరుస కేసులను పరిశోధించే డీఎస్పీ రిద్వాన్ సయ్యద్ (మానవ్ కౌల్) చుట్టూ తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో రిద్వాన్ తన కుటుంబాన్ని ఒక దెయ్యాలున్న బంగ్లాలోకి మార్చాల్సి వస్తుంది. అక్కడ వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. ఈ దర్యాప్తు స్థానిక జానపద కథలు, రాజకీయ అస్థిరత వంటి అంశాలను కూడా టచ్ చేస్తుంది.
సినిమా కథ కేవలం అతీంద్రియ శక్తులతో ఆగిపోకుండా పోలీసు వ్యతిరేక సెంటిమెంట్ పెరగడం, పిల్లల రాడికలైజేషన్ వంటి కశ్మీర్ ఘర్షణ వాస్తవ ప్రపంచ ప్రభావాలను కూడా మిళితం చేసింది. ఈ సినిమాలో మానవ్ కౌల్ డీఎస్పీ రిద్వాన్ సయ్యద్గా నటించగా, భాషా సుంబ్లి ఆయన భార్య గుల్నార్ పాత్ర పోషించారు. అరిస్టా మెహతా (నూర్), రోహాన్ సింగ్ (అయాన్) వారి పిల్లల పాత్రల్లో నటించారు. 'బారాముల్లా' మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}సినిమా కథ కేవలం అతీంద్రియ శక్తులతో ఆగిపోకుండా పోలీసు వ్యతిరేక సెంటిమెంట్ పెరగడం, పిల్లల రాడికలైజేషన్ వంటి కశ్మీర్ ఘర్షణ వాస్తవ ప్రపంచ ప్రభావాలను కూడా మిళితం చేసింది. ఈ సినిమాలో మానవ్ కౌల్ డీఎస్పీ రిద్వాన్ సయ్యద్గా నటించగా, భాషా సుంబ్లి ఆయన భార్య గుల్నార్ పాత్ర పోషించారు. అరిస్టా మెహతా (నూర్), రోహాన్ సింగ్ (అయాన్) వారి పిల్లల పాత్రల్లో నటించారు. 'బారాముల్లా' మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}