నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు మూడు భాషలకు చెందిన మూడు సినిమాలు.. రెండు బ్లాక్‌బస్టర్లు, ఒక డిజాస్టర్
నెట్‌ఫ్లిక్స్ లోకి ఒకే రోజు మూడు భాషలకు చెందిన సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీస్ ఇందులో ఉన్నాయి. వీటిలో రెండు బ్లాక్‌బస్టర్లు కాగా.. మరొకటి డిజాస్టర్ మూవీ ఉంది.
ఓటీటీలోకి ఈవారం ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం మరింత వినోదం సిద్ధంగా ఉంది. ఈ వీకెండ్ ఈ ఓటీటీలో చూడటానికి ఎంతో కంటెంట్ ఉండటం విశేషం. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళం భాషలకు చెందిన మూడు సినిమా ఒకే రోజు అంటే శుక్రవారం (నవంబర్ 14) అడుగుపెడుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ రిలీజెస్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ ఈవారం అదిరిపోయే కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ శుక్రవారం ఒక్క రోజే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో తెలుగు డిజాస్టర్ మూవీ తెలుసు కదాతోపాటు తమిళ మూవీ డ్యూడ్, హిందీ మూవీ జాలీ ఎల్ఎల్‌బీ 3 ఉన్నాయి.
తెలుసు కదా
సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మూవీ తెలుసు కదా. ఈ సినిమా థియేటర్లలో దారుణంగా బోల్తా పడింది. టిల్లూ, టిల్లూ స్క్వేర్ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం చూస్తున్న సిద్దూకి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 14) నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తుండటంతో ఓటీటీలో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.
డ్యూడ్
ఇక తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ అందించిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ డ్యూడ్. మమితా బైజు కూడా ఇందులో నటించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల మార్క్ అందుకున్న సినిమా ఇది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాకు ఓటీటీలో మరింత ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.
జాలీ ఎల్ఎల్‌బీ 3
హిందీ బ్లాక్‌బస్టర్ లీగల్ కామెడీ మూవీ జాలీ ఎల్ఎల్‌బీ 3 రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా కూడా శుక్రవారమే నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనుంది. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ.170 కోట్ల వరకూ వచ్చాయి. జాలీ ఎల్ఎల్‌బీ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


