...
...
Next Story

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈవారం రానున్న టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్.. హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకు..

Netflix Releases This Week: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈవారం ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వీటిలో హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకు వివిధ జోనర్ల కంటెంట్ ఉంది.

Published on: Sep 28, 2026, 16:01:57 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Releases This Week: ఓటీటీ లవర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ ఈ వారం మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రొమాంటిక్ కామెడీలు, మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్స్, కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ డ్రామాలు, యాక్షన్ అనిమేలతో ఏకంగా 10 కొత్త టైటిల్స్ డిజిటల్ స్పేస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ వారం మీ వెకేషన్ లేదా వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఏ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేర్చుకోవాలో ఫుల్ డిటైల్స్ ఇక్కడ చూసేయండి.

రొమాంటిక్ డ్రామాలు, గూస్‌బంప్స్ తెప్పించే అనిమే థ్రిల్లర్స్

1. #లవ్ (#Love)

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈవారం రానున్న టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్.. హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకు..
Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈవారం రానున్న టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్.. హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకు..

రిలీజ్ డేట్: అక్టోబర్ 2

తమిళంలో రూపొందిన ఈ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక డేటింగ్ యాప్ ఫౌండర్, ఇన్వెస్టర్ మధ్య ప్రేమకు సంబంధించిన కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ అండ్ హేట్ రిలేషన్‌షిప్ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

2. డెమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్ (Demon Slayer: Infinity Castle)

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 28

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న జపనీస్ యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ మూవీ ఇది. ఐఎమ్‌డిబి (IMDb)లో 8.4 రేటింగ్‌ సాధించిన ఈ చిత్రం ఇప్పటివరకు 12 ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంది. 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్‌తో సాగే ఈ సినిమా యాక్షన్ లవర్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయం.

రియల్ లైఫ్ డ్రామాలు, ఎమోషనల్ బాండింగ్స్

3. ఆఫ్టర్ ది క్వేక్ (After the Quake)

రిలీజ్ డేట్: అక్టోబర్ 4

రిలీజ్ డేట్: అక్టోబర్ 1

గతంలో థియేటర్లలో విడుదలైన ఈ హిందీ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది. ఒక వీధి కుక్కకు, ఒక చిన్న కుర్రాడికి మధ్య ఉన్న అపూర్వమైన అనుబంధం చుట్టూ కథ నడుస్తుంది. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, రాజేష్ కుమార్, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఐఎమ్‌డిబిలో ఈ సినిమాకు 6.4 రేటింగ్ వచ్చింది.

5. డూయింగ్ లైఫ్ (Doing Life)

రిలీజ్ డేట్: అక్టోబర్ 2

ఒక సింగిల్ మదర్, జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ మధ్య సాగే హృదయవిదారకమైన లవ్ స్టోరీ ఇది. వీరిద్దరూ ఒకరికొకరు రాసుకునే ప్రేమ లేఖల ద్వారా ఒకరి జీవితంలోకి ఒకరు ఎలా ప్రవేశించారు అనేది కథాంశం.

హారర్, మిస్టరీ, క్రైమ్ డాక్యుమెంటరీలు

6. ది ఫ్రెండ్ (The Friend)

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 28

సిగ్రిడ్ నునెజ్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన అమెరికన్ కామెడీ డ్రామా ఇది. నవోమి వాట్స్ ఇందులో 'ఐరిస్' అనే రైటర్ పాత్రలో నటించారు. తన గురువు, ప్రాణస్నేహితుడు వాల్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఐరిస్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. ఆయన వదిలివెళ్లిన పెంపుడు కుక్కకు, ఐరిస్‌కు మధ్య ఏర్పడే అనుబంధమే ఈ సినిమా హైలైట్.

7. ది విడోవర్: టిల్ డెత్ డూ అస్ అపార్ట్ (The Widower: Till Death Do Us Part)

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 30

లాస్ వేగాస్‌కు చెందిన థామస్ రాండోల్ఫ్ అనే వ్యక్తికి సంబంధించిన నిజమైన క్రైమ్ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ ఇది. థామస్ ఆరు పెళ్లిళ్లు చేసుకోగా, అందులో నలుగురు భార్యలు అత్యంత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మిస్టరీని ఇందులో థ్రిల్లింగ్‌గా చూపించారు.

8. ది ఉమెన్ ఇన్ ది యార్డ్ (The Woman in the Yard)

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 28

కార్ యాక్సిడెంట్‌లో భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బతుకుతున్న ఒక మహిళకు ఎదురైన భయంకరమైన అనుభవాల చుట్టూ సాగే సైకలాజికల్ హారర్ మూవీ ఇది. ఆమె ఇంటి పెరట్లో (యార్డ్) నిరంతరం ఒక వింత మహిళ కనిపిస్తుండటంతో కథ తీవ్రమైన భయాందోళనల నడుమ సాగుతుంది.

ఫన్నీ టాక్ షోలు, రచ్చ లేపే కామెడీ సిరీస్‌లు

9. చుంబక్ (Chumbak)

రిలీజ్ డేట్: ఈ వారంలో

ఇప్పటికే 8 ఎపిసోడ్లతో ఆకట్టుకున్న పాపులర్ కామెడీ సిరీస్ 'చుంబక్' నుంచి కొత్త ఎపిసోడ్లు ఈ వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. కుటుంబ సమేతంగా నవ్వుకునేందుకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

10. సండే బ్రంచ్ విత్ కామ్యా జానీ (Sunday Brunch with Kamiya Jani)

రిలీజ్ డేట్: ఈ వారంలో

యూట్యూబ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీ టాక్ షో 'సండే బ్రంచ్ విత్ కామ్యా జానీ' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. హోస్ట్ కామ్యా జానీ సెలబ్రిటీలతో బ్రంచ్ చేస్తూ వారి పర్సనల్ లైఫ్, కెరీర్ సీక్రెట్స్‌ను సరదాగా ముచ్చటించే ఈ షో ఈ వారంలోనే ల్యాండ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks