Netflix: ఈ శుక్రవారం అంటే ఆగస్ట్ 14 వీకెండ్ బింజ్ వాచ్ ప్లాన్ చేసుకుంటున్న ఓటీటీ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే లైనప్‌తో సిద్ధమైంది. ఒక్క రోజే ఏకంగా 5 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేయడానికి గ్రాండ్ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో షాహిద్ కపూర్, రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ 'కాక్‌టెయిల్ 2'తో పాటు విదేశీ యాక్షన్, కామెడీ, స్పోర్ట్స్ డ్రామాలు ఉన్నాయి.
కాక్‌టెయిల్ 2 (Cocktail 2)

హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన 'కాక్‌టెయిల్ 2' ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లో మెయిన్ అట్రాక్షన్. షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇండియాలో రూ. 95.44 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ. 147.67 కోట్లు వసూలు చేసి మంచి హిట్‌గా నిలిచింది.
కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్నా) లవ్ లైఫ్‌లోకి పాత ఫ్రెండ్ ఎల్లీ (కృతి సనన్) ఎంట్రీ ఇవ్వడంతో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు జరిగాయనేది ఈ సినిమా కథ. ఐఎండీబీ (IMDb)లో 7.6 రేటింగ్ సాధించిన ఈ చిత్రం వీకెండ్ వినోదానికి పర్‌ఫెక్ట్ ఛాయిస్.
ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా..
బాలీవుడ్ మూవీతో పాటు విభిన్న జానర్లకు చెందిన 4 ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లు కూడా ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో ల్యాండ్ అవుతున్నాయి.
2. డోంట్ సే గుడ్‌లక్ (Don't Say Goodluck)
ఇది ఒక హృదయానికి హత్తుకునే అమెరికన్ మ్యూజికల్ ఎమోషనల్ డ్రామా. హైస్కూల్ మ్యూజికల్ ఈవెంట్‌లో లీడ్ రోల్ ప్లే చేసే సోఫీ బిరెన్‌బామ్ అనే అమ్మాయి, స్టేజ్ పైన మాత్రమే కాకుండా తన రియల్ లైఫ్‌లోనూ ఎలాంటి ఫ్యామిలీ డ్రామా ఎదుర్కొందో ఇందులో చూపించారు.
3. మై బెస్ట్ ఫ్రెండ్, హిజ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ మీ
జర్మన్ భాషలో రూపొందిన ప్యూర్ ఫ్రెండ్షిప్ కామెడీ మూవీ ఇది. ప్రాణస్నేహితులైన ఆలీ, మ్యాట్జే జీవితంలోకి ఒక అమ్మాయి రొమాంటిక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి వెకేషన్ ప్లాన్స్, ఫ్రెండ్షిప్ ఏ విధంగా మారిపోయాయో అవుట్ అండ్ అవుట్ ఫన్నీగా తెరకెక్కించారు.
4. ఉమ్టేటో (Umtehtoh)
{{/usCountry}}జర్మన్ భాషలో రూపొందిన ప్యూర్ ఫ్రెండ్షిప్ కామెడీ మూవీ ఇది. ప్రాణస్నేహితులైన ఆలీ, మ్యాట్జే జీవితంలోకి ఒక అమ్మాయి రొమాంటిక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి వెకేషన్ ప్లాన్స్, ఫ్రెండ్షిప్ ఏ విధంగా మారిపోయాయో అవుట్ అండ్ అవుట్ ఫన్నీగా తెరకెక్కించారు.
4. ఉమ్టేటో (Umtehtoh)
{{/usCountry}}ఆఫ్రికన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఇంటెన్స్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. 'ఉమ్టెటో' అంటే వారి భాషలో చట్టం అని అర్థం. జైల్లో ఉన్న తన తమ్ముడిని రక్షించుకోవడానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్యాంగ్‌స్టర్ టీమ్‌లో డబుల్ ఏజెంట్‌గా మారే కథాంశంతో ఇది ఊపిరి బిగబట్టేలా సాగుతుంది.
5. టు ది మ్యాక్స్ (To The Max)
నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన స్పానిష్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్, వింగ్‌సూట్ బేస్ జంపింగ్ ఇష్టపడే కొందరు ఫ్రెండ్స్ జీవితంలో ఎదురైన ఊహించని ప్రమాదాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి.