Romantic Web Series: కోలీవుడ్ రొమాంటిక్ డ్రామా లవర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేసింది. సుపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ షో రన్నర్‌గా, 'లవ్ ఫెయిల్యూర్' ఫేమ్ బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ ఒరిజినల్ వెబ్ సిరీస్ '#Love' గ్రాండ్ ఓటీటీ ప్రీమియర్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది.

పవర్‌ఫుల్ వాయిస్‌తో కట్టిపడేసే అర్జున్ దాస్, నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించే ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్స్ చేసిన ఈ మోడరన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
కెమిస్ట్రీ వర్సెస్ కంపాటిబిలిటీ.. డేటింగ్ యాప్‌ల వార్
నేటి యూత్ లవ్ లైఫ్, ఆన్‌లైన్ డేటింగ్ కల్చర్‌కు అద్దం పడుతూ ఈ లవ్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. 'FOUND', 'Find My Bae' అనే రెండు ప్రత్యర్థి డేటింగ్ యాప్స్‌కు ఫౌండర్లుగా ఉండే మ్యాథ్యూ (అర్జున్ దాస్), తారా (ఐశ్వర్య లక్ష్మి) లవ్, రైవల్రీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
వేలాది మందికి ఆన్‌లైన్‌లో మ్యాచ్ మేకింగ్ చేసే ఈ ఇద్దరు బిజినెస్ రైవల్స్, తమ సొంత ప్రేమకథ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్‌కు గురయ్యారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించబోతున్నారు. స్వైప్‌లు, మ్యాచ్‌లు, అన్‌రీడ్ మెసేజ్‌ల మధ్య సాగే ఈ మోడరన్ రొమాంటిక్ రైడ్ ఓటీటీ ఆడియన్స్‌ను విశేషంగా అలరిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సౌందర్య రజనీకాంత్, బాలాజీ మోహన్ క్రేజీ కాంబో
మాయ్6 ఎంటర్‌టైన్మెంట్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సౌందర్య రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. "ఈనాటి రిలేషన్‌షిప్స్‌లోని సంక్లిష్టతలను ఎంతో హత్తుకునేలా, ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేయడం నన్ను ఆకట్టుకుంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల ఫ్రెష్ ఎనర్జీ ఈ సిరీస్‌కు మెయిన్ హైలైట్" అని సౌందర్య వెల్లడించారు.
{{/usCountry}}మాయ్6 ఎంటర్‌టైన్మెంట్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై సౌందర్య రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. "ఈనాటి రిలేషన్‌షిప్స్‌లోని సంక్లిష్టతలను ఎంతో హత్తుకునేలా, ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేయడం నన్ను ఆకట్టుకుంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల ఫ్రెష్ ఎనర్జీ ఈ సిరీస్‌కు మెయిన్ హైలైట్" అని సౌందర్య వెల్లడించారు.
{{/usCountry}}'లవ్ ఫెయిల్యూర్', 'మారి' చిత్రాలతో సిద్ధార్థ్, ధనుష్‌లను సరికొత్తగా ఆవిష్కరించిన డైరెక్టర్ బాలాజీ మోహన్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. కేవలం ప్రేమే కాకుండా స్నేహం, కుటుంబం, కెరీర్ లక్ష్యాల వంటి వివిధ ఎమోషన్స్‌ను ఈ సిరీస్‌లో ఆవిష్కరించామని బాలాజీ చెప్పారు.
సౌత్ కంటెంట్‌పై నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ ఫోకస్
సౌత్ ఇండియన్ కంటెంట్ విస్తరణపై నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనిక షెర్గిల్ స్పందించారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఈ సంవత్సరం సౌత్ కంటెంట్ పరంగా ఎంతో కీలకమైనదని, '#Love' సిరీస్ మోడరన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ రొమాంటిక్ కామెడీగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంటెన్స్ యాక్షన్ రోల్స్ ద్వారా పవర్ ఫుల్ వాయిస్‌తో ఆకట్టుకున్న అర్జున్ దాస్ ('కైతి', 'మాస్టర్' ఫేమ్), నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ఐశ్వర్య లక్ష్మి ('గట్ట కుస్తీ', 'పొన్నియిన్ సెల్వన్' ఫేమ్) మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.