Romantic Web Series: నెట్‌ఫ్లిక్స్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన '#లవ్' (#Love) వెబ్ సిరీస్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "ప్రేమ విషయానికి వస్తే కెమిస్ట్రీ గెలుస్తుందా? లేక కాంపాటిబిలిటీ నెగ్గుతుందా?" అంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ వేసిన క్వశ్చన్ నెటిజన్లను, ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది.
5 భాషల్లో గ్రాండ్ రిలీజ్... అక్టోబర్ 2న స్ట్రీమింగ్

ఈ మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. సౌత్ ఆడియెన్స్ అందరికీ చేరువయ్యేలా ఒక్క భాషలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నారు.
లాంగ్ వీకెండ్ హాలిడేస్ ప్లాన్ చేసుకునే ఓటీటీ లవర్స్‌కి ఈ వెబ్ సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి సోషల్ మీడియాలో ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
కెమిస్ట్రీ Vs కాంపాటిబిలిటీ... రిలేషన్‌షిప్స్ పై కొత్త కోణం
ఈ రోజుల్లో మారుతున్న రిలేషన్‌షిప్స్, యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉండే అట్రాక్షన్ లేదా కెమిస్ట్రీ మాత్రమే పెళ్లి లేదా ప్రేమ బంధాన్ని నిలబెడుతుందా, లేక ఆలోచనలు కలిసే కంపాటిబిలిటీ అవసరమా అనే మెయిన్ పాయింట్‌తో కథ సాగనుంది.
రెండు వేర్వేరు డేటింగ్ యాప్స్ నడిపే ఇద్దరి మధ్య మొదలయ్యే ప్రేమ, ఆ తర్వాత అది ఎక్కడికి దారి తీసిందన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ట్రైలర్లో కెమెస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.
ట్రైలర్లో చూపించిన విజువల్స్, నటీనటుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చాలా నేచురల్‌గా అనిపిస్తున్నాయి. రొటీన్ రొమాంటిక్ కామెడీ సినిమాల్లా కాకుండా, కాస్త ప్రాక్టికల్ థాట్స్‌తో ఈ జనరేషన్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ 'సౌత్‌వర్స్' ప్రచారం... సౌత్ కంటెంట్‌కి విపరీతమైన క్రేజ్
{{/usCountry}}ట్రైలర్లో చూపించిన విజువల్స్, నటీనటుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చాలా నేచురల్‌గా అనిపిస్తున్నాయి. రొటీన్ రొమాంటిక్ కామెడీ సినిమాల్లా కాకుండా, కాస్త ప్రాక్టికల్ థాట్స్‌తో ఈ జనరేషన్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ 'సౌత్‌వర్స్' ప్రచారం... సౌత్ కంటెంట్‌కి విపరీతమైన క్రేజ్
{{/usCountry}}దక్షిణాది సినిమాలకు ఓటీటీలో వస్తున్న విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ 'సౌత్‌వర్స్' (Southverse) పేరుతో ప్రత్యేకమైన కేటగిరీని ప్రమోట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సెర్చ్ బార్‌లో 'Southverse' అని టైప్ చేస్తే చాలు, సౌత్ ఇండియాకి చెందిన టాప్ క్లాస్ మూవీస్, వెబ్ సిరీస్‌లు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి.
''#లవ్' (#Love)' వెబ్ సిరీస్ ను కూడా ఈ సౌత్‌వర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగానే భారీగా ప్రమోట్ చేస్తున్నారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను, ఇంటెన్స్ లవ్ స్టోరీలను ఆదరించే ఓటీటీ ఆడియెన్స్‌కి ఇది కచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ కానున్న ఈ సిరీస్ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.