Netflix Tamil: ఈ ఏడాది దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో తమిళ సినిమా తనదైన వినూత్న కథాంశాలు, మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌లతో గ్లోబల్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కోలీవుడ్ మూవీస్ విపరీతమైన వ్యూస్‌ను సాధిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా (Netflix India) తమ సోషల్ మీడియా వేదికగా "తమిళ సినిమా దిస్ ఇయర్" అంటూ ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను షేర్ చేస్తూ కొనియాడింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై గ్లోబల్ ట్రెండింగ్‌లో నిలిచిన 4 ప్రముఖ తమిళ సినిమాలను ఒకే పోస్టర్లో డిజైన్ చేసి షేర్ చేయడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేసిన ఆ 4 తమిళ చిత్రాలు ఇవే
1. విశ్వనాథ్ & సన్స్ (Vishwanath & Sons)
స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఇండియా వ్యాప్తంగా మోస్ట్ వాచ్డ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. సూర్య నటన, తండ్రీ-కొడుకుల మధ్య సాగే భావోద్వేగాలు ఓటీటీ వీక్షకులను విశేషంగా అలరించాయి.
2. బత్తా (Bathttha)
వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ ‘బత్తా’. ఒక గ్యాంగ్‌స్టర్ జీవితంలో జరిగే అనూహ్య పరిణామాలు, విజయ్ సేతుపతి మార్క్ టైమింగ్, చిన్న పిల్లాడు తనను బాత్రూమ్ లో లాక్ చేసిన తర్వాత గ్యాంగ్‌స్టర్ లో వచ్చే మార్పుని కామెడీతోపాటు మంచి మెసేజ్ జోడించి తీసిన విధానం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఉంది.
3. డోరోతి (Dorothy)
ఈ ఏడాది తమిళ సినిమా నుంచి వచ్చిన మరో ఆణిముత్యంలాంటి సినిమా డోరోతి. కాస్త బోల్డ్ కంటెంటే అయినా సమాజంలో ట్రాన్స్జెండర్ల సమస్యలను కళ్లకు కట్టిన మూవీ ఇది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది. థియేటర్లలో క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా.. నెట్‌ఫ్లిక్స్ లో మరింత దూసుకుపోతుంది.
4. మొద రాత్రి (Modha Rathri)
{{/usCountry}}ఈ ఏడాది తమిళ సినిమా నుంచి వచ్చిన మరో ఆణిముత్యంలాంటి సినిమా డోరోతి. కాస్త బోల్డ్ కంటెంటే అయినా సమాజంలో ట్రాన్స్జెండర్ల సమస్యలను కళ్లకు కట్టిన మూవీ ఇది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది. థియేటర్లలో క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా.. నెట్‌ఫ్లిక్స్ లో మరింత దూసుకుపోతుంది.
4. మొద రాత్రి (Modha Rathri)
{{/usCountry}}మొద రాత్రి మరో సర్ప్రైజ్ మూవీ. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిని సినిమా ఇది. ఇష్టం లేని పెళ్లి చేసుకొని మొదటి రాత్రే ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయే అమ్మాయి.. ఆమెకు సాయం చేసే భర్త చుట్టూ తిరిగే ఈ మూవీకి కూడా ఓటీటీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
గ్లోబల్ స్థాయిలో తమిళ కంటెంట్ క్రేజ్
గత కొద్దికాలంగా ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోయి ప్రతీ భాషా చిత్రానికి ఓటీటీలో ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌లు తమిళ కంటెంట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వీక్షకులు సైతం సబ్‌టైటిల్స్‌తో ఈ చిత్రాలను ఆస్వాదిస్తున్నారు.
సూర్య, విజయ్ సేతుపతి వంటి స్టార్ల ప్రాజెక్ట్‌లతో పాటు కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తుండటం తమిళ చిత్రసీమ సత్తాను చాటిచెబుతోంది.