నెట్‌ఫ్లిక్స్ ఈ మధ్యే సౌత్ భాషల్లో ఒరిజనల్ కంటెంట్ పెంచుతోంది. అలా తమిళంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తోంది. ఈ మూవీ పేరు స్టీఫెన్. బుధవారం (నవంబర్ 26) మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. గతంలో ఓ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ట్రైలర్ తో మరింత ఆసక్తి రేపారు.
సీరియల్ కిల్లర్ స్టోరీగా స్టీఫెన్

'స్టీఫెన్' నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న తమిళ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆ ఓటీటీ తాజాగా విడుదల చేసింది. ట్రైలర్ ప్రారంభం ఒక న్యూస్ రీడర్ వాయిస్‌తో మొదలవుతుంది. యువతులను లక్ష్యంగా చేసుకున్న సీరియల్ కిల్లర్ కేసు గురించి చెబుతూ ఉంటుంది. ఈ హత్యలకు తానే కారణమని అంగీకరించిన ముద్దాయి స్టీఫెన్ జెభరాజ్.. తనకు లాయర్ కూడా అవసరం లేదని కోర్టులో చెబుతాడు.
అతను తొమ్మిది మంది మహిళలను దారుణంగా హత్య చేసినట్లు తేలుతుంది. అయితే ఆ హత్యలు ఎందుకు, ఎవరితో కలిసి చేశాడు అనే ప్రశ్నల చుట్టూ తిరిగే ఈ కథనం ఆసక్తి రేపుతోంది. అసలు అతడు అన్ని హత్యలు చేసిన తర్వాత తనకు తానుగా ఎందుకు లొంగిపోయాడు అన్నది కూడా మూవీలో ఆసక్తి రేపే అంశం కానుంది.
స్టీఫెన్ మూవీ గురించి..
అరంగేట్ర దర్శకుడు మిథున్ బాలాజీ ఈ స్టీఫెన్ మూవీకి దర్శకత్వం వహించాడు. గోమతి శంకర్ టైటిల్ రోల్‌లో నటించాడు. ఇదే అతనికి తొలి లీడ్ రోల్. గోమతి శంకర్ తోపాటు మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తన పాత్ర గురించి నటుడు గోమతి శంకర్ మాట్లాడుతూ.. "స్టీఫెన్ సాధారణ లీడ్ రోల్ కాదు. ఆ పాత్రలో చాలా లేయర్స్, ఊహించలేని స్వభావం ఉన్నాయి. అతని పాత్ర ఎప్పుడూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఆ పాత్రలోకి అడుగుపెట్టడం ఉత్సాహంగా, సవాలుగా, సంతృప్తికరంగా అనిపించింది. నేను కూడా సహ రచయితగా ఉండటం వల్ల ఆ పాత్రకు మరింత సులభంగా అనుగుణంగా మారగలిగాను" అని తెలిపాడు.
{{/usCountry}}తన పాత్ర గురించి నటుడు గోమతి శంకర్ మాట్లాడుతూ.. "స్టీఫెన్ సాధారణ లీడ్ రోల్ కాదు. ఆ పాత్రలో చాలా లేయర్స్, ఊహించలేని స్వభావం ఉన్నాయి. అతని పాత్ర ఎప్పుడూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఆ పాత్రలోకి అడుగుపెట్టడం ఉత్సాహంగా, సవాలుగా, సంతృప్తికరంగా అనిపించింది. నేను కూడా సహ రచయితగా ఉండటం వల్ల ఆ పాత్రకు మరింత సులభంగా అనుగుణంగా మారగలిగాను" అని తెలిపాడు.
{{/usCountry}}దర్శకుడు మిథున్ బాలాజీ తన మొదటి సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు. "స్టీఫెన్ నిశ్శబ్దంగా సాగిపోయే సినిమా. కానీ ఇది నేరం, జ్ఞాపకాలు, మధ్యలో వేధించే ప్రతి అంశం గురించి చెబుతుంది. ఈ కథ చెప్పడం నాకు వ్యక్తిగతమైనది. కాస్త రిస్క్‌తో కూడుకున్నదిగా అనిపించింది. అందుకే ఇది మరింత ఎక్సైటింగ్‌గా మారింది" అని వివరించాడు.
ఓ కొత్త డైరెక్టర్, తొలిసారి లీడ్ రోల్లో నటించిన నటుడితో నెట్‌ఫ్లిక్స్ ఓ ఒరిజినల్ మూవీ తీయడం విశేషమే. ఇదే స్టీఫెన్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.