నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. వీటిలో బాగా ఆకర్షిస్తున్నంది సందీప్ కిషన్ నటించిన కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. మంగళవారం (ఫిబ్రవరి 3) ఆ ఓటీటీ టీజర్ రిలీజ్ చేసింది. ఇది ఫన్నీగా సాగిపోయింది.
సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ టీజర్

నెట్‌ఫ్లిక్స్ గతేడాదే తమ ప్లాట్‌ఫామ్ లోకి రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ గురించి వెల్లడించగా.. అందులో ఈ సూపర్ సుబ్బు కూడా ఉంది. ఇప్పుడీ కామెడీ సిరీస్ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటిస్తున్నాడు ప్రముఖ నటుడు సందీప్ కిషన్. చిన్నతనం నుంచి చిల్లర పనులు చేస్తూ పెరిగే అతడు పెళ్లి కోసం ప్రయత్నిస్తూ 60 మందితో నో చెప్పించుకుంటాడు.
ఓవైపు తండ్రితో తిట్లు తింటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి మాకీపూర్ అనే ఊళ్లో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా జాబ్ వస్తుంది. అక్కడ పాస్ పోసినంత ఈజీగా పిల్లలను కంటారంటూ ఈ టీజర్లో చూపించారు. అలాంటి ఊళ్లోకి వెళ్లి కుటుంబ నియంత్రణ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ వెరైటీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ గురించి..
ఈ కామెడీ వెబ్ సిరీస్ ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా.. చిలక ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ కు రైట్ సబ్జెక్ట్ రాంగ్ టీచర్ అనే ట్యాగ్ లైన్ ఉండటం విశేషం. ఇదొక రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ లా కనిపిస్తోంది. మురళీ శర్మ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. “ఈ టీచర్ నేర్చుకోవడానికి, నేర్పడానికి వస్తున్నాడు” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేసింది.
ఈ తెలుగు వెబ్ సిరీస్ తోపాటు పలు హిందీ వెబ్ సిరీస్ ల టీజర్లను కూడా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. వీటిలో దిండోరా సీజన్ 2, హలో బచ్చో, ముసాఫిర్ కేఫ్, హమ్ హిందుస్థానీలాంటి వెబ్ సిరీస్ వీటిలో ఉన్నాయి. వీటిలో రిలీజ్ డేట్లతోపాటు ఇతర వివరాలను త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వెల్లడించనుంది.
{{/usCountry}}ఈ తెలుగు వెబ్ సిరీస్ తోపాటు పలు హిందీ వెబ్ సిరీస్ ల టీజర్లను కూడా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. వీటిలో దిండోరా సీజన్ 2, హలో బచ్చో, ముసాఫిర్ కేఫ్, హమ్ హిందుస్థానీలాంటి వెబ్ సిరీస్ వీటిలో ఉన్నాయి. వీటిలో రిలీజ్ డేట్లతోపాటు ఇతర వివరాలను త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వెల్లడించనుంది.
{{/usCountry}}