నెట్‌ఫ్లిక్స్‌లో ఇక ఈ టాప్ మూవీస్ కనిపించవు.. యాక్షన్ లవర్స్ వెంటనే చూసేయండి.. ఆ 8 సినిమాలు ఇవే
హాలీవుడ్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సిరీస్‌ను ఇష్టపడే ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. మార్చి 1 నుంచి ఏకంగా 8 సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ఇండియా నుండి వెళ్లిపోనున్నాయి.
ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో హాలీవుడ్ సినిమాలను చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యాక్షన్ మూవీస్ కు ఫాలోయింగ్ ఎక్కువ. అందులోనూ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంఛైజీకి అయితే లక్షల్లో అభిమానులు ఉన్నారు. దీనికి సంబంధించిన సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ అవన్నీ త్వరలోనే కనిపించకుండా పోనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూడండి.

నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోతున్న 8 సినిమాలు ఇవే..
హాలీవుడ్ నుంచి 2001లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ప్రారంభమైంది. అప్పటి నుంచీ ఈ సినిమాలు మెరుపు వేగంతో దూసుకెళ్లే కార్లు, యాక్షన్ తో అలరిస్తున్నాయి. ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకం చేసింది మాత్రం పాల్ వాకర్, విన్ డీజిల్ అనే చెప్పాలి. ఇప్పుడీ ఫ్రాంచైజీ మళ్లీ వార్తల్లో నిలిచింది.
మార్చి 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఇండియా (Netflix India) ప్లాట్‌ఫామ్ నుండి ఏకంగా ఎనిమిది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలు కనిపించవు. మీరు వాటిని మళ్లీ చూడాలని అనుకుంటే లేదా ఒకేసారి సిరీస్ మొత్తం చూడాలని ప్లాన్ చేస్తుంటే, నెట్‌ఫ్లిక్స్‌లో వాటిని స్ట్రీమ్ చేయడానికి మీకు ఇదే చివరి అవకాశం. వెళ్లిపోతున్న ఆ సినిమాల జాబితా ఇదే.
ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ - 2001
2 ఫాస్ట్ 2 ఫ్యూరియస్ - 2003
ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్: టోక్యో డ్రిఫ్ట్ - 2006
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ - 2009
ఫాస్ట్ ఫైవ్ - 2011
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6 - 2013
ఫ్యూరియస్ 7 - 2015
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రెజెంట్స్: హాబ్స్ అండ్ షా - 2019
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంఛైజీ విశేషాలు
ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లోని మొదటి కొన్ని సినిమాలు ప్రధానంగా వీధుల్లో జరిగే కార్ రేసింగ్ చుట్టూ తిరిగాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మిషన్లు, భారీ యాక్షన్ సీన్లతో కథ మరింత పెద్దదైంది. 'ఫాస్ట్ ఫైవ్' సినిమా ఈ సిరీస్ రూపురేఖలనే పూర్తిగా మార్చేసింది. అలాగే 'ఫ్యూరియస్ 7' ఈ ఫ్రాంచైజీలో అత్యంత ఎమోషనల్ మూవీ ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇన్ని సినిమాలు ఒకేసారి నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోతుండటం ఫ్యాన్స్‌కు ఒక పెద్ద షాకే.
ఇక ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించి చెప్పాలంటే.. ఈ కథ ఇప్పుడే ముగిసిపోవడం లేదు. ఈ సిరీస్ నుంచి రాబోయే నెక్ట్స్ సినిమాకు 'ఫాస్ట్ ఫరెవర్' అని పేరు పెట్టారు. 2023లో విడుదలైన 'ఫాస్ట్ ఎక్స్' సినిమా కథకు కొనసాగింపుగా ఇది రానుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా మార్చి 17, 2028న థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


