నెట్‌ఫ్లిక్స్ లోకి ఈవారం రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు భాషల్లో మూడు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. ఈ గురు, శుక్రవారాల్లో ఇవి రాబోతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వస్తున్న ఈ మూవీస్, సిరీస్ గురించి తెలుసుకుందాం.
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1

నెట్‌ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 గురువారం (నవంబర్ 27) స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త సీజన్ తొలి వాల్యూమ్ అందుబాటులోకి రానుంది. ఇందులో నాలుగు ఎపిసోడ్లు ఉంటాయి. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి. ఉదయం 6.30 గంటలకు ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ మొదలవుతుంది.
సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి
జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ నటించిన హిందీ మూవీ సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి. ఈ సినిమా కూడా గురువారమే స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ విషయాన్ని బుధవారం (నవంబర్ 26) ఆ ఓటీటీ వెల్లడించింది. ముహూర్తం ఫిక్సయింది అనే క్యాప్షన్ తో ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ట్వీట్ చేసింది.
మాస్ జాతర
రవితేజ డిజాస్టర్ మూవీ మాస్ జాతర శుక్రవారం (నవంబర్ 28) డిజిటల్ ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మాస్ హీరోకి మరో చేదు అనుభవాన్ని మిగిల్చిన సినిమా ఇది. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఇందులో శ్రీలీల కూడా నటించగా.. భాను భోగవరపు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తెలుగుతోపాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటంతో ఓటీటీలో మెరుగైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
ఆర్యన్
తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్. విష్ణు విశాల్ నటించి, ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా కూడా శుక్రవారం (నవంబర్ 28) స్ట్రీమింగ్ కు వస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఏం చేస్తుందో చూడాలి.
{{/usCountry}}తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆర్యన్. విష్ణు విశాల్ నటించి, ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా కూడా శుక్రవారం (నవంబర్ 28) స్ట్రీమింగ్ కు వస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఏం చేస్తుందో చూడాలి.
{{/usCountry}}