...
...
Next Story

నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆనంద్ దేవరకొండ మూవీ, సందీప్ కిషన్ వెబ్ సిరీస్.. మరో నాలుగు తమిళ వెబ్ సిరీస్, మూవీస్ కూడా..

నెట్‌ఫ్లిక్స్ సోమవారం (అక్టోబర్ 13) తన ఓటీటీలోకి రాబోయే సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను వెల్లడించింది. వీటిలో ఆనంద్ దేవరకొండ మూవీ, సందీప్ కిషన్ వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటితోపాటు రెండు తమిళ వెబ్ సిరీస్, మూవీస్ ను కూడా ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.

Published on: Oct 13, 2025, 14:14:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తన తొలి తెలుగు వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు సూపర్ సుబ్బు. కొన్నాళ్ల కిందట చిన్న టీజర్ తో ఈ విషయాన్ని వెల్లడించిన ఆ ఓటీటీ.. తాజాగా మరోసారి స్ట్రీమింగ్ సూన్ అంటూ ఓ పోస్టర్ షేర్ చేసింది. దీనికితోడు ఆనంద్ దేవరకొండ నటించిన తక్షకుడు (Takshakudu) మూవీ కూడా నేరుగా రాబోతోంది.

తక్షకుడు ఓటీటీ రిలీజ్

నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆనంద్ దేవరకొండ మూవీ, సందీప్ కిషన్ వెబ్ సిరీస్.. మరో నాలుగు తమిళ వెబ్ సిరీస్, మూవీస్ కూడా..
నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆనంద్ దేవరకొండ మూవీ, సందీప్ కిషన్ వెబ్ సిరీస్.. మరో నాలుగు తమిళ వెబ్ సిరీస్, మూవీస్ కూడా..

ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తమ్ముడు, నటుడు అయిన ఆనంద్ దేవరకొండ నేరుగా మరో ఓటీటీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ తీసిన డైరెక్టర్ వినోద్ అనంతోజుతోనే ఆనంద్ ఈ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీకి తక్షకుడు అనే ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మూవీని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెబుతూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇందులో ఆనంద్ దేవరకొండ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఓ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో ఓ మండుతున్న గన్ ను పట్టుకొని కనిపించాడు. వేటగాని చరిత్లలో జింక పిల్లలే నేరస్థులు అనే క్యాప్షన్ ఈ పోస్టర్ పై చూడొచ్చు. ఈ మూవీ టైటిల్, పోస్టర్, స్టోరీ అన్నీ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇదో రివేంజ్ డ్రామాగా చెబుతున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సినిమా రానుంది. ఆనంద్, వినోద్ కాంబినేషన్ లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

సూపర్ సుబ్బు వెబ్ సిరీస్

తెలుగులోనే కాదు పలు తమిళ వెబ్ సిరీస్, సినిమాలను కూడా నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. వీటిలో లెగసీ అనే సిరీస్ ఉంది. ఇందులో మాధవన్, నిమిషా సజయన్ లాంటి వాళ్లు నటిస్తుండటం విశేషం. ఇదే కాకుండా #Love అనే మరో వెబ్ సిరీస్ కూడా రానుంది. దీనికి బాలాజీ మోహన్ డైరెక్టర్ కాగా.. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిలాంటి వాళ్లు నటిస్తున్నారు.

ఇక మేడిన్ కొరియా అనే తమిళ సినిమా కూడా రానుంది. రాజ్ కార్తీక్ డైరెక్ట్ చేయగా.. ప్రియాంకా మోహన్, స్క్విడ్ గేమ్ ఫేమ్ పార్క్ హి జిన్ నటిస్తుండటం విశేషం. మరొకటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టీఫెన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. మిథున్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గోమథి శంకర్ నటించాడు.

మొత్తంగా నెట్‌ఫ్లిక్స్ ఒకే రోజు ఆరు తెలుగు, తమిళ వెబ్ సిరీస్, సినిమాలను అనౌన్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. అది కూడా రెండు భాషల్లోని ప్రముఖ నటీనటులు, డైరెక్టర్లు కావడంతో వీటి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks