...
...
Next Story

నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఇదే.. భయపెడుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా మరో సూపర్ నేచురల్ మిస్టర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 17) ఈ కొత్త సినిమా స్ట్రీమింగ్ గురించి ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. మరి ఆ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

Published on: Oct 17, 2025, 17:20:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నెట్‌ఫ్లిక్స్ వరుస పెట్టి ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ అనౌన్స్ చేస్తోంది. ఈ మధ్యే రెండు తెలుగు, నాలుగు తమిళ మూవీస్, వెబ్ సిరీస్ గురించి చెప్పిన విషయం తెలుసు కదా. తాజాగా బారాముల్లా పేరుతో ఓ హిందీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీని తీసుకొస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది.

బారాముల్లా ఓటీటీ రిలీజ్ డేట్

నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఇదే
నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా వస్తున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఇదే

నటుడు మానవ్ కౌల్ తన తదుపరి మూవీ 'బారాముల్లా'ను అనౌన్స్ చేశాడు. ఇది ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. ఈ సినిమా నవంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

'బారాముల్లా' పోస్టర్‌లో అత్యంత స్పష్టంగా కనిపించే అంశం.. ఎన్నో ఆత్మలను తనలో బంధించుకున్న ఒక కన్ను. ఈ పోస్టర్ చూస్తుంటే, సహాయం కోసం అవి ఆర్తనాదం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ మొత్తం మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించే ఒక వ్యక్తి.. డీఎస్పీ రిద్వాన్ సయ్యద్ (మానవ్ కౌల్) మాత్రమే పోస్టర్‌లో ఉన్నాడు. అతడు కశ్మీర్‌కు కొత్తగా బదిలీ అయిన పోలీస్ ఆఫీసర్. అతని ముందు ఉన్న ఏకైక ఆధారం మంచు పర్వతాలలో ఉన్న ఒక పాడుబడిన భవనం. అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మనిషి కూడా ఈ కేసుతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది.

'బారాముల్లా' విశేషాలు

కథలు, పురాణాలు, వాస్తవాలతో ముడిపడే 'బారాముల్లా' అనే నగరం పేరునే ఈ సినిమాకు పెట్టారు. ఒక చిన్న పిల్లాడు అదృశ్యమవడంతో ఈ చిత్ర కథ మొదలవుతుంది. ఈ అతీంద్రియ మిస్టరీ సినిమాకు ఆదిత్య జంభాలే దర్శకత్వం వహించాడు. ఉరి సినిమాతో ప్రఖ్యాతి గాంచిన ఆదిత్య ధర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇదే కాకుండా నెట్‌ఫ్లిక్స్ ఓ తెలుగు మూవీ, మరో వెబ్ సిరీస్ ను కూడా నేరుగా తీసుకురానున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్ నటించిన సూపర్ సుబ్బు అనే వెబ్ సిరీస్ తోపాటు ఆనంద్ దేవరకొండ నటించిన తక్షకుడు మూవీ కూడా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి రానున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks