...
...
Next Story

Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దంచి కొడుతున్న సౌత్ సినిమాలు.. మలయాళం థ్రిల్లర్, తమిళ కామెడీ.. 3 తెలుగు మూవీస్

Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్ ఇండియన్ సినిమాల హవా కొనసాగుతోంది. తాజాగా టాప్ 10 చిత్రాల జాబితాను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. విజయ్ సేతుపతి 'బత్తా', ఫహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్', సందీప్ కిషన్ 'సిగ్మా' వంటి సినిమాలు టాప్ లో దూసుకుపోతున్నాయి.

Published on: Nov 3, 2026, 18:01:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Top 10 Movies: ప్రస్తుతం ఓటీటీ ప్రియులు విభిన్న కంటెంట్‌కు జై కొడుతున్నారు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ కామెడీలు, ఫాంటసీ కథలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ వారం ఇండియా వ్యాప్తంగా అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాల వివరాలు ఇవే. వీటిలో ఏకంగా 8 మూవీస్ సౌత్ ఇండస్ట్రీలకు చెందినవి కాగా.. మరో రెండు మాత్రమే హిందీకి చెందినవి కావడం గమనార్హం.

1. బత్తా (Baththa) - విజయ్ సేతుపతి

Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దంచి కొడుతున్న సౌత్ సినిమాలు.. మలయాళం థ్రిల్లర్, తమిళ కామెడీ.. 3 తెలుగు మూవీస్
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దంచి కొడుతున్న సౌత్ సినిమాలు.. మలయాళం థ్రిల్లర్, తమిళ కామెడీ.. 3 తెలుగు మూవీస్

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ యాక్షన్ కామెడీ మూవీ ‘బత్తా’. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఓ చిన్న పిల్లాడు బాత్రూమ్ వేసి గొళ్లెం పెట్టిన తర్వాత ఒక గ్యాంగ్‌స్టర్ జీవితంలో జరిగే మార్పులు, హ్యూమర్ మేళవింపుతో సాగే ఈ చిత్రానికి ఐఎండీబీ (IMDb)లో 8.5 రేటింగ్ లభించింది.

2. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Don't Trouble The Trouble)

వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన తెలుగు సూపర్‌నేచురల్ ఫాంటసీ కామెడీ మూవీ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ నేడు ట్రెండింగ్ 2లో నిలిచింది. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ఒక అంబులెన్స్ డ్రైవర్, చిన్నారి పాత్రల చుట్టూ తిరిగే వినోదాత్మక ప్రయాణంతో ఓటీటీ వీక్షకులను అలరిస్తోంది.

3. గజబ్ రాత్ (Gajab Raat) - మనోజ్ బాజ్‌పాయ్

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న రెండు హిందీ సినిమాల్లో ఇది ఒకటి. వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, దివ్య దత్తా నటించిన ఈ గ్రిప్పింగ్ నైట్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ ట్రెండింగ్ 3లో కొనసాగుతోంది.

4. సిగ్మా (Sigma) - సందీప్ కిషన్

థంబే దర్శకత్వంలో వచ్చిన ఈ మలయాళ కామెడీ డ్రామా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ 5వ స్థానంలో నిలిచింది. తండ్రి, ఇద్దరు కొడుకుల మధ్య జరిగే డ్రామా చుట్టూ తిరిగే మూవీ ఇది.

6. మీఠే మే క్యా హై (Meethe Mein Kya Hai)

జాయింట్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో, దీపావళి పండుగ చుట్టూ తిరిగే ఈ ఫ్యామిలీ డ్రామా ఓటీటీలో మంచి వ్యూస్‌తో నంబర్ 6గా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన సినిమా ఇది.

7. డోరోథి (Dorothy)

ఇద్దరు స్నేహితుల మధ్య భావోద్వేగాలు, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్‌లతో వచ్చిన తమిళ చిత్రం 'డోరోథి' 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో కీర్తి సురేష్ ఎక్స్‌టెండెడ్ క్యామియో రోల్ పోషించింది.

8. ఎస్ఐ యుగంధర్ (SI Yugandhar)

ఒక నిష్పాక్షికమైన, నిర్భయమైన పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో రూపుదిద్దుకున్న తెలుగు థ్రిల్లర్ 8వ స్థానంలో నిలిచింది. ఆది హీరోగా నటించాడు.

9. ది పారడైజ్ (The Paradise)

నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం 'ది పారడైజ్' నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ 9లో కొనసాగుతోంది.

10. ధూమకేతు (Dhoomakethu)

సుధి మ్యాడిసన్ దర్శకత్వంలో టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ కామెడీ థ్రిల్లర్ మూవీ 'ధూమకేతు' టాప్ 10వ స్థానంలో నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks