నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులోనూ మలయాళం థ్రిల్లర్లకు కొదవే లేదు. రియలిస్టిక్ యాక్టింగ్, అద్భుతమైన స్క్రీన్ ప్లేకి మలయాళ సినిమా ఇండస్ట్రీ పెట్టింది పేరు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఈ వీకెండ్ అస్సలు మిస్ కాకూడని 5 మలయాళ సినిమాలను ఇక్కడ చూడండి. వీటిలో కొన్ని మూవీస్ 'దృశ్యం' స్థాయి క్లైమాక్స్‌ను కలిగి ఉన్నాయి.
ఆడుజీవితం (ది గోట్ లైఫ్)

ఇది ఒక భారతీయ వలస కార్మికుడు నజీబ్ హృదయ విదారక గాథ. సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లిన నజీబ్.. అక్కడ ఎడారిలో గొర్రెలు కాసే బానిసగా ఎలా బంధీ అయ్యాడనేది ఈ సినిమా కథ. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్ర కోసం చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మనిషి ప్రాణాల కోసం ఎంతటి కష్టాన్నైనా ఎలా ఓర్చుకుంటాడో ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమాకు ఐఎండీబీ 7.1 గా ఉంది.
జన గణ మన
ఒక కాలేజ్ ప్రొఫెసర్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ నిందితులను పట్టుకున్నాక, కథ కోర్టుకు చేరుతుంది. అక్కడ బయటపడే నిజాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి.
చివరి 30 నిమిషాల కోర్టు రూమ్ డ్రామా, డైలాగులు అద్భుతం. ప్రస్తుత రాజకీయాలు, మీడియా ట్రయల్స్ పై ఈ సినిమా బలమైన దెబ్బ కొడుతుంది. దీనికి ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉంది.
నాయట్టు
ఇది ఒక పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్. ముగ్గురు పోలీసులు అనుకోకుండా ఒక ప్రమాదంలో చిక్కుకుంటారు. పోలీసులు అయినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల వల్ల తమ సొంత డిపార్ట్‌మెంట్ నుండే తప్పించుకోవాల్సి వస్తుంది.
ఈ సినిమాలో ఎక్కడా అతిగా అనిపించే హీరోయిజం ఉండదు. వ్యవస్థలోని చేదు నిజాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ మిమ్మల్ని సినిమా ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తుంది. దీనికి ఐఎండీబీలో 8 రేటింగ్ ఉంది.
మిన్నల్ మురళి
{{/usCountry}}ఈ సినిమాలో ఎక్కడా అతిగా అనిపించే హీరోయిజం ఉండదు. వ్యవస్థలోని చేదు నిజాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ మిమ్మల్ని సినిమా ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తుంది. దీనికి ఐఎండీబీలో 8 రేటింగ్ ఉంది.
మిన్నల్ మురళి
{{/usCountry}}ఒక మామూలు టైలర్ మీద పిడుగు పడటంతో అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. అయితే అదే సమయంలో గ్రామంలోని మరో వ్యక్తి మీద కూడా పిడుగు పడుతుంది, అతను విలన్ గా మారతాడు. మరి వీరిద్దరి మధ్య పోరు ఎలా సాగింది అన్నదే ఈ మూవీ.
హాలీవుడ్ మార్వెల్, డీసీ సినిమాలకు భిన్నంగా మన దేశీ వాతావరణంలో సూపర్ హీరో సినిమాను ఎంత ఎమోషనల్‌గా తీయవచ్చో ఈ సినిమా నిరూపించింది. దీనికి 7.8 రేటింగ్ ఉంది.
ఇరట్ట
ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో కాల్పులకు గురై మరణిస్తాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో.. కవల సోదరులైన ఇద్దరు పోలీసుల గతం, వారి మధ్య ఉన్న శత్రుత్వం బయటపడుతుంది.
ఈ సినిమా క్లైమాక్స్ చూశాక మీరు కనీసం 5 నిమిషాల పాటు షాక్ నుండి తేరుకోలేరు. డార్క్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది ఒక మాస్టర్ పీస్. దీనికి 7.7 రేటింగ్ ఉంది.