Netflix Top 5 Web Series: నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న టాప్ 5 వెబ్ సిరీస్‌లు ఇవే-వణికించే హారర్, మతిపోగొట్టే సస్పెన్స్!

Netflix Top 5 Web Series: ఓటీటీలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరుగుతోంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఉత్కంఠ రేపే, అలాగే కామెడీ పంచ్ సిరీస్ లపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ టాప్ 5 వెబ్ సిరీస్ లపై ఓ లుక్కేయండి. ఇందులో హారర్, సస్పెన్స్, కామెడీ జోనర్లున్నాయి. 

Published on: Nov 29, 2026, 19:40:24 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix Top 5 Web Series: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఓ వైపు ఇంటర్నేషనల్ కంటెంట్ తో, మరోవైపు ఇండియన్ సిరీస్ లతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ టాప్ 5లో ఉన్న వెబ్ సిరీస్ లు కూడా ఇలాగే ఉన్నాయి. ఇంటర్నేషనల్, నేషనల్ మిక్స్ అయి ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న టాప్ 5 వెబ్ సిరీస్‌లు ఇవే-వణికించే హారర్, మతిపోగొట్టే సస్పెన్స్!
నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న టాప్ 5 వెబ్ సిరీస్‌లు ఇవే-వణికించే హారర్, మతిపోగొట్టే సస్పెన్స్!

ధిండోరా

కామెడీ డ్రామా సిరీస్ ‘ధిండోరా’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలో నంబర్ వన్ వెబ్ సిరీస్ గా ట్రెండ్ అవుతోంది. భువన్ భామ్ డిఫరెంట్ గెటప్స్ లో నటించిన ఈ సిరీస్ కు ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. రూ.11 కోట్ల ఆర్థిక సమస్యల తర్వాత హీరో జీవితం ఎలా మారిందనేది ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ లో కామెడీగా చూపించారు.

ఫ్రమ్

సైన్స్ ఫిక్షన్, హారర్, మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడేవాళ్లకు ‘ఫ్రమ్’ వెబ్ సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ ఇండియాలో ట్రెండింగ్ నంబర్ టూ వెబ్ సిరీస్ గా కొనసాగుతోంది. ఈ సిరీస్ మూడు సీజన్లు ఒకేసారి అందుబాటులోకి రావడంతో ఆడియన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో బింజ్ వాచ్ చేస్తున్నారు.

అమెరికాలోని ఓ సీక్రెట్ సిటీలోకి జనాలు అనుకోకుండా వస్తారు. ఏ రోడ్డు నుంచి వెళ్లినా కూడా తిరిగి అదే నగరంలోకి వస్తుంటారు. ఇక రాత్రి అయితే చాలు అడవిలో నుంచి రాక్షసులు నగరంలోకి వస్తుంటారు. అసలు ఆ సిటీలో ఏముంది? ఆ జనాలు ఎలా తప్పించుకున్నారు? అనేది సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది.

అక్క

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘అక్క’ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. స్ట్రీమింగ్ కు వచ్చిన నెల రోజులైన కూడా ఈ వెబ్ సిరీస్ కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కీర్తి సురేష్, రాధికా ఆప్టే కీలక పాత్రలు పోషించిన అక్క వెబ్ సిరీస్ ట్రెండింగ్ సిరీస్ ల్లో మూడో ప్లేస్ లో ఉంది. పెర్నూరు అనే ప్రాంతంలో అండర్ వరల్డ్ సామ్రాజ్యం కథతో ఈ సిరీస్ సాగుతుంది.

మాంగ్లిక్

దోషం ఉందని తెలిసినా డాక్టర్ సిద్ధార్థ్ ను ఇరా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె అంతుచిక్కని అనారోగ్యానికి గురవుతుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందనే మిస్టరీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సిరీస్ ‘మాంగ్లిక్’ నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. ఈ 6 ఎపిసోడ్ల సిరీస్ లో సస్పెన్స్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

బ్లూ రోడ్

నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా టాప్ 5లో నిలిచిన మరో ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ‘బ్లూ రోడ్’. ఇది కూడా క్రైమ్ థ్రిల్లర్. టోక్యోలో కొరియన్ అక్షరాలతో, సియోల్ లో జపనీస్ అక్షరాలతో వరుసగా దారుణ హత్యలు జరుగుతుంటాయి. ఈ మిస్టరీని ఛేదించేందుకు కొరియా, జపాన్ కు చెందిన ఇద్దరు డిటెక్టివ్ లు రంగంలోకి దిగుతారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.