Kevin Pietersen OTT: బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీజన్ 5 కోసం కెవిన్ పీటర్సన్ రచ్చ.. కుర్తా, పైజామాతో హల్‌చల్.. హిందీలో!

Kevin Pietersen OTT: కెవిన్ పీటర్సన్.. క్రికెట్ లవర్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ తన విధ్వంసక బ్యాటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. అలాంటి బ్యాటర్.. ఇప్పుడు ఓ ఇండియన్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. 

Published on: Nov 28, 2026, 15:36:08 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Kevin Pietersen OTT: ఓటీటీ ఆడియన్స్ ను ఎంతో ఎంటర్ టైన్ చేసిన బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ నుంచి అయిదో సీజన్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో పాపులర్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ రిలీజ్ కు ముందు ఇంటర్నేషనల్ గా హాట్ టాపిక్ గా మారింది.

బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీజన్ 3 కోసం  కెవిన్ పీటర్సన్ రచ్చ.. కుర్తా, పైజామాతో హల్‌చల్.. హిందీలో!
బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీజన్ 3 కోసం కెవిన్ పీటర్సన్ రచ్చ.. కుర్తా, పైజామాతో హల్‌చల్.. హిందీలో!

ఇండియన్ లా మారిన కెవిన్

పంచాయత్ అయిదో సీజన్ కు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రచారం చేయడంతో ఈ వెబ్ సిరీస్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కనుందని చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ ప్రచారం కోసం పీటర్సన్ పక్కా ఇండియన్ లా మారిపోయాడు. శనివారం (నవంబర్ 28) రిలీజ్ చేసిన ప్రోమో వీడియోలో కెవిన్.. కుర్తా, పైజామా, నెహ్రూ జాకెట్ తో కనిపించాడు.

హిందీ డైలాగ్స్

ఇండియన్ దేశీ అవతారంలో కనిపించడమే కాకుండా హిందీలోనూ డైలాగ్స్ చెప్పి కెవిన్ పీటర్సన్ అలరించాడు. లండన్ నుంచి సిడ్నీ వరకు ప్రపంచమంతా తిరిగినాను కానీ, ఫులేరా లాంటి అద్భుతమైన ప్రదేశం మరొకటి లేదని పీటర్సన్ హిందీలో డైలాగ్స్ చెప్తూ నవ్వించాడు.

పంచాయత్ వెబ్ సిరీస్ లోని పాపులర్ పాత్రలైన బన్రాకస్, బినోద్ లతో కలిసి కొత్త ప్రధాన్ రాకను కెవిన్ పీటర్సన్ పరిచయం చేశాడు.

ఈఫిల్ టవర్ తో

పంచాయత్ వెబ్ సిరీస్ ప్రోమోలో ఫులేరా గ్రామంలోని ప్రముఖ దేశాలను ప్రేక్షకులకు కెవిన్ పీటర్సన్ పరిచయం చేశాడు. గ్రామంలోని వాటర్ ట్యాంకును పారిస్ లోని ఈఫిల్ టవర్ తో పోల్చడం గమనార్హం. భారత్ లో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఫులేరా అంటూ కెవిన్ సరదాగా పేర్కొన్నాడు.

పంచాయత్ సీజన్ 5 ఓటీటీ

పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ నుంచి సీజన్ 5 ఓటీటీలోకి రాబోతుంది. పంచాయత్ సీజన్ 5 అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మించిన ఈ సిరీస్ కు దీపక్ కుమార్ మిశ్రా డైరెక్టర్. ఇందులో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, దుర్గేష్ కుమార్, చందన్ రాయ్ తదితరులు నటించారు.

స్టోరీ ఏంటంటే?

పంచాయత్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంజు దేవిపై క్రాంతి దేవి విజయం సాధించింది. దీంతో అక్కడి సమీకరణాలు మారిపోయాయి. కొత్త నాయకత్వంలో సచివ్ జీ అభిషేక్ ఎదుర్కొనే కఠిన పరిస్థితులు, ఎంబీఏ కల కోసం చేసే ప్రయత్నాలను అయిదో సీజన్ లో చూపించనున్నారు.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.