OTT December: డిసెంబర్‌లో ఓటీటీ జాతర-19 కొత్త సినిమాలు, సిరీసులు- హాట్‌స్టార్ ప్రైమ్ నెట్‌ఫ్లిక్స్ సోనీలివ్ 4 ఓటీటీల్లో!

December OTT Release Movies: డిసెంబర్ 2026లో ఓటీటీలో కొత్త సినిమాల జాతర సాగనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, సోనీ లివ్ 4 ఓటీటీల్లో ఏకంగా 19 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. సూర్య సీన్ నుంచి పంచాయత్ సీజన్ 5 వరకు డిసెంబర్ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Nov 28, 2026, 12:12:53 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release Movies And Web Series In December: ఏడాది చివరి నెల డిసెంబర్ వచ్చిందంటే చాలు సినీ ప్రియులకు పండగే. చలికాలం సాయంత్రాల్లో ఇంటిల్లిపాదీ వెచ్చగా కూర్చుని చూసేందుకు ఓటీటీ వేదికలు భారీ కంటెంట్‌ను సిద్ధం చేశాయి. డిసెంబర్ 2026లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లలో మొత్తం 8 సినిమాలు, 11 వెబ్ సిరీస్‌లు కలిపి 19 ప్రాజెక్టులు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.

డిసెంబర్‌లో ఓటీటీ జాతర-19 కొత్త సినిమాలు, సిరీసులు- హాట్‌స్టార్ ప్రైమ్ నెట్‌ఫ్లిక్స్ సోనీలివ్ 4 ఓటీటీల్లో!
డిసెంబర్‌లో ఓటీటీ జాతర-19 కొత్త సినిమాలు, సిరీసులు- హాట్‌స్టార్ ప్రైమ్ నెట్‌ఫ్లిక్స్ సోనీలివ్ 4 ఓటీటీల్లో!

సూర్య మూవీ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు

వీటిలో 11 నెట్‌ఫ్లిక్స్‌లో, 4 అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 3 జియోహాట్‌స్టార్‌లో, ఒకటి సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూర్య సీన్ సినిమా నుంచి అంతర్జాతీయ హిట్ సిరీస్‌ల వరకు ఉన్న ఆ ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.

తొలి వారంలోనే 'పంచాయత్ 5', సూర్య 'సీన్' హంగామా

1. ది మ్యాన్ విత్ ద బ్యాగ్ (The Man with the Bag): ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ శాంటా క్లాజ్‌గా నటించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం డిసెంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. స్విజిల్ అనే ఎల్ఫ్ (అక్వాఫినా) దొంగిలించిన క్రిస్మస్ బహుమతులను తిరిగి తెచ్చేందుకు, శాంటా తన 'చెడ్డ పిల్లల జాబితా'లో ఉన్న వాన్స్ (అలాన్ రిచ్‌సన్) అనే దొంగ సాయం తీసుకుంటాడు.

2. పంచాయత్ సీజన్ 5 (Panchayat Season 5): దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న 'పంచాయత్' ఐదో సీజన్‌తో డిసెంబర్ 3న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తోంది. ఫులేరా గ్రామంలో కొత్త ప్రధాన్ క్రాంతి దేవి (సునీతా రాజ్‌వార్), సచివ్ జీ అభిషేక్ (జితేంద్ర కుమార్) మధ్య జరిగే సరదా సవాళ్లు, అభిషేక్ ప్రేమకథ ఈ సీజన్‌లో కీలకంగా మారనున్నాయి.

3. ప్రైడ్ అండ్ ప్రిజుడీస్ (Pride and Prejudice): ప్రముఖ రచయిత్రి జేన్ ఆస్టెన్ నవల ఆధారంగా రూపొందిన 6 ఎపిసోడ్ల బ్రిటిష్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా డిసెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. జాక్ లోడెన్, ఎమ్మా కొరిన్ జంటగా నటించిన ఈ సిరీస్‌ను నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డాలీ ఆల్డర్టన్ తీర్చిదిద్దారు.

4. దేసు 7 (DeSu 7): బెంగాలీ సూపర్ హిట్ జోడీ దేవ్, శుభశ్రీ గంగూలీ నటించిన యాక్షన్ డ్రామా చిత్రం థియేటర్ల తర్వాత డిసెంబర్ 4న సోనీ లివ్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

5. జో బచే హై సంగ్ సమేట్ లో (Jo Bachay Hain Sang Samait Lo): పాకిస్థానీ స్టార్లు ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్ నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ఓటీటీ సిరీస్ డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. అయితే భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్ మన దేశంలో అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

6. దాలింబ్ (Dalimb): జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ముంబైలోని ఓ భారీ భవనంలోకి మారిన సూరజ్ కొడుకు ఆది అకస్మాత్తుగా మాయమవడం, ఆ తర్వాత జరిగే వింత ఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

7. ఓ సాథీ రే (O Saathi Re): ఇంతియాజ్ అలీ రచనలో ఆయన సోదరుడు ఆరిఫ్ అలీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా సిరీస్ డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది. అదితి రావు హైదరి, అవినాష్ తివారీ, అర్జున్ రాంపాల్ నటించిన ఈ కథలో, విడాకులు తీసుకోబోతున్న ఓ జంట మధ్య మళ్లీ ప్రేమ చిగురించడం ఆసక్తిని రేపుతోంది.

8. సీన్ (Scene): 'ఆవేశం' ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ సూర్య, నజ్రియా నజీమ్, నస్లేన్ నటించిన యాక్షన్ కామెడీ చిత్రం 'సీన్' డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

రెండో వారంలో మర్డర్ మిస్టరీలు, మెడికల్ డ్రామా సందడి

9. ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 6: స్టీవ్ మార్టిన్, మార్టిన్ షార్ట్, సెలీనా గోమెజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిట్ మిస్టరీ కామెడీ సిరీస్ ఆరో సీజన్ డిసెంబర్ 8న జియోహాట్‌స్టార్‌లో ప్రారంభమవుతుంది. ఈసారి వీరు తమ ప్రత్యర్థి సిండా క్యానింగ్ హత్య కేసును ఛేదించేందుకు లండన్ వెళ్తారు.

10. మాక్స్‌టన్ హాల్ సీజన్ 3: జర్మన్ టీన్ రొమాంటిక్ డ్రామా చివరి సీజన్ డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో మొదలవుతుంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ ముగింపు ఎపిసోడ్ డిసెంబర్ 23న విడుదలవుతుంది.

11. బ్యాడ్ డే (Bad Day): హాలీవుడ్ నటి కామెరాన్ డియాజ్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ చిత్రం డిసెంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది. కూతురి ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు బయలుదేరిన జాయ్ అనే సింగిల్ మదర్ కారు టో అవ్వడం, 30 డాలర్లకు పైగా బ్యాంకు దోపిడీ కేసులో తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవడం వంటి 24 గంటల గందరగోళమే ఈ సినిమా.

12. డాక్టర్ హసన్ (Dr Hassan): ప్రముఖ అమెరికన్ మెడికల్ డ్రామా 'హౌస్ ఎండీ'కి భారతీయ రీమేక్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన సిరీస్ డిసెంబర్ 11న జియోహాట్‌స్టార్‌లో విడుదలవుతోంది. రోహన్ సిప్పీ దర్శకత్వం వహించిన ఇందులో దియా మీర్జా కీలక పాత్ర పోషించారు.

మూడో వారం: బ్రాడ్ పిట్, 'చోర్ నికల్ కే భాగా 2' మెరుపులు

13. అన్అకస్టమ్డ్ ఎర్త్ (Unaccustomed Earth): జుంపా లాహిరి కథల ఆధారంగా ఫ్రీడా పింటో, సిద్ధార్థ్ నటించిన ఈ సిరీస్ డిసెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ముంబై నుంచి అమెరికాకు తిరిగి వెళ్లిన పారుల్ చౌదరి జీవితంలోకి పాత ప్రేమికుడు అమిత్ ముఖర్జీ రావడంతో మొదలయ్యే భావోద్వేగ ఘర్షణే ఈ కథ.

14. కాల్ మీ బే సీజన్ 2 (Call Me Bae Season 2): లైగర్ బ్యూటీ అనన్య పాండే నటించిన కామెడీ డ్రామా రెండో సీజన్ డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కొత్తగా జతకట్టడం విశేషం.

15. చోర్ నికల్ కే భాగా 2 (Chor Nikal Ke Bhaga 2): యామీ గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ కేల్కర్ నటించిన హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ డిసెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. తొలి భాగం విమానంలో సాగితే, ఈసారి ఓ విలాసవంతమైన క్రూయిజ్ షిప్‌లో విలువైన కిరీటం దొంగతనం చుట్టూ కథ నడుస్తుంది.

16. రే గన్ (Ray Gunn): బ్రాడ్ బర్డ్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ యానిమేషన్ డిటెక్టివ్ చిత్రం డిసెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది.

17. ది ఫర్దర్ మిస్-అడ్వెంచర్స్ ఆఫ్ క్లిఫ్ బూత్: క్వెంటిన్ టరాంటినో రచనలో డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రాడ్ పిట్ మరోసారి క్లిఫ్ బూత్‌గా కనిపించనున్నారు. డిసెంబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదలవుతుంది.

క్రిస్మస్ కానుకగా హ్యారీ పోటర్ సిరీస్

18. ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6: లిల్లీ కాలిన్స్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ సిరీస్ చివరి సీజన్ డిసెంబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. గ్రీస్ పర్యటనలో ఎమిలీకి పాత ప్రేమికుడు గేబ్రియల్ ఎదురవ్వడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది.

19. హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న హ్యారీ పోటర్ సరికొత్త వెబ్ సిరీస్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న (భారత్‌లో డిసెంబర్ 26న) జియోహాట్‌స్టార్ ఓటీటీలో అడుగుపెడుతోంది. డొమినిక్ మెక్‌లాఫ్లిన్ హ్యారీ పాటర్‌గా, జాన్ లిత్గో డంబుల్‌డోర్‌గా నటిస్తున్న ఈ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్‌తో డిసెంబర్ వినోదాలకు ఘనమైన ముగింపు లభించనుంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.