OTT Trending: ఓటీటీ రిలీజ్ నుంచి టాప్ 1 ట్రెండింగ్‌లో 7.2 రేటింగ్ సిరీస్- ఒక్క రాత్రి పరిచయం, మలుపు తిరిగిన జీవితం!

Teen Tigada OTT Trending In Top 1 Place: ఓటీటీ రిలీజ్ అయినప్పటినుంచి ఇప్పటివరకు ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో దూసుకుపోతున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ టీన్ తిగడా. ఒక్క రాత్రి పరిచయంతో మలుపు తిరిగే జీవితం కథతో తెరకెక్కిన టీన్ తిగడా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 27, 2026, 18:54:41 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Teen Tigada OTT Trending In Top 1 Place: వారాంతంలో భారీ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్లకు బదులుగా మనసుకు హాయినిచ్చే, పెదవులపై చిరునవ్వు తెప్పించే రొమాంటిక్ డ్రామా చూడాలనుకునే తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఒక మంచి ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 20 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్ 'తీన్ తిగాడా' (Teen Tigada) మంచి స్పందన తెచ్చుకుంటోంది. మొత్తం 9 ఎపిసోడ్లతో రూపొందిన ఈ ఓటీటీ సిరీస్‌కు ఐఎమ్‌డీబీ (IMDb)లో 7.2 రేటింగ్ దక్కడం విశేషం.

ఓటీటీ రిలీజ్ నుంచి టాప్ 1 ట్రెండింగ్‌లో 7.2 రేటింగ్ సిరీస్- ఒక్క రాత్రి పరిచయం, మలుపు తిరిగిన జీవితం!
ఓటీటీ రిలీజ్ నుంచి టాప్ 1 ట్రెండింగ్‌లో 7.2 రేటింగ్ సిరీస్- ఒక్క రాత్రి పరిచయం, మలుపు తిరిగిన జీవితం!

కలలు, బాధ్యతల మధ్య నలిగే ప్రేమకథ

'తీన్ తిగడా' కథ ప్రధానంగా ఆస్మానీ (ప్రసన్న బిష్ట్), మానస్ (దానేష్ రిజ్వీ) అనే ఇద్దరు యువతీయువకుల చుట్టూ తిరుగుతుంది. ఆస్మానీ ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న క్రికెటర్. భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో ఆమె సాధన చేస్తుంటుంది. మరోవైపు మానస్ ఒక సంగీతకారుడు. తన మ్యూజిక్ బ్యాండ్‌తో సంగీత ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించాలని కలలు కంటుంటాడు.

తమ లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో ఉన్న వీరిద్దరికీ అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే వీరి మధ్య జరిగిన ఒక 'వన్-నైట్ స్టాండ్' (ఒక్క రాత్రి కలయిక) ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. ఆ ఒక్క ఘటన వీరి వ్యక్తిగత జీవితాలను, కెరీర్ లక్ష్యాలను ఎలా తలకిందులు చేసింది, ఎదురైన బాధ్యతలను వీరు ఎలా స్వీకరించారన్నదే ఈ ఓటీటీ సిరీస్ ప్రధాన కథాంశం.

ఆకట్టుకునే కెమిస్ట్రీ, సంగీతం

ఈ సిరీస్‌కు ప్రధాన బలం పాత్రధారుల నటన. ఆస్మానీగా ప్రసన్న బిష్ట్, మానస్‌గా దానేష్ రిజ్వీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తెరపై వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సహజంగా, ఆకట్టుకునేలా కుదిరింది. కెరీర్‌లో ఎదగాలనే తపనకు, వ్యక్తిగత సంబంధాల్లో ఎదురయ్యే చిక్కులకు మధ్య నేటి తరం యువత ఎలా సతమతమవుతున్నారో దర్శకుడు చక్కగా చూపించారు.

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో తమ కలల కోసం పోరాడే యువతకు ఈ కథ సులభంగా కనెక్ట్ అవుతుంది. కథనానికి తగ్గట్టుగా సాగే పాటలు, నేపథ్య సంగీతం సిరీస్‌కు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

కథనాన్ని సాగదీయడమే మైనస్

సిరీస్ ఎంచుకున్న అంశం బాగున్నప్పటికీ, కథనాన్ని అవసరానికి మించి సాగదీసినట్లు అనిపిస్తుంది. 9 ఎపిసోడ్ల నిడివి ఉండటంతో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ విసుగు తెప్పిస్తాయి. కథంతా ముంబై నేపథ్యంలో సాగినప్పటికీ, ఆ నగరం అసలు వాతావరణం, సహజత్వం తెరపై కనిపించదు.

ప్రతి సన్నివేశంలోనూ కృత్రిమమైన ఆర్భాటం ఎక్కువైంది. అన్నింటికంటే నిరాశపరిచే అంశం ముగింపు. రెండో సీజన్‌కు అవకాశం ఉంచాలనే ఉద్దేశంతో, కథకు ఎలాంటి స్పష్టమైన ముగింపు ఇవ్వకుండా అసంపూర్ణంగా వదిలేశారు. నెమ్మదిగా సాగే కథనం తర్వాత ఇలాంటి ముగింపు ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరుస్తుంది.

చూడొచ్చా లేదా?

కొత్త నటీనటుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, తేలికపాటి యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా చూడాలనుకునే వారికి 'తీన్ తిగడా' వీకెండ్‌లో మంచి కాలక్షేపం ఇస్తుంది. అయితే మీరు ఇప్పటికే 'చాంద్ మేరా దిల్' వంటి చిత్రాలు చూసి ఉంటే, ఆ కథకు ఈ సిరీస్‌కు మధ్య చాలా పోలికలు ఉన్నట్లు అనిపించవచ్చు.

అలాంటి వారికి ఇందులో కొత్తదనం తక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం జీ5 ఓటీటీలో టీన్ తిగడా అందుబాటులో ఉంది. జీ5లో నవంబర్ 20న టీన్ తిగడా ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు జీ5లో నెంబర్ 1 స్థానంలో టీన్ తిగడా ఓటీటీ ట్రెండింగ్ అవడం విశేషం.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.