OTT Crime: ప్రజల ప్రాణాలతో డ్రగ్ ట్రయల్స్- ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్- 7 భాషల్లో స్ట్రీమింగ్

Human OTT Streaming In 7 Languages: వైద్య రంగంలోని చీకటి కోణాలను బయటపెట్టే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ హ్యూమన్ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫార్మా కంపెనీలు, ఆసుపత్రులు, రాజకీయ నాయకుల చీకటి ఒప్పందాలతో అమాయక పేదలపై జరిగే అక్రమ ఔషధ ప్రయోగాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

Published on: Nov 28, 2026, 05:58:22 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Medical Crime Thriller Human OTT Release In 7 Languages: ఓటీటీ వేదికలపై క్రైమ్, హారర్, కామెడీ కథలు ఎన్నో వస్తుంటాయి. కానీ, మన చుట్టూ ఉన్న వైద్య రంగం వెనుక దాగి ఉన్న చీకటి వ్యాపారాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే సిరీస్‌లు ఓటీటీలోకి చాలా అరుదుగా వస్తాయి.

ప్రజల ప్రాణాలతో డ్రగ్ ట్రయల్స్- ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్- 7 భాషల్లో స్ట్రీమింగ్
ప్రజల ప్రాణాలతో డ్రగ్ ట్రయల్స్- ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్- 7 భాషల్లో స్ట్రీమింగ్

ప్రమాదకరంగా డ్రగ్ ట్రయల్స్

దేశంలోని ప్రధాన నగరాల్లో ఫార్మా రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, కొత్త మందుల తయారీ వెనుక జరిగే క్లినికల్ ట్రయల్స్ ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఆలోచింపజేసే అద్భుతమైన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'హ్యూమన్' (Human). 2022లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడుస్తుంది.

కథ ఏమిటంటే?

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై డబ్బు ఆశ చూపి పేద ప్రజలపై అక్రమంగా ఔషధ ప్రయోగాలు (హ్యూమన్ డ్రగ్ ట్రయల్స్) ఎలా చేస్తారో ఈ ఓటీటీ సిరీస్ లోతుగా చూపిస్తుంది.

భోపాల్‌లోని ప్రతిష్టాత్మక మాన్హాటన్ ఆసుపత్రి సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ గౌరీ నాథ్ (షెఫాలీ షా) అత్యంత శక్తివంతమైన వైద్యురాలు. తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి, ఆసుపత్రిని విస్తరించడానికి ఆమె ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదు.

ప్రయోగాలతో ప్రాణాలకు ముప్పు

మరోవైపు అదే ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్‌గా డాక్టర్ సైరా సభర్వాల్ (కీర్తి కుల్హారి) చేరుతారు. ఆసుపత్రిలో జరుగుతున్న మందుల ప్రయోగాలు నైతిక విలువలకు విరుద్ధమని, వాటివల్ల ప్రాణాంతక దుష్ప్రభావాలు కలుగుతాయని సైరా గుర్తిస్తారు.

భోపాల్ మురికివాడకు చెందిన మంగూ (విశాల్ జెత్వా) తన కుటుంబాన్ని పోషించుకోవడానికి మార్చురీలో పనిచేస్తుంటాడు. అక్రమ డ్రగ్ ట్రయల్స్ కారణంగా మంగూతో పాటు అతని చుట్టుపక్కల ఉన్న ఎందరో పేదల జీవితాలు తలకిందులవుతాయి. ప్రయోగాల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని తెలిసినా అశోక్ వైద్య, వాయు ఫార్మా సంస్థలు తమ లాభాల కోసం వాటిని కొనసాగిస్తాయి.

కథలో వచ్చే ఊహించని మలుపులు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ఇద్దరు ప్రధాన నటీమణుల మధ్య వచ్చే ముద్దు సన్నివేశం కూడా విడుదల సమయంలో పెద్ద చర్చకు దారితీసింది.

ఏ ఓటీటీలో చూడొచ్చు? రేటింగ్ ఎంత?

మెడికల్ థ్రిల్లర్ విభాగంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ సిరీస్ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీలో అందుబాటులో ఉంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 7 భాషల్లో హ్యూమన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బలమైన కథనం, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే సన్నివేశాల కారణంగా ఈ సిరీస్‌కు ఐఎమ్‌డీబీ (IMDb)లో 7.5 రేటింగ్ దక్కింది.

దర్శకులు, తారాగణం వివరాలు

ప్రముఖ దర్శకుడు విపుల్ అమృత్‌లాల్ షా, మోజెజ్ సింగ్ సంయుక్తంగా ఈ ఓటీటీ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. షెఫాలీ షా, కీర్తి కుల్హారి తమ అద్భుత నటనతో ప్రాణం పోశారు. విశాల్ జెత్వా, రామ్ కపూర్, సీమా బిశ్వాస్, మోహన్ అగాషే, ఆదిత్య శ్రీవాస్తవ, ఆసిఫ్ ఖాన్, ఇంద్రాణి సేన్ గుప్తా, అతుల్ కుమార్ కీలక పాత్రల్లో మెరిశారు.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.