Ananya Panday: స్టార్ హీరో కుమారుడితో క్లోజ్‌గా లైగర్ హీరోయిన్ అనన్య పాండే.. లండన్ వెకేషన్ ఫొటో వైరల్

Ananya Panday With Aarav Bhatia In London: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కుమారుడు ఆరవ్ భాటియాతో కలసి అనన్య పాండే లండన్ వెకేషన్‌లో సందడి చేశారు. చాలా క్లోజ్‌గా ఉన్న ఆరవ్, అనన్య ఇద్దరి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ ఫొటో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Oct 23, 2026, 17:52:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ananya Panday With Aarav Bhatia In London: బాలీవుడ్ భామ, లైగర్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా దంపతుల కుమారుడు ఆరవ్ భాటియాతో కలసి అనన్య గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.

స్టార్ హీరో కుమారుడితో క్లోజ్‌గా లైగర్ హీరోయిన్ అనన్య పాండే.. లండన్ వెకేషన్ ఫొటో వైరల్
స్టార్ హీరో కుమారుడితో క్లోజ్‌గా లైగర్ హీరోయిన్ అనన్య పాండే.. లండన్ వెకేషన్ ఫొటో వైరల్

లండన్ వెకేషన్‌లో

లండన్ వెకేషన్‌లో వీరిద్దరూ తమ స్నేహితులతో సరదాగా సమయాన్ని గడిపారు. స్వయంగా తయారు చేసిన మఫిన్ కేకులను చేతిలో పట్టుకుని, ఎంతో క్యాజువల్ లుక్‌లో కనిపించిన ఆరవ్, అనన్య ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు.

తెర వెనుకే ఉండటానికి మొగ్గు చూపుతున్న ఆరవ్

సాధారణంగా స్టార్ కిడ్స్ అనగానే సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం లేదా నిరంతరం వార్తల్లో నిలవడం చూస్తుంటాం. అయితే ఆరవ్ భాటియా వైఖరి ఇందుకు పూర్తి భిన్నం. 2002 సెప్టెంబర్ 15న జన్మించిన ఆరవ్, బాలీవుడ్‌లోని అత్యంత లీడింగ్ కుటుంబంలో పుట్టినప్పటికీ గ్లామర్ ప్రపంచానికి, కెమెరా వెలుగులకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారు.

అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో బయట కనిపించినా, సోషల్ మీడియా హంగామాకు లేదా సినిమా ప్రచారాలకు ఆయన దూరంగా ఉంటారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికే ఆయన ప్రాధాన్యమిస్తారు.

బాక్సాఫీస్ నిరాశ నుంచి కొత్త ప్రాజెక్టుల వైపు

మరోవైపు అనన్య పాండే ఇటీవల 'తూ మేరీ మే తేరా' (కార్తీక్ ఆర్యన్‌తో), 'చాంద్ మేరా దిల్' (లక్ష్యతో) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఆమె ఓటీటీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు.

ఓటీటీలో విశేష ఆదరణ పొందిన హిట్ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే' (Call Me Bae) రెండో సీజన్ త్వరలోనే రానుంది. ఇందులో బెల్లా బే చౌదరి పాత్రలో అనన్య పాండే మరోసారి అలరించనున్నారు. ఈ ఓటీటీ సిరీస్ రెండో సీజన్‌లో నటి శ్రుతి హాసన్ కూడా ఒక కీలక పాత్రలో చేరడం విశేషం. జర్మనీలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో ఈ సిరీస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

'కాల్ మీ బే 2' లో సరికొత్త ట్విస్టులు

"ఈ కొత్త సీజన్‌లో లవ్ ట్రయాంగిల్స్, ప్రేమ కోణాలు మరిన్ని ఉంటాయి. బే, నెయిల్, అగ్గీల మధ్య నడిచే డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బే పాత్ర ఈసారి మరింత పరిణతి చెందిన జర్నలిస్టుగా కనిపిస్తుంది" అని అనన్య పాండే పేర్కొన్నారు. కథనంలో డ్రామాతో పాటు మంచి సంగీతం కూడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

లండన్‌‌లో ఆరవ్ భాటియాతో అనన్య పాండే ఫొటో
లండన్‌‌లో ఆరవ్ భాటియాతో అనన్య పాండే ఫొటో

యాంకర్‌గా కొత్త అవతారం

నటనతో పాటు సరికొత్త బాధ్యతలను స్వీకరించడానికి అనన్య సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక ఐఐఎఫ్ఏ (IIFA) అవార్డుల వేడుకకు అనన్య పాండే మొదటిసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అబుదాబి వేదికగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని కరణ్ జోహార్, వరుణ్ ధావన్, మనీష్ పాల్‌లతో కలసి అనన్య నడిపించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More