January 12 Vidudala Song: డివికి డివికి ప్రోమో అదిరింది.. లంగా ఓణీల్లో కీర్తి సురేష్, కృతి శెట్టి ఫుల్ మాస్ డ్యాన్స్!

January 12 Vidudala Song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ 'జనవరి 12 విడుదల'. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్‌గా మొదలయ్యాయి. ఫస్ట్ సింగిల్ 'డివికి డివికి’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. కీర్తి సురేష్, కృతి శెట్టి అదరగొట్టారు.

Published on: Nov 20, 2026, 18:38:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

January 12 Vidudala Diviki Diviki Song: సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టే హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మరోసారి పండగ సందడిని ముందే తీసుకొచ్చారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న భారీ ఎంటర్‌టైనర్ 'జనవరి 12 విడుదల' (January 12 Vidudala) నుంచి తొలి పాట అప్‌డేట్ వచ్చేసింది.

డివికి డివికి ప్రోమో అదిరింది.. లంగా ఓణీల్లో కీర్తి సురేష్, కృతి శెట్టి ఫుల్ మాస్ డ్యాన్స్! (x/Shine_Screens)
డివికి డివికి ప్రోమో అదిరింది.. లంగా ఓణీల్లో కీర్తి సురేష్, కృతి శెట్టి ఫుల్ మాస్ డ్యాన్స్! (x/Shine_Screens)

డివికి డివికి సాంగ్

సంక్రాంతి 2027 రేసులో ఉన్న సినిమాలన్నింటికంటే ముందుగానే జనవరి 12 విడుదల మూవీ టీమ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలోని మొదటి పాట 'డివికి డివికి’ (Divviki Divviki) ప్రోమోను శుక్రవారం (నవంబర్ 20) రిలీజ్ చేసింది. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాటలో హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి తమ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు.

ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

సంప్రదాయ లంగా ఓణీల్లో మెరిసిపోతూనే కీర్తి సురేష్, కృతి శెట్టి పోటాపోటీగా వేసిన ఫుల్ మాస్ స్టెప్పులు డివికి డివికి సాంగ్ పై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన పక్కా మాస్ బీట్ ఈ ప్రోమోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను రేపు (నవంబర్ 21) విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అనిల్ రావిపూడి మార్క్

మూవీ ప్రమోషన్ల విషయంలో ఎప్పుడూ తనదైన శైలిని చూపించే అనిల్ రావిపూడి.. ఈ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ కోసం నిన్న (నవంబర్ 19) ఓ సరదా వీడియోను వదిలారు. రజనీకాంత్ నటించిన క్లాసిక్ చిత్రం 'దళపతి'లోని ఓ ఐకానిక్ సీన్‌ను అనిల్ రావిపూడి, కృతి శెట్టి, కీర్తి సురేష్ కామెడీ టచ్‌తో రీక్రియేట్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తొలి పాటపై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ నెలకొంది.

బావ బామ్మర్ది కాంబినేషన్‌

'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 12 విడుదల తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా కనిపించనుండగా, ఆయన సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన 'దీపు' అనే పాత్రలో కృతి శెట్టి సందడి చేయనుంది. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 'ఎఫ్2', 'ఎఫ్3', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రాల తర్వాత వస్తున్న ఐదో సినిమా ఇది.

అలాగే దర్శకుడిగా తనకు తొలి హిట్ ఇచ్చిన 'పటాస్' తర్వాత కళ్యాణ్ రామ్‌తో అనిల్ మళ్లీ జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ హైప్ ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. టైటిల్‌కు తగ్గట్టుగానే 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More