Song Record: ఏడాదిలోనే 95.7 కోట్ల వ్యూస్-బుట్టబొమ్మ రికార్డును బ్రేక్ చేసిన బొంబాయికి రాను సాంగ్-యూట్యూబ్ లో టాప్!

Ranu Bombai ki Ranu Song Record: తెలంగాణ ఫోక్ సెన్సేషనల్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను’ హిస్టరీ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో టాప్ సాంగ్ గా రికార్డు నమోదు చేసింది. అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా బుట్టబొమ్మ రికార్డును రాను బొంబాయికి రాను సాంగ్ బ్రేక్ చేసింది.

Published on: Nov 17, 2026, 11:40:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ranu Bombaiki Ranu Song Record: ఒకప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ అంటే కేవలం స్టార్ హీరోల కమర్షియల్ సినిమా పాటలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ట్రెండ్ పూర్తిగా మారింది. పల్లెటూరి మట్టి వాసనను, తెలంగాణ జానపద కళను ప్రతిబింబించే ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి.ఈ క్రమంలోనే 'రాను బొంబాయికి రాను' అనే జానపద గీతం యూట్యూబ్‌లో ఏకంగా 950 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంచలనం రేపింది.

ఏడాదిలోనే 95.7 కోట్ల వ్యూస్-బుట్టబొమ్మ రికార్డును బ్రేక్ చేసిన బొంబాయికి రాను సాంగ్-యూట్యూబ్ లో టాప్!
ఏడాదిలోనే 95.7 కోట్ల వ్యూస్-బుట్టబొమ్మ రికార్డును బ్రేక్ చేసిన బొంబాయికి రాను సాంగ్-యూట్యూబ్ లో టాప్!

'బుట్టబొమ్మ' రికార్డ్ బద్దలు

ఇప్పటివరకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'బుట్టబొమ్మ' సాంగ్ పేరిట రికార్డు ఉండేది. ఆ సాంగ్ దాదాపు ఆరేళ్ల వ్యవధిలో 955 మిలియన్ల (95.5 కోట్లు) వ్యూస్ సాధించింది.

కానీ, రాథోడ్ ట్యూన్స్ ఛానెల్‌లో విడుదలైన 'రాను బొంబాయికి రాను' ఫోక్ సాంగ్ కేవలం ఏడాది వ్యవధిలోనే ఏకంగా 957 మిలియన్ల (95.7 కోట్లు) వ్యూస్‌ను దాటేసి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒక జానపద గీతం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సాంగ్ ని వెనక్కి నెట్టడం సాధారణ విషయం కాదు.

తక్కువ బడ్జెట్.. కోట్లల్లో ఆదాయం

రాను బొంబాయికి రాను పాటకు ప్రముఖ ఫోక్ సింగర్ రాము రాథోడ్ స్వయంగా సాహిత్యం అందించడంతో పాటు సింగర్ ప్రభతో కలిసి అద్భుతంగా ఆలపించారు. కళ్యాణ్ కీస్ అందించిన క్యాచీ మ్యూజిక్, శేఖర్ వైరస్ మాస్టర్ సమకూర్చిన మాస్ డ్యాన్స్ స్టెప్పులు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

కేవలం రూ. 3 నుంచి 5 లక్షల బడ్జెట్‌తో వేములవాడ, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. అయితే ఈ సాంగ్ సృష్టించిన సునామీకి యూట్యూబ్ యాడ్స్, ట్రెండింగ్ ద్వారా క్రియేటర్లకు సుమారు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని ట్రేడ్ వర్గాల అంచనా.

మారిన సింగర్ తలరాత..

తెలంగాణ పల్లెటూరి యాస, సహజమైన పదాలు, గ్రామీణ నేపథ్యం ఈ రాను బొంబాయికి రాను పాటకు ప్రాణం పోశాయి. పెళ్లిళ్లు, పండగలు, కాలేజీ ఈవెంట్లు, జాతరలు.. ఎక్కడ చూసినా ఈ పాట మారుమోగుతోంది. దాదాపు 16 సంవత్సరాలుగా జానపద సంగీత రంగంలో ఉన్న రాము రాథోడ్‌కు ఈ ఒక్క పాట ఓవర్ నైట్ స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఈ పాట ఇచ్చిన క్రేజ్‌తోనే ఆయనకు టెలివిజన్ షోలలో అవకాశాలు కూడా దక్కాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More