...
...
Next Story

Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్‌లో తమిళ సినిమా దూకుడు.. గ్లోబల్‌గా నంబర్ 1 ట్రెండింగ్.. పాకిస్థాన్‌లోనూ టాప్ 10లో..

Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్ లో తమిళ సినిమా మేడ్ ఇన్ కొరియా దూసుకెళ్తోంది. ప్రియాంకా అరుళ్ మోహన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ గ్లోబల్ లెవెల్లో నంబర్ 1 ట్రెండింగ్ సినిమా కాగా.. పాకిస్థాన్ సహా ఏకంగా 24 దేశాల్లో టాప్ 10లో ఉండటం విశేషం.

Published on: Mar 18, 2026, 22:22:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓజీ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన తమిళ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ నటించిన సినిమా మేడ్ ఇన్ కొరియా (Made In Korea). ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ నంబర్ వన్ మూవీగా నిలవడం విశేషం.

24 దేశాల్లో టాప్ 10లో..

Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్‌లో తమిళ సినిమా దూకుడు.. గ్లోబల్‌గా నంబర్ 1 ట్రెండింగ్.. పాకిస్థాన్‌లోనూ టాప్ 10లో..
Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్‌లో తమిళ సినిమా దూకుడు.. గ్లోబల్‌గా నంబర్ 1 ట్రెండింగ్.. పాకిస్థాన్‌లోనూ టాప్ 10లో..

తమిళ కామెడీ డ్రామా అయిన మేడ్ ఇన్ కొరియా మూవీ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ లో నంబర్ 1 సినిమాగా ఉంది. ఇక 24 దేశాల్లో టాప్ 10లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ దేశాల్లో ఇండియా, పాకిస్థాన్ తోపాటు శ్రీలంక, కువైట్, మలేషియా, ఒమన్, సౌదీ అరేబియా, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, యూఏఈ, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, పనామా, పెరు, వెనుజులా, రొమేనియా, కెన్యా, మారిషస్, నైజీరియాలాంటి దేశాలు ఉన్నాయి. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మేడ్ ఇన్ కొరియా విశేషాలు

'మేడ్ ఇన్ కొరియా' (Made in Korea) గత గురువారమే (మార్చి 12) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమా.. భారతీయ నేపథ్యానికి కొరియన్ టేకింగ్‌ను జోడించి రూపొందించిన ఒక అరుదైన ఇండో-కొరియన్ మూవీ.

ఇండియాలో కొరియన్ డ్రామాలకు (K-Dramas) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దర్శకుడు రా కార్తీక్ అదే ట్రెండ్‌ను ఒడిసిపట్టారు. తమిళ సంస్కృతిని, కొరియన్ స్టోరీ టెల్లింగ్ మేళవించి ఈ మేడిన్ కొరియా సినిమాను రూపొందించాడు.

ఈ సినిమాను తమిళనాడు, సియోల్ నగరాల్లో తీశారు. కేవలం పేరుకే కొరియన్ సినిమా కాదు, ఇందులో అక్కడి స్థానిక నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. శెన్బ ప్రయాణంలో కొరియన్ పాత్రలు ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ప్రియాంకా మోహన్ వన్-వుమన్ షో

శెన్బ పాత్రలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఒదిగిపోయింది. ఆమె అమాయకత్వం, భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఈ సినిమాలో తన నటనతో శెన్బ ప్రయాణాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా చేసింది. రిషికాంత్, జెన్సన్ దివాకర్, కొరియన్ నటులు పార్క్ హై-జిన్, నో హో-జిన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టడం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe