Netflix Trending: పాకిస్థాన్‌లో రవితేజ సినిమాకు క్రేజీ డిమాండ్.. 2 వారాలుగా ట్రెండింగ్‌లో ఇరుముడి.. రష్మిక మూవీ టాప్..

Netflix Trending: ఇరుముడి మూవీ ఇండియాలో తెలుగు ప్రేక్షకులనే కాదు.. పాకిస్థానీ ఆడియెన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ పాకిస్థాన్ ట్రెండింగ్ లిస్టులో 8 ఇండియన్ సినిమాలు ఉండగా.. అందులో ఇరుముడి కూడా ఒకటి.

Published on: Oct 5, 2026, 10:37:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix Trending: పాకిస్థాన్ నెట్‌ఫ్లిక్స్ (Netflix Pakistan) టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్‌లో ఏకంగా 8 ఇండియన్ సినిమాలు ఊహించని రేంజ్‌లో రచ్చ చేస్తున్నాయి. సరిహద్దులు, రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా మన బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు పాక్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒక సినిమా అయితే ఏకంగా 49 రోజుల నుంచి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.

Netflix Trending: పాకిస్థాన్‌లో రవితేజ సినిమాకు క్రేజీ డిమాండ్.. 2 వారాలుగా ట్రెండింగ్‌లో ఇరుముడి.. రష్మిక మూవీ టాప్..
Netflix Trending: పాకిస్థాన్‌లో రవితేజ సినిమాకు క్రేజీ డిమాండ్.. 2 వారాలుగా ట్రెండింగ్‌లో ఇరుముడి.. రష్మిక మూవీ టాప్..

49 రోజులుగా తగ్గేదే లే అంటున్న ‘కాక్‌టైల్ 2’

2012లో వచ్చిన సూపర్ హిట్ 'కాక్‌టైల్' మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'కాక్‌టైల్ 2' (Cocktail 2) పాకిస్థాన్‌లో మామూలు విధ్వంసం సృష్టించట్లేదు. షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ఏకంగా 7 వారాలుగా (49 రోజులు) పాక్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.

తెలుగు నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ పాకిస్థాన్‌లో కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉందని ఈ ట్రెండ్ స్పష్టంగా నిరూపిస్తోంది. యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ కంటెంట్ కావడంతో పాక్ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ 'ఆల్ఫా', తాప్సీ ‘గాంధారి’

ఆలియా భట్, శార్వరి వాగ్ కాంబోలో వచ్చిన వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, పాక్‌‌లో మాత్రం దుమ్మురేపుతోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ స్పై మూవీ గత 5 వారాలుగా (35 రోజులు) అక్కడ టాప్ 10 ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం.

ఇక తాప్సీ పన్ను లీడ్ రోల్ చేసిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'గాంధారి' (Gandhari) కూడా 4 వారాల నుంచి (28 రోజులు) పాకిస్థానీల నెట్‌ఫ్లిక్స్ వాచ్‌లిస్ట్‌లో నిలిచింది. వీటితో పాటు అజయ్ దేవ్‌గణ్, రితీష్ దేశ్‌ముఖ్, సంజయ్ మిశ్రా నటించిన నవ్వుల హంగామా 'ధమాల్ 4' (Dhamaal 4) కూడా 28 రోజులుగా విజయవంతంగా ట్రెండ్ అవుతోంది.

టాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇరుముడి' మ్యాజిక్

కేవలం బాలీవుడ్ సినిమాలే కాదు, సౌత్ సినిమాలు కూడా పాకిస్థాన్ ఓటీటీ ప్రియులను ఫిదా చేస్తున్నాయి. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ అటాచ్‌మెంట్, హై-వోల్టేజ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన రవితేజ తెలుగు సినిమా 'ఇరుముడి' (Irumudi) 7.0 ఐఎండీబీ (IMDb) రేటింగ్‌తో గత రెండు వారాలుగా (14 రోజులు) టాప్ 10లో దూసుకుపోతోంది.

ఇక తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తమిళంలో తీసిన ఇంటర్నేషనల్ షూటర్ లవ్ స్టోరీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Viswanath & Sons) గత 21 రోజులుగా పాక్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమాలను కూడా పాక్ జనాలు ఆదరిస్తున్నారని ఈ ట్రెండ్స్ చెబుతున్నాయి.

సస్పెన్స్ థ్రిల్లర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్

హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do) చెల్లెలి హత్యకు రివేంజ్ తీర్చుకునే క్రైమ్ థ్రిల్లర్‌గా పాక్‌లో గత వారం రోజులుగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు 5.9 ఐఎండీబీ రేటింగ్ లభించింది.

అలాగే రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అలీ ఫజల్, రాధికా మదన్ లాంటి స్టార్స్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఆంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 3' (Lust Stories 3) గత 14 రోజులుగా పాకిస్థానీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఈ విధంగా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పాకిస్థాన్ డిజిటల్ స్పేస్‌లో తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More