...
...
Next Story

Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్స్.. ఈ టాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వెంటనే చూసేయండి.. ఓటీటీ నుంచి వెళ్లిపోతున్న సినిమా

Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలెర్ట్. హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మూవీ త్వరలోనే ఈ ప్లాట్‌ఫామ్ నుంచి వెళ్లిపోనుంది. ఇప్పటి వరకూ మీరు మూవీ చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.

Published on: May 30, 2026, 07:40:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఎవర్ గ్రీన్ యాక్షన్ థ్రిల్లర్ 'టాప్ గన్' (Top Gun - 1986) ఇటీవలే విజయవంతంగా 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. అంతేకాకుండా దీనికి సీక్వెల్‌గా వచ్చి సంచలన విజయం సాధించిన ‘టాప్ గన్: మావెరిక్’ (Top Gun: Maverick) చిత్రాన్ని కూడా కలిపి ‘డబుల్ ఫీచర్’ ఈవెంట్‌గా ప్రదర్శించడంతో ఫ్యాన్స్ థియేటర్లలో పండగ చేసుకున్నారు.

Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్స్.. ఈ టాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వెంటనే చూసేయండి.. ఓటీటీ నుంచి వెళ్లిపోతున్న సినిమా
Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్స్.. ఈ టాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వెంటనే చూసేయండి.. ఓటీటీ నుంచి వెళ్లిపోతున్న సినిమా

అయితే ఈ క్లాసిక్ సినిమాను ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో చూడాలనుకునే అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ నుండి శాశ్వతంగా వెళ్లిపోనుంది.

జూన్ 1 లోపే చూసేయండి..

మీకు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యామనే బాధ ఉంటే.. నెట్‌ఫ్లిక్స్ లో చూసేందుకు ఇదే ఆఖరి అవకాశం. జూన్ 1 నుండి 'టాప్ గన్' సినిమాను తమ స్ట్రీమింగ్ కేటలాగ్ నుండి తొలగిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

కాబట్టి ‘మావెరిక్’, ‘గూస్’ల హై-ఫ్లయింగ్ ఏరియల్ యాక్షన్ ఎపిసోడ్స్, క్లాసిక్ సెంటిమెంట్‌ను మరోసారి స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే.. వెంటనే నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి స్ట్రీమింగ్ చేసేయండి. అయితే నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ మూవీ వెళ్లిపోయినా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

‘టాప్ గన్’ మూవీ విశేషాలు

టోనీ స్కాట్ (Tony Scott) దర్శకత్వంలో వచ్చిన ఈ టాప్ గన్ మూవీ 1980ల నాటి సినిమా రంగాన్ని, పాప్ కల్చర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ స్టైలిష్ విజువల్స్, అద్భుతమైన విమాన విన్యాసాలు, ఎప్పటికీ గుర్తిండిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రాన్ని ఒక మాస్టర్‌క్లాస్‌గా నిలిపాయి.

1. 'టాప్ గన్' (1986) సినిమా నెట్‌ఫ్లిక్స్ నుండి ఎప్పుడు తొలగిస్తారు?

ఈ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్ 1, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్ నుండి తొలగించనున్నారు.

2. టాప్ గన్ మూవీ ఈ మధ్య థియేటర్లలో ఎందుకు రీ-రిలీజ్ అయింది?

ఈ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. దీనితో పాటు దీని సీక్వెల్ ‘టాప్ గన్: మావెరిక్’ను కూడా కలిపి డబుల్ ఫీచర్‌గా ప్రదర్శించారు.

3. టాప్ గన్ సినిమాను నిర్మించింది, పంపిణీ చేసింది ఎవరు?

ఈ చిత్రాన్ని డాన్ సింప్సన్/జెర్రీ బ్రక్‌హైమర్ ఫిల్మ్స్ నిర్మించగా, పారామౌంట్ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe