Netflix Web Series: పుస్తక ప్రియులు ఎంతోగానో ఆరాధించే ప్రముఖ రచయిత్రి ఝుంపా లాహిరి 2008లో రాసిన అంతర్జాతీయ ఉత్తమ నవలా సంకలనం 'అనకస్టమ్డ్ ఎర్త్' (Unaccustomed Earth) ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో వస్తోంది.

ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దీనిని 8 ఎపిసోడ్ల లిమిటెడ్ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌గా మలచగా, తాజాగా విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హాలీవుడ్లో గుర్తింపు పొందిన భారతీయ నటి ఫ్రీదా పింటో, దక్షిణాది నటుడు సిద్ధార్థ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
స్టోరీ, ట్రైలర్ ఇలా..
ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రకారం.. ఫ్రీదా పింటో 'పారుల్ చౌదరి' అనే ఇండియన్-అమెరికన్ వివాహిత పాత్రలో కనిపించారు. ఒక బాధ్యతాయుతమైన తల్లిగా జీవితాన్ని కొనసాగిస్తున్న పారుల్కు ఊహించని విధంగా క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తేలుతుంది. ఈ నిజం తెలుసుకున్న తర్వాత, ఆమె ముంబై నుంచి అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లోని తన పాత జీవితంలోకి తిరిగి వెళ్తుంది.
అక్కడే ఆమెకు తన గతం, మరిచిపోయిన పాత ప్రేమ ఎదురవుతాయి. తన మాజీ ప్రియుడి పాత్రలో నటుడు సిద్ధార్థ్ కనిపిస్తారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుసుకోవడంతో.. వాళ్ల మధ్య ఉన్న ఆ పాత జ్ఞాపకాలు, ఎమోషన్స్ మళ్లీ బయటకు వస్తాయి. ఈ పరిణామాలు పారుల్ వ్యక్తిగత జీవితంలో, ఆమె కుటుంబ బంధాల్లో ఎలాంటి సంక్షోభాన్ని సృష్టించాయనేది కథనంలో అత్యంత నాటకీయంగా చూపించారు.
ఫ్రీదా పింటో మాటల్లో సిరీస్ ప్రత్యేకత
ఈ వెబ్ సిరీస్ గురించి ఫ్రీదా పింటో మాట్లాడుతూ.. ఇండియన్-అమెరికన్ బెంగాలీ కుటుంబాల జీవన విధానం, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ఈ వెబ్ సిరీస్ ఎంతో అద్భుతంగా ఆవిష్కరిస్తుందని తెలిపారు.
"దక్షిణాసియా అమెరికన్ సమాజం సంస్కృతిని, వారి కుటుంబాల మధ్య ఉండే బలమైన అనుబంధాలను, వారు ఎదుర్కొనే సమస్యలను ఇంత లోతుగా టీవీ తెరపై ఇప్పటివరకు చూపించలేదు. ప్రతి పాత్రలోనూ ఒక యూనివర్సల్ ఎమోషన్ ఉంటుంది. తనకిష్టమైన కలల జీవితాన్ని జీవించడానికి ఒక వ్యక్తి ఎంతదూరమైనా వెళ్తాడా? దానికి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యం ఉందా? అనే ప్రశ్నకు పారుల్ పాత్ర సమాధానంగా నిలుస్తుంది" అని ఫ్రీదా వివరించారు.
అనకస్టమ్డ్ ఎర్త్ వెబ్ సిరీస్ విశేషాలు
{{/usCountry}}"దక్షిణాసియా అమెరికన్ సమాజం సంస్కృతిని, వారి కుటుంబాల మధ్య ఉండే బలమైన అనుబంధాలను, వారు ఎదుర్కొనే సమస్యలను ఇంత లోతుగా టీవీ తెరపై ఇప్పటివరకు చూపించలేదు. ప్రతి పాత్రలోనూ ఒక యూనివర్సల్ ఎమోషన్ ఉంటుంది. తనకిష్టమైన కలల జీవితాన్ని జీవించడానికి ఒక వ్యక్తి ఎంతదూరమైనా వెళ్తాడా? దానికి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యం ఉందా? అనే ప్రశ్నకు పారుల్ పాత్ర సమాధానంగా నిలుస్తుంది" అని ఫ్రీదా వివరించారు.
అనకస్టమ్డ్ ఎర్త్ వెబ్ సిరీస్ విశేషాలు
{{/usCountry}}ఈ 8 ఎపిసోడ్ల ఫ్యామిలీ డ్రామాను '3 బాడీ ప్రాబ్లమ్', 'ది నీవర్స్' చిత్రాల రచయిత్రి మధురి శేఖర్ సృష్టించారు. ఫ్రీదా పింటో, సిద్ధార్థ్ తోపాటు సరయూ బ్లూ, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, ఆది రాయ్, ఐలా సుందర్‌సింగ్ లాంటి వాళ్లు నటించారు. ఇర్ఫాన్ ఖాన్ క్లాసిక్ మూవీ 'ది లంచ్ బాక్స్' చిత్ర దర్శకుడు రితేష్ బాత్రా ఈ సిరీస్‌కు మొదటి రెండు ఎపిసోడ్లకు దర్శకత్వం వహించడంతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. జాన్ వెల్స్ ప్రొడక్షన్స్, వార్నర్ బ్రదర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
గతంలో ఝుంపా లాహిరి రాసిన 'ది నేమ్‌సేక్' (The Namesake) పుస్తకాన్ని దర్శకురాలు మీరా నాయర్ ఇర్ఫాన్ ఖాన్, టబు ప్రధాన పాత్రలతో సినిమాగా తీసి అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో 'అనకస్టమ్డ్ ఎర్త్' కూడా అలరిస్తుందని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.