...
...
Next Story

Ishan Kishan: ఇషాన్ కిష‌న్ గ‌ర్ల్‌ఫ్రెండ్ కోసం తెగ వెతుకుతున్న నెటిజ‌న్లు.. ఎవ‌రీ అదితి హుండియా.. షాకింగ్ బ్యాక్‌గ్రౌండ్

Ishan Kishan: టీ20 ప్రపంచకప్ లో ఇండియా గెలిచింది. ప్రజలందరూ సంబరాల్లో మునిగిపోయారు. ఇదే సమయంలో ఓ అమ్మాయి పేరు తెగ వైలర్ గా మారింది. ఆమెనే అదితి హుండియా. ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ గా ఆమె పేరు మార్మోగిపోతుంది. ఇంతకీ ఆమె బ్యాక్ గ్రౌండ్ మీకు తెలుసా? ఓ లుక్కేయండి.

Published on: Mar 9, 2026, 14:11:46 IST
Advertisement

టీమిండియా అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ సొంతం చేసుకుంది. ఆదివారం (మార్చి 8) రాత్రి ఫైనల్లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసింది. ఈ విజయంతో దేశమంతా సంబరాలు నెలకొన్నాయి. ఈ సమయంలోనే ఓ అమ్మాయి పేరు తెగ వైరల్ గా మారింది. అదితి హుండియా ఎవరు? ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్

వైరల్ గా ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి
వైరల్ గా ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి

ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ పై గెలిచిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ విక్టరీ తర్వాత టీమిండియా ప్లేయర్లు మైదానంలోనే డ్యాన్స్ చేశారు. సంతోషం పట్టలేక స్టెప్పులేశారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య డ్యాన్స్ కూడా వైరల్ గా మారింది. అయితే హార్దిక్ తో కలిసి డ్యాన్స్ చేసిన తర్వాత ఇషాన్ కిషన్ ఓ అమ్మాయిని పట్టుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు.

వైరల్ వీడియో

ఇషాన్ కిషన్ ముద్దు పెట్టిన అమ్మాయి పేరు అదితి హుండియా. ఆ అమ్మాయి ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అని అందరూ అంటున్నారు. టీ20 ప్రపంచకప్ లో ఇండియా విక్టరీ తర్వాత అదితి గ్రౌండ్ లోకి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఇషాన్ కిషన్ ను హగ్ చేసుకుంది. అతనితో కలిసి డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ కు ఇషాన్ కిషన్ ముద్దు పెట్టాడు.

ఆటగాళ్ల ఫ్యామిలీస్ తో

అదితి ఎవరు?

అదితి హుండియా.. జైపూర్‌కు చెందిన మోడల్. ఆమె బిజినెస్ వుమెన్ కూడా. జైపూర్‌లో జన్మించి పెరిగిన ఆమె ఉన్నత విద్య కోసం సెయింట్ జేవియర్స్ కాలేజీలో చేరింది. అంతకంటే ముందు ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంది. అదితి స్టూడెంట్ గా ఉన్నప్పుడే కాలేజీ ఫ్యాషన్ షోలు, లోకల్ ఈవెంట్లలో పార్టిసిపేట్ చేసింది.

మిస్ ఇండియా

2017లో మిస్ ఇండియా పోటీల్లో అదితి పాల్గొంది. ఫైనలిస్ట్‌గా నిలిచిన తర్వాత ఆమె పేరు మార్మోగిపోయింది. ఆ నెక్ట్స్ ఇయర్ మిస్ దివా సూపర్ నేచురల్ కిరీటాన్ని అదితి గెలుచుకుంది. మిస్ సూపర్ నేచురల్ 2019లో ఇండియాను రిప్రజెంట్ చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks