...
...
Next Story

Producer: సినిమా అనేది ఒక బాధ్యత, అర్థవంతమైన చిత్రాలకు ఇది పునాది- కొత్త సినిమా నిర్మాణంపై నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి

Producer Hansika Peddireddy About New Movie Launch: హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలిసారి నిర్మాణం జరుపుకుంటున్న మూవీ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లాంచ్ వేడుకలో సినిమా గురించి నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Feb 28, 2026, 14:15:23 IST
Advertisement

లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా జోనర్స్‌కు ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శనివారం గ్రాండ్‌గా నూతన చిత్రం ప్రారంభమైంది.

ఘనంగా ప్రారంభోత్సవం

సినిమా అనేది ఒక బాధ్యత, అర్థవంతమైన చిత్రాలకు ఇది పునాది- కొత్త సినిమా నిర్మాణంపై నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి
సినిమా అనేది ఒక బాధ్యత, అర్థవంతమైన చిత్రాలకు ఇది పునాది- కొత్త సినిమా నిర్మాణంపై నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి

హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణం అవుతున్న మొదటి చిత్రం ఈరోజు (ఫిబ్రవరి 28) ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు.

రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం

హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ హన్సిక పెద్దిరెడ్డి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు.

హీరోయిన్లుగా యువ జంట

ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్‌తో పాటు సీనియర్ నటులు దేవీ ప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమా అనేది ఒక కల

ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. "సినిమా అనేది నాకు ఒక కల. ఒక అభిరుచి. ఒక బాధ్యత. అదే ప్రేమతో ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాను" అని అన్నారు.

ప్రెస్టేజీయస్‌గా నిర్మిస్తున్నాం

"హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నా తొలి చిత్రాన్ని అత్యంత ప్రెస్టేజీయస్‌గా నిర్మిస్తున్నాం. మా మొదటి ప్రాజెక్ట్ ఒక అందమైన ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామా. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ఈ మూడు ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా ఈ కథను ఎంపిక చేసుకున్నాం" అని నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి చెప్పారు.

మనసుకు దగ్గరయ్యే భావాలు

"ఈ చిత్రం నిర్మాతగా తొలి అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరెన్నో మంచి, అర్థవంతమైన చిత్రాలకు పునాది అవుతుందని నమ్ముతున్నాను. ప్రేక్షకుల ఆశీస్సులు, మీడియా మిత్రుల ప్రోత్సాహం, సినీ పరిశ్రమలోని అందరి సహకారం మా బలం. మీ అందరి ప్రేమాభిమానాలతో ఈ ప్రయాణం విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నాను” అని నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి వెల్లడించారు.

రెగ్యులర్ షూటింగ్

కాగా, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శకుడు రఘువర్ధన్ కోట్ల తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks