Irumudi: మంచి సినిమాను ఆడియన్స్ ఎప్పుడూ నెత్తిన పెట్టుకుంటారు. మనసారా ఎంకరేజ్ చేస్తారు. ఒక మూవీని జనాలు ఓన్ చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇరుముడి సినిమాతో స్పష్టమవుతోంది. థియేటర్ల దగ్గర జనాలు ఎగబడుతున్నారు. టాక్సిక్ రిలీజ్ తో ఇరుముడి మూవీని ఎందుకు తొలగించారని ధర్నాలు చేస్తున్నారు.
ఇరుముడి కోసం ధర్నా

ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఇరుముడి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ మూవీ తెలుగు జనాలను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. థియేటర్లకు ఎగబడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుముడి సినిమా ప్రదర్శించాలంటూ ఓ థియేటర్ ముందు జనాలు ధర్నా చేయడం విశేషం.
టాక్సిక్ రిలీజ్
ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇంకా టికెట్లు దొరకడం కష్టంగానే మారింది. కానీ బుధవారం (ఆగస్టు 26) రిలీజైన టాక్సిక్ మూవీ కోసం ఇరుముడిని థియేటర్లలో నుంచి తీసేశారు. దీంతో జనాలకు కోపం వచ్చింది. ఇరుముడి చూద్దామని ఆశతో వచ్చిన ఆడియన్స్ థియేటర్లో ఆ మూవీ లేకపోవడంతో కోపంతో ఊగిపోయారు.
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని మక్తల్ లో ఉన్న వెంకటరమణ థియేటర్లో ఇరుముడి సక్సస్ ఫుల్ గా రన్ అయింది. కానీ టాక్సిక్ రావడంతో ఇరుముడిని తీసేశారు. ఇది ఊహించని జనాలు ఇరుముడి సినిమాను ప్రదర్శించాలని థియేటర్ ముందు ధర్నాకు దిగారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎక్స్ ట్రా చైర్ లు
థియేటర్లలో హౌస్ ఫుల్ అయితే ఆడియన్స్ డిమాండ్ మేరకు గతంలో ఎక్స్ ట్రా చైర్ లు వేసేవాళ్లు. కానీ ఈ ఓటీటీ జమానాలో అలా జరగడం అరుదుగా మారింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుముడి సినిమా రూపంలో అలాంటి సీన్లు థియేటర్లలో కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్లలో జనాలు డిమాండ్ చేయడంతో అదనంగా కుర్చీలు వేస్తున్నారు.
{{/usCountry}}థియేటర్లలో హౌస్ ఫుల్ అయితే ఆడియన్స్ డిమాండ్ మేరకు గతంలో ఎక్స్ ట్రా చైర్ లు వేసేవాళ్లు. కానీ ఈ ఓటీటీ జమానాలో అలా జరగడం అరుదుగా మారింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుముడి సినిమా రూపంలో అలాంటి సీన్లు థియేటర్లలో కనిపిస్తున్నాయి. కొన్ని థియేటర్లలో జనాలు డిమాండ్ చేయడంతో అదనంగా కుర్చీలు వేస్తున్నారు.
{{/usCountry}}రవన్నను తొక్కేస్తున్నారా?
టాక్సిక్ సినిమా రిలీజ్ తో బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అవుతున్న ఇరుముడి మూవీని థియేటర్ల నుంచి తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. కన్నడ డబ్బింగ్ మూవీ కోసం తెలుగు ఒరిజినల్ మూవీని ఎందుకు తీసేస్తున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు. రవన్న (రవితేజ)ను తొక్కేస్తున్నారా? అని ఫైర్ అవుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ కొడుకు కాదనే ఇలా చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
వరుస ఫ్లాప్ లతో ఉన్న రవితేజకు ఇరుముడి మూవీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. వీక్ డేస్ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గత 24 గంటల్లో బుక్ మై షోలో ఏకంగా 2 లక్షల 43 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఈ జోరు చూస్తుంటే రవితేజ మూవీ మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమనిపిస్తోంది.