ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన 'ది రాజా సాబ్' (The Raja Saab)లో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రభాస్‌తో పనిచేయడం, సినిమాలోని హైలైట్స్, ముఖ్యంగా చివరి 30 నిమిషాల క్లైమాక్స్ గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చివరి 30 నిమిషాలు మైండ్ బ్లోయింగ్

ది రాజా సాబ్ మూవీ చూశారా అని నిధిని అడిగినప్పుడు ఆమె ఇలా చెప్పింది. “డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా చూశాను. ఇందులో కామెడీ, రొమాన్స్, హారర్, ఫ్యాంటసీ, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి. మారుతి వీటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అయితే.. సెకండాఫ్, ముఖ్యంగా చివరి 30 నిమిషాల క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. షూటింగ్ అప్పుడు మాకు పెద్దగా అర్థం కాలేదు కానీ, వీఎఫ్ఎక్స్ అన్నీ యాడ్ అయ్యాక అవుట్‌పుట్ చూసి షాక్ అయ్యాం. ఆడియెన్స్ కచ్చితంగా మంత్రముగ్ధులవుతారు” అని చెప్పింది.
అది నా అదృష్టం
ఇక ప్రభాస్ తో నటించడంపైనా నిధి స్పందించింది. “ప్రభాస్ తో నటించడం నా అదృష్టం. గతంలో పవన్ కళ్యాణ్ తో, ఇప్పుడు ప్రభాస్ తో.. ఇద్దరూ వేరే లెవెల్. ప్రభాస్ నిజంగానే అందరూ పిలిచేట్టు 'డార్లింగ్'. ఎలాంటి స్టార్ ఆటిట్యూడ్ చూపించరు. చాలా కాలం తర్వాత ఆయన ఇందులో ఫుల్ ఫన్ రోల్ చేస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్, సినిమాలో ఆయన కనిపించే రెండో అవతారం చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆ రెండో లుక్ మాత్రం సీక్రెట్” అని చెప్పింది.
క్లైమాక్స్ హైప్ గురించి..
ది రాజా సాబ్ మూవీ క్లైమాక్స్ గురించి మరీ ఎక్కువ హైప్ ఇవ్వడంపై నిధి అగర్వాల్ ఇలా చెప్పింది. “ఆ హైప్ వంద శాతం కరెక్ట్. నేను ఇప్పటివరకు అలాంటి సినిమా చూడలేదు. కేవలం క్లైమాక్స్ కోసమే మేము వారాల తరబడి షూటింగ్ చేశాం. అది దాదాపు అరగంట సేపు ఉంటుంది. అందులో వచ్చే ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ప్రభాస్ పర్ఫార్మెన్స్, ట్విస్టులు చూసి ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే” అని నిధి అనడం విశేషం.
ఆలస్యమవడంతో నిరాశ చెందా
{{/usCountry}}ది రాజా సాబ్ మూవీ క్లైమాక్స్ గురించి మరీ ఎక్కువ హైప్ ఇవ్వడంపై నిధి అగర్వాల్ ఇలా చెప్పింది. “ఆ హైప్ వంద శాతం కరెక్ట్. నేను ఇప్పటివరకు అలాంటి సినిమా చూడలేదు. కేవలం క్లైమాక్స్ కోసమే మేము వారాల తరబడి షూటింగ్ చేశాం. అది దాదాపు అరగంట సేపు ఉంటుంది. అందులో వచ్చే ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ప్రభాస్ పర్ఫార్మెన్స్, ట్విస్టులు చూసి ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే” అని నిధి అనడం విశేషం.
ఆలస్యమవడంతో నిరాశ చెందా
{{/usCountry}}ఇక పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్లతో చేసినా.. రెండు సినిమాలూ చాలా ఆలస్యం కావడంపైనా నిధి మాట్లాడింది. “పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్లతో సినిమాలు ఒప్పుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. డిలే అయినప్పుడు కాస్త నిరాశపడ్డా. మళ్ళీ షూటింగ్ మొదలయ్యాక అదంతా మర్చిపోయాను. నాకు షూటింగ్ సెట్ అంటే చాలా ఇష్టం. కొన్ని మన చేతిలో ఉండవు. కానీ ఇప్పుడు పండుగ టైంలో సినిమా వస్తోంది కాబట్టి ఆ వెయిటింగ్ కి తగ్గ ఫలితం ఉంటుంది” అని నిధి చెప్పింది.
ప్రభాస్, నిధి అగర్వాల్ తోపాటు మాళవికా మోహనన్, రిద్ధి నటించిన ది రాజా సాబ్ మూవీ ఈ శుక్రవారం (జనవరి 9) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.