...
...
Next Story

Pocket Rockkets Teaser: అమ్మాయిని ముంచి క్యాసినోలో తేలి.. నిహారిక నుంచి మరో థ్రిల్లర్ మూవీ.. పాకెట్ రాకెట్స్ టీజర్

Pocket Rockkets Teaser: నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'పాకెట్ రాకెట్స్' (Pocket Rockets) నుంచి 'ది ఫస్ట్ హ్యాండ్' టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రుద్ర అత్రి దర్శకత్వంలో త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Published on: Nov 3, 2026, 20:07:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Pocket Rockkets Teaser: నిహారిక కొణిదెల తెలుగులో మరో క్రేజీ కామెడీ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పాకెట్ రాకెట్స్' (Pocket Rockets).

Pocket Rockkets Teaser: అమ్మాయిని ముంచి క్యాసినోలో తేలి.. నిహారిక నుంచి మరో థ్రిల్లర్ మూవీ.. పాకెట్ రాకెట్స్ టీజర్
Pocket Rockkets Teaser: అమ్మాయిని ముంచి క్యాసినోలో తేలి.. నిహారిక నుంచి మరో థ్రిల్లర్ మూవీ.. పాకెట్ రాకెట్స్ టీజర్

'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ కథానాయకులుగా, 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం కథానాయికగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి మంగళవారం (నవంబర్ 3) 'ది ఫస్ట్ హ్యాండ్' (The First Hand) పేరిట టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

శ్రీలంక క్యాసినో బ్యాక్‌డ్రాప్‌లో..

క్యాసినోలకు ఇండియాలో గోవా ఎలా పాపులరో శ్రీలంక కూడా అంతే ఫేమస్. అలాంటి శ్రీలంక క్యాసినో నేపథ్యంలో సాగే మూవీయే ఈ పాకెట్ రాకెట్స్. “ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. జీవితంలో తొలిసారి కల కంటే రియాలిటీనే బావుంది” అని ఒక కుర్రాడు అనడం ఈ టీజర్ లో చూడొచ్చు.

దానికి మరొకడు స్పందిస్తూ.. “డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోకల్ బస్తీ గాయ్స్.. ఐయామ్ ది ఓనర్ ఆఫ్ 2.2 లాక్స్” అని చెప్పే ఫన్నీ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఆ తర్వాత టీజర్ కథ గ్యాంబ్లింగ్ లోకి మారుతుంది.

బస్తీ కుర్రాళ్ల కలలు.. విదేశీ గ్యాంబ్లింగ్‌లో జేడీ చక్రవర్తి ఎంట్రీ

బస్తీలో ఉంటూ చదువుకుంటూ బతుకు వెళ్లదీయడానికి తీవ్రంగా కష్టపడే ఇద్దరు కుర్రాళ్ల కథ ఇది. తమ జీవితం ఎప్పుడు బాగుపడుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో.. వారి జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది.

శ్రీలంకకు చేరుకున్నాక అక్కడ గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం, వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి (JD Chakravarthy) క్యారెక్టర్ పరిచయం కావడం సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. జేడీ చక్రవర్తి ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

"పాకెట్ రాకెట్స్" సాంకేతిక వర్గం

- సమర్పణ & నిర్మాణం: నిహారిక కొణిదెల, పద్మజ కొణిదెల (పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్)

- దర్శకత్వం: రుద్ర అత్రి

- సంగీతం: గ్యానీ

- సినిమాటోగ్రఫీ: ఎదురోలు రాజు

- ఎడిటింగ్: అన్వర్ అలీ

షూటింగ్ పూర్తి.. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్

యూత్‌ఫుల్, రొమాంటిక్, క్రైమ్ అండ్ గ్యాంబ్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్యానీ అందించిన నేపథ్య సంగీతం, ఎదురోలు రాజు విజువల్స్ టీజర్‌ను కలర్‌ఫుల్‌గా మార్చాయి.

ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ 11న రిలీజ్ చేయబోతున్నట్లు టీజర్ చివర్లో ఓ క్యాసినో టేబుల్ పై చూపించిన తీరు బాగుంది. 'కమిటీ కుర్రోళ్లు' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నిహారిక కొణిదెల బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks