కార్తీకేయ 2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు స్వయంభు అనే మరో హిస్టారికల్ వార్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బుధవారం (ఫిబ్రవరి 11) రిలీజైన టీజర్ అదిరిపోయింది. ఈ రిలీజ్ ఈవెంట్లో మూవీ టీమ్ తో కలిసి పాల్గొన్న నిఖిల్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో చూడండి.
నేను కింగ్ లేదా డాన్ కాదు.. ఓ బచ్చా

స్వయంభు మూవీ స్టోరీ ఏంటన్నది చెబుతూ నిఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ చరిత్రలో పెద్ద పెద్ద రాజుల గురించి మాట్లాడుకుంటామే తప్ప చిన్నవాళ్ల గురించి చెప్పుకోమని, అలాంటి ఓ వ్యక్తి కథే ఇది అని అన్నాడు.
“ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణం ఉంది. మన దేశం గురించి చూస్తే ఎంతో మంది వారియర్స్ ఉన్నారు. మనం ఎప్పుడూ కృష్ణదేవరాయ, కాటంరాజులాంటి గొప్పగొప్ప వాళ్ల గురించే చెప్పుకుంటాం. కానీ రాయలసీమ ప్రాంతంలో 985 ఏడీలో కృష్ణ ఓ అండర్ డాగ్, బచ్చాగాడు ఉండేవాడు. అతని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. వాడు ఎలా వచ్చాడు, ఎలా ఎదిగాడు, వాడి కలలు ఏంటి, ఆశయాలు ఏంటన్నదే ఈ సినిమా. ఓ బచ్చాగాడి స్టోరీ అంతే. ఇందులో నేను కింగ్ లేదా డాన్ కాదు” అని నిఖిల్ అనడం విశేషం.
ఒళ్లు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా
రెండేళ్ల నుంచి తాను ఏం చేస్తున్నానన్న ప్రశ్నకు ఈ స్వయంభు సినిమా సమాధానమని నిఖిల్ అన్నాడు. “నేను రెండేళ్లుగా మీ ఈ అరుపులు మిస్సయ్యాను. ఎందుకంటే కార్తికేయ 2 సినిమా తర్వాత ఏదో ఒకటి అద్భుతంగా చేయాలని అనుకున్నాను. ఆ సినిమాను మీరు పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. అందుకే ఓ మంచి సినిమా చేద్దామనుకొని ఇన్నాళ్లు ఆగాను. ఇది ఒళ్లు దగ్గర పెట్టుకొని, భయపడుతూ, చాలా జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభు. మీరందరికీ నచ్చుతుంది. నిఖిల్ మావాడు అని చెప్పుకోవడానికి మీరందరూ ఇష్టపడతారు” అని అన్నాడు.
స్వయంభు టీజర్, మూవీ విశేషాలు
స్వయంభు మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి డైరెక్టర్. ఈ సినిమాలో నిఖిల్ తో పాటు సంయుక్త మీనన్, నభా నటేష్, సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు నటిస్తున్నారు. పిక్సల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ స్వయంభు సినిమాను నిర్మిస్తున్నారు.
{{/usCountry}}స్వయంభు మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి డైరెక్టర్. ఈ సినిమాలో నిఖిల్ తో పాటు సంయుక్త మీనన్, నభా నటేష్, సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు నటిస్తున్నారు. పిక్సల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ స్వయంభు సినిమాను నిర్మిస్తున్నారు.
{{/usCountry}}స్వయంభు సినిమాలో ప్రజల కోసం రాజులతో పోరాడే యోధుడిగా నిఖిల్ కనిపించనున్నాడు. టీజర్ లో అతని డైలాగ్స్, యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ‘సాక్షాత్తూ ఆ సదాశివుడే దిగివిచ్చి శ్రీ రాముడికి అందించిన ఈ సింగూరికి కూడా అరణ్యవాసమా’ అనే డైలాగ్ తో మిస్టీరియస్ గా టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాజ్యం కోసం అమాయక ప్రజల ప్రాణాలను తీసే సీన్లతో టీజర్ సాగుతుంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ బీజీఎం అయితే మరో లెవెల్లో ఉంది. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.