నిఖిల్ స్వయంభు టీజర్ బ్లాస్ట్..బాహుబలి రేంజ్ విజువల్స్..8 భాషల్లో గర్జించబోతున్న యోధుడు.. చైనీస్, స్పానిష్, అరబిక్ లోనూ!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కొత్తగా మారిపోయాడు. పోరాట యోధుడిగా అతను నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘స్వయంభు’ టీజర్ ఇవాళ రిలీజైంది. అద్భుతమైన పోరాటాలతో, అదిరే విజువల్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ కానుంది. బాహుబలి రేంజ్ విజువల్స్ తో స్వయంభు టీజర్ అదిరిపోయింది.  

Published on: Feb 11, 2026, 11:55:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీకేయ 2తో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టేందుకు ‘స్వయంభు’తో రాబోతున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ను ఇవాళ (ఫిబ్రవరి 11) రిలీజ్ చేశారు మేకర్స్. అదిరే యాక్షన్, అద్భుతమైన విజువల్స్ తో టీజర్ అదిరిపోయింది.

స్వయంభు పోస్టర్ లో నిఖిల్ (x/actor_Nikhil)
స్వయంభు పోస్టర్ లో నిఖిల్ (x/actor_Nikhil)

స్వయంభు టీజర్

హీరో నిఖిల్ రెండేళ్లుగా స్వయంభు సినిమా కోసం కష్టపడుతున్నాడు. యోధుడి క్యారెక్టర్ కు తగ్గట్లు తన ఫిజిక్ ను మార్చుకున్నాడు. కత్తి పట్టి పోరాటాలు చేస్తున్నాడు. స్వయంభు మూవీ కోసం తీవ్రంగా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఆ కష్టం స్వయంభు మూవీ టీజర్ లో కనిపించింది. బుధవారం రిలీజైన ఈ టీజర్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. విజువల్స్ బాహుబలి రేంజ్ లో ఉన్నాయంటున్నారు.

పీరియాడిక్ వార్ డ్రామా

స్వయంభు మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భరత్ కృష్ణ‌మాచారి డైరెక్టర్. ఈ సినిమాలో నిఖిల్ తో పాటు సంయుక్త మీనన్, నభా నటేష్, సునీల్, సుబ్బరాజు, సత్య తదితరులు నటిస్తున్నారు. పిక్సల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ స్వయంభు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు ప్రసాద్ ఐమ్యాక్స్ లో జరిగిన ఈవెంట్లో స్వయంభు టీజర్ రిలీజ్ చేశారు.

యోధుడిగా నిఖిల్

స్వయంభు సినిమాలో ప్రజల కోసం రాజులతో పోరాడే యోధుడిగా నిఖిల్ కనిపించనున్నాడు. టీజర్ లో అతని డైలాగ్స్, యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ‘సాక్షాత్తూ ఆ సదాశివుడే దిగివిచ్చి శ్రీ రాముడికి అందించిన ఈ సింగూరికి కూడా అరణ్యవాసమా’ అనే డైలాగ్ తో మిస్టీరియస్ గా టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాజ్యం కోసం అమాయక ప్రజల ప్రాణాలను తీసే సీన్లతో టీజర్ సాగుతుంది.

హీరో ఎంట్రీ

కాలం కత్తై దూస్తే.. కాపాడే కవచం ఒకటి కావాలి కదా అనే డైలాగ్ తర్వాత యోధుడిగా నిఖిల్ ఎంట్రీ అదిరిపోయింది. తెగింపు ఎంత దూరమైనా వెళ్తుందంటూ వచ్చే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. సంయుక్త మీనన్ కూడా ఫైటింగ్ సీక్వెన్స్ లో కనిపించింది. రాజకుమారిగా నభా నటేష్ అందంగా అలరించింది.

చైనీస్, స్పానిష్ లోనూ

స్వయంభు మూవీ అనౌన్స్ మెంట్ అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు టీజర్ తో హైప్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. 2026 సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More