Nikhil Siddhartha Swayambhu: 175 రోజులు, 2500 గ్రాఫిక్స్ షాట్స్.. రిలీజ్‌కు రెడీ అవుతోన్న హీరో నిఖిల్ స్వయంభు !

Nikhil Siddhartha Swayambhu 2500 VFX Shots: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' షూటింగ్ తుది దశకు చేరుకుంది. 175 రోజుల సుదీర్ఘ చిత్రీకరణ, 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌తో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విశేషాలు ఇవే.

Published on: Sep 13, 2026, 09:20:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nikhil Siddhartha Swayambhu 2500 VFX Shots: 'కార్తికేయ 2' విజయంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఇప్పుడు సరికొత్త చారిత్రక సాహసానికి సిద్ధమవుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు'.

175 రోజులు, 2500 గ్రాఫిక్స్ షాట్స్.. రిలీజ్‌కు రెడీ అవుతోన్న హీరో నిఖిల్ స్వయంభూ !
175 రోజులు, 2500 గ్రాఫిక్స్ షాట్స్.. రిలీజ్‌కు రెడీ అవుతోన్న హీరో నిఖిల్ స్వయంభూ !

రిలీజ్‌కు రెడీగా స్వయంభు

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. స్వయంభు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు శరవేగంగా సన్నాహాలు చేసుకుంటోంది.

175 రోజుల ప్రయాణం.. 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్!

స్వయంభు సినిమాను ఏ స్థాయిలో రూపొందిస్తున్నారో చాటిచెప్పేలా మేకర్స్ ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఏకంగా 175 రోజుల పాటు ఈ చిత్రం కోసం విరామం లేకుండా చిత్రీకరణ సాగించారు. వెండితెరపై అద్భుతమైన విజువల్ వండర్‌ను ఆవిష్కరించే క్రమంలో 2,500కు పైగా వీఎఫ్‌ఎక్స్ (VFX) షాట్స్‌ను ఉపయోగిస్తున్నారు.

యుద్ధవీరుడిగా నిఖిల్ సిద్ధార్థ్

తాజాగా విడుదల చేసిన స్వయంభు బిహైండ్ ది సీన్స్ (BTS) చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో నిఖిల్ యుద్దవీరుడి రూపంలో (ఇంటెన్స్ వారియర్ అవతార్) యాక్షన్ సీక్వెన్స్ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నారు.

దిగ్గజ టెక్నీషియన్లతో విజువల్ ట్రీట్

"అద్భుతమైన ఫైనల్ అవుట్‌పుట్ కోసం కొంత సమయం తీసుకున్నాం, ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి" అని చిత్ర బృందం నమ్మకంతో వెల్లడించింది. ఈ చిత్రానికి పనిచేస్తున్న సాంకేతిక బృందం సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.

రవి బస్రూర్ సంగీతం

'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాలతో విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

సెట్స్‌పై చారిత్రక ప్రపంచం

ఎం. ప్రభాహరన్, రవీందర్ నేతృత్వంలోని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఆనాటి చారిత్రక ప్రపంచాన్ని సెట్స్‌పై పునర్నిర్మించింది. నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా అలరించనున్నారు.

త్వరలోనే విడుదల తేదీ ప్రకటన

ఇప్పటికే విడుదలైన స్వయంభు టీజర్, ‘రా రా ధీవర’ సాంగ్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ సినిమాలో హీరో పాత్రకున్న లార్జర్ దాన్ లైఫ్ స్వభావాన్ని ఈ పాట చక్కగా ఆవిష్కరించింది. ప్రమోషన్ల వేగాన్ని పెంచి త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: స్వయంభు సినిమాలో హీరో ఎవరు?

A1: ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా యుద్దవీరుడి పాత్రలో నటిస్తున్నారు.

Q2: స్వయంభు చిత్ర దర్శకుడు ఎవరు?

A2: ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.

Q3: ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ (VFX) ప్రాముఖ్యత ఏంటి?

A3: సినిమాలో ప్రేక్షకులకు బ్రహ్మాండమైన విజువల్ అనుభూతిని అందించడానికి 2,500కు పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను ఉపయోగిస్తున్నారు.

Q4: స్వయంభు చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఎవరు?

A4: 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More