...
...
Next Story

Nikhil: మమతకు సరైన బుద్ధి చెప్పారు.. బెంగాల్ ప్రజలు అది మరచిపోలేదు: నిఖిల్ సిద్ధార్థ ట్వీట్ వైరల్

Nikhil: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సామాన్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు.

Published on: May 4, 2026, 22:07:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nikhil: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆసుపత్రిలో జరిగిన అమానుషంపై యావత్ భారత్ నిరసనలతో అట్టుడికిపోయింది. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిఖిల్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. అక్కడి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బెంగాల్ ప్రజలు మర్చిపోలేదు

Nikhil: మమతకు సరైన బుద్ధి చెప్పారు.. బెంగాల్ ప్రజలు అది మరచిపోలేదు: నిఖిల్ సిద్ధార్థ ట్వీట్ వైరల్
Nikhil: మమతకు సరైన బుద్ధి చెప్పారు.. బెంగాల్ ప్రజలు అది మరచిపోలేదు: నిఖిల్ సిద్ధార్థ ట్వీట్ వైరల్

ఆర్జీ కర్ వైద్య కళాశాలలో జరిగిన దారుణాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలు మర్చిపోలేదని, అలాగే దోషులను వెనకేసుకొచ్చిన వారిని క్షమించలేదని నిఖిల్ అభిప్రాయపడ్డారు.

"పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆ ఘటనను మర్చిపోలేదు.. మన్నించలేదు కూడా. సామాన్య ప్రజల పట్ల శ్రద్ధ చూపని ప్రభుత్వానికి వారు సరైన రీతిలో బుద్ధి చెప్పారు" అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిఖిల్ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజలే నిర్ణయాత్మక శక్తిగా మారాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

న్యాయం కోసం గళం

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో నిఖిల్ ఈ ట్వీట్ చేశారు. "జస్టిస్ ఫర్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హారర్" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆయన జోడించారు. ఒక నటుడిగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా నిఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. సామాన్యుల భద్రతను గాలికొదిలేసిన పాలకులకు ఓటు రూపంలో ప్రజలు గుణపాఠం నేర్పారని ఆయన విశ్లేషించారు.

ఈ ఘటన జరిగిన సమయంలో తాను చేసిన ఓ వీడియోను దీనికి జత చేశారు. 2024లో ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని చేసిన ఆ వీడియోలో ఆర్జీ కర్ ఘటనపై నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడుసార్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోనే తృణమూల్ కాంగ్రెస్.. ఈసారి కేవలం 79 సీట్లకే పరిమితమైంది. మమత కూడా తాను పోటీ చేసిన భవానీపూర్ లో ఓటమి పాలయ్యారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: నిఖిల్ సిద్ధార్థ్ తన ట్వీట్‌లో ఏ ఘటన గురించి ప్రస్తావించారు?

జవాబు: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన అమానుష ఘటన, దానికి బాధ్యులైన వారికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు గురించి నిఖిల్ ప్రస్తావించారు.

ప్రశ్న: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై నిఖిల్ చేసిన విమర్శ ఏమిటి?

జవాబు: సామాన్య ప్రజల పట్ల శ్రద్ధ చూపని ప్రభుత్వానికి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని, ఆ దారుణాన్ని వారు మర్చిపోలేదని నిఖిల్ విమర్శించారు.

బెంగాల్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది?

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 208 స్థానాల్లో గెలిచింది. తృణమూల్ కేవలం 79 స్థానాలకే పరిమితమైంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe