...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ.. జెన్‌ జీ లవ్ స్టోరీ.. ఐఎండీబీలో 8.4 రేటింగ్..

Nilave OTT Release Date: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ మూవీ రాబోతోంది. జెన్ జీ నచ్చే లవ్ స్టోరీతో వాలెంటైన్స్ డేకు థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Published on: Apr 07, 2026 05:17 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nilave OTT Release Date: ఓటీటీ ప్రపంచంలో చిన్న సినిమాలకు, స్వచ్ఛమైన ప్రేమకథలకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే విభిన్నమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న ఈటీవీ విన్ (ETV Win).. ప్రేక్షకులను మరో అందమైన అనుభూతిలో ముంచెత్తేందుకు సిద్ధమైంది. 'నిలవే' (Nilave) పేరుతో ఈ ఏడాది వాలెంటైన్స్ డేకు థియేటర్లలో రిలీజైన సినిమాను ఇప్పుడు స్ట్రీమింగ్ చేయబోతోంది.

నిలవే ఓటీటీ స్ట్రీమింగ్

OTT Telugu: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ.. జెన్‌ జీ లవ్ స్టోరీ.. ఐఎండీబీలో 8.4 రేటింగ్..
OTT Telugu: ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ.. జెన్‌ జీ లవ్ స్టోరీ.. ఐఎండీబీలో 8.4 రేటింగ్..

జెన్ జీ మెచ్చే లవ్ స్టోరీతో వచ్చిన నిలవే మూవీ సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఐఎండీబీలో 8.4 రేటింగ్ నమోదు చేసుకున్న ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (ఏప్రిల్ 9) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

“ఓ కలలా.. ఓ జ్ఞాపకంలా.. నిలవే.. ప్రేమ, కోరిక, అందమైన ఎమోషన్లతో కూడిన స్టోరీ. ఏప్రిల్ 9న కేవలం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.

నిలవే మూవీ స్టోరీ, ఇతర విశేషాలు

నిలవే మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైంది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, జీవన్ కుమార్ లాంటి వాళ్లు నటించారు. సౌమిత్ రావు, సాయి కే వెన్నెం డైరెక్ట్ చేశారు. జీవితంలో ఓ అమ్మాయి తోడు కోసం పరితపించే యువకుడు, అబ్బాయితో శారీరక సంబంధానికి సిద్ధమైనా కలిసి ఉండటం ఇష్టం లేని అమ్మాయి చుట్టూ తిరిగే ఓ భిన్నమైన లవ్ స్టోరీయే ఈ నిలవే మూవీ.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe