నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నిజం తెలిసిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ డ్రామా చేస్తుంది శాలిని. క్రాంతి ప్రేమను వాడుకున్నాను కానీ క్రాంతి మీద ప్రేమ అబద్ధం కాదని, క్రాంతిని విడిచిపెట్టి ఉండలేనని, ఆడదంటే నీలా ఉండాలని, నేను ఓడిపోయానని అంటుంది శాలిని.
అందరి ప్రేమను పొందాలి

వదిన తనను వెళ్లమను. నా మనసు మారొచ్చు అని క్రాంతి అంటే.. అది నాకోసం మారొచ్చుగా. చంద్రలా అందరి ప్రేమను పొందాలని ఉంది. ప్రాణ భిక్ష పెట్టిన దేవత చంద్రకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నానని శాలిని అంటుంది. కానీ, క్రాంతి వినడు. నేను మారానని నీకు తెలిసేలా చేసే వెళ్తాను అని గన్ తీసుకుని కాల్చుకోవాలనుకుంటుంది శాలిని.
కానీ, చంద్రకళ ఆపుతుంది. పశ్చాత్తాపం లేని బతుకు ఎందుకు, నేను మారానని ప్రూవ్ చేసుకుంటాను చంద్ర, నాకు ఒక్క అవకాశం ఇవ్వు క్రాంతి అని వేడుకుంటుంది శాలిని. వదిన తను డ్రామా చేస్తుందన క్రాంతి అంటాడు. సరే నువ్వన్నట్లే నీకు అవకాశం ఇస్తాను. కానీ, దానికి నీ వల్ల బాధపడ్డ నా భర్త అనుమతి కావాలి అని జగదీశ్వరి అంటుంది.
దాంతో రఘురాం కాళ్లపై పడి తనకు అవకాశం ఇవ్వమని వేడుకుంటుంది శాలిని. నమ్మొద్దని క్రాంతి, మెడపట్టి గెంటేయమని శ్యామల, కామాక్షి అంటారు. ఆగండి. అవకాశం ఇవ్వాల్సిందే. శాలిని వల్ల ఇంట్లో అందరికంటే ఎక్కువ బాధపడింది చంద్ర. తను ఒప్పుకుంటే ఇస్తానని రఘురాం అంటాడు. దాంతో చంద్రకళ కాళ్లపై పడుతుంది శాలిని.
నీ భర్త మనసు గెలుచుకో
ఆ తర్వాత విరాట్ కాళ్లపై పడుతుంది శాలిని. సరే క్రాంతి సంతోషం కూడా ముఖ్యమే అని చంద్రకళ అంటుంది. లేదు ఇంట్లో ఉండాలన్ని మీ నిర్ణయం, కానీ నా జీవితంలో ఉండాలనేది నా నిర్ణయం. నేను మనిషిలానే చూడను అని క్రాంతి అంటాడు. అన్ని మర్చిపోయి నీ భర్త మనసు గెలుచుకో అని చంద్రకళ అంటుంది. దాంతో శాలిని ఇంట్లోకి వెళ్తుంది.
{{/usCountry}}ఆ తర్వాత విరాట్ కాళ్లపై పడుతుంది శాలిని. సరే క్రాంతి సంతోషం కూడా ముఖ్యమే అని చంద్రకళ అంటుంది. లేదు ఇంట్లో ఉండాలన్ని మీ నిర్ణయం, కానీ నా జీవితంలో ఉండాలనేది నా నిర్ణయం. నేను మనిషిలానే చూడను అని క్రాంతి అంటాడు. అన్ని మర్చిపోయి నీ భర్త మనసు గెలుచుకో అని చంద్రకళ అంటుంది. దాంతో శాలిని ఇంట్లోకి వెళ్తుంది.
{{/usCountry}}ఇంకోసారి తోక జాడించాలని చూస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది జగదీశ్వరి. చంద్రకళను ప్రేమగా హగ్ చేసుకుని మురిసిపోతుంది జగదీశ్వరి. తర్వాత శాలిని గురించి చెబుతూ షాక్ అవుతారు కామాక్షి, శ్రుతి. అలాంటి దాన్ని ఉంచుకోవడం కూడా రిస్కే. అత్తయ్య మావయ్య తప్పు చేశారనిపిస్తుందని శ్రుతి అంటుంది. నిజం తెలిసిపోయింది కాబట్టి శాలిని అలా చేయదు. అందరి కాళ్ల మీద పడి క్షమించమని అడిగింది కదా అని కామాక్షి అంటుంది.
శాలినికి హెల్ప్ చేసినందుకు మనం కూడా బుక్ అయిపోతామని శ్రుతి అంటుంది. ఏది ఏమైనా నా తప్పు నేను సరిదిద్దుకోవాలని శ్రుతి అంటే.. ఇంత మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చిందే అని కామాక్షి అంటుంది. సిచ్యువేషన్స్ అని వెళ్లిపోతుంది శ్రుతి. క్రాంతి కోసమే శాలినిని వదిలేసానని రఘురాంతో అంటుంది జగదీశ్వరి.
ఇప్పుడు లెక్క వేరు
శాలిని వల్ల తాను కోల్పోయిన విలువైన క్షణాల గురించి చెప్పిన రఘురాం తనకంటే చంద్రకళ ఎక్కువ బాధలు అనుభవించిందని చెబుతాడు. చంద్ర మనసు చాలా గొప్పది అని శ్యామల మెచ్చుకుంటుంది. తను నా మేనకోడలు. నా ఇంటి దీపం అని జగదీశ్వరి అంటుంది. క్రాంతి మనసు ముక్కలు అయిందని అనుకుంటారు. ఇక శాలినికి చుక్కలే. నేను తొక్కిపెట్టి నార తీస్తాను. ఇప్పుడు లెక్క వేరు అని శ్యామల అంటుంది.
చంద్ర మీద ప్రేమ వర్షంలా కురిపిస్తానంటుంది శ్యామల. మరోవైపు విరాట్‌ను వెనుక నుంచి హగ్ చేసుకుంటుంది చంద్రకళ. అంతా మంచే జరిగింది. శాలిని మారింది. ఒక క్రాంతినే కోపంగా ఉన్నాడు. మనసు ప్రశాంతంగా ఉంది అని చంద్రకళ అంటుంది. ఇక బుజ్జి పిల్లాడు ఇంట్లో సందడి చేయాలని పిల్లల గురించి చెబుతూ శోభనం, కమిట్ అవ్వడం గుర్తు చేస్తాడు విరాట్.
ఈరోజు బ్రెయిన్ హీటెక్కిపోయింది. కాబట్టి ఇవాళ వద్దు. దానికి మంచి ప్లానింగ్, అట్మాస్పియర్ కావాలి అని చంద్రకళ అంటుంది. చక్కెర, పాయసం తీయగా ఉన్నా పాయసం తింటే వచ్చే ఫీల్ వేరు. అలాంటప్పుడు చక్కెర కోసం కక్రుత్తి పడతావేంటీ బావ అని చంద్రకళ అంటుంది.
వాలంటైన్స్ డే వేడుకలు
తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ చంద్రను క్షమించమని అడుగుతుంది శ్యామల. తర్వాత ఇంట్లో వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. మూడు జంటలు కేక్ కట్ చేయాలని కేక్ తెప్పిస్తాడు రఘురాం. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.