నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సైకియార్టిస్ట్ ప్రకాష్‌కు సేవలు చేస్తుంది శ్యామల. రఘురాంకు ట్రీట్‌మెంట్ ఇప్పుడే మొదలు పెడతానని ప్రకాష్‌గా వచ్చిన అర్జున్ అంటాడు. ఇంతలో అర్జున్‌కు మెసేజ్ వస్తుంది. పాప ఇద్దరం లేవని మారం చేస్తుంది. నేను వెళ్తాను అని చెబుతుంది చంద్రకళ.
వెళ్లిపోయిన చంద్రకళ

బ్యాగ్‌తో వచ్చిన చంద్రకళ ఆఫీస్‌లో వర్క్ ఉందని చంద్రకళ వెళ్తుంది. యాక్సిడెంట్ తర్వాత ఎవరు గుర్తున్నారని ప్రకాష్ అడుగుతాడు. తన భార్య జగదీశ్వరి అని రఘురాం చెబుతాడు. రఘురాంను ఒక్కో ప్రశ్న అడుగుతాడు. అన్ని కరెక్ట్‌గా చెబుతాడు రఘురాం.
నేను సైకియో మెమోరీ అనే కొత్త టెక్నిక్ వాడుతున్నాను. దాంతో మూడు రోజుల్లో రఘురాం గారు అన్ని గుర్తు చేసుకుంటారు అని చెబుతాడు ప్రకాష్. ఇక తనకు రెస్ట్ కావాలని ప్రకాష్ వెళ్లిపోతాడు. ఎలాంటి మందులు లేకుండా బాగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. మంచి డాక్టర్‌ను తీసుకొచ్చావురా క్రాంతి అని జగదీశ్వరి మెచ్చుకుంటుంది.
దాంతో కోపంగా పక్కన ఉన్న షోకేజ్ విగ్రహాన్ని నెట్టేస్తుంది శాలిని. దానికి రఘురాం అప్పటివరకు జరిగింది మర్చిపోతాడు. శ్యామలను చూసి మీరు ఎవరు. ట్రీట్‌మెంట్‌కు వచ్చిన డాక్టర్ భార్యన అని అంటాడు. దాంతో శ్యామల సిగ్గు పడుతుంది. తను మీ చెల్లెలు శ్యామల అని చెప్పి తీసుకెళ్లిపోతుంది జగదీశ్వరి.
తేజు గురించి ఆరా
మరోవైపు తేజు అన్నం తినను అని మారం చేస్తుంది. ఇంతలో చంద్రకళ వచ్చి సర్దిచెబుతుంది. చంద్రకళకు అర్జున్ కాల్ చేసి తేజు గురించి అడుగుతాడు. ఇప్పుడు తింటుంది అని చెబుతుంది చంద్రకళ. పాపతో అర్జున్ మాట్లాడుతాడు. అమ్మను ఇబ్బంది పెట్టొద్దు అని అర్జున్ చెబుతాడు. తర్వాత ఫోన్‌లో హస్బండ్ అని ఉండకుండా అర్జున్ గారు అని ఎందుకుంది. మీరు అని ఎందుకు అంటున్నావ్ అని అడుగుతుంది తేజు.
అది సరదాకి. మేము పరిచయం అయినప్పుడు అలాగే పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాం అని చంద్రకళ కవర్ చేస్తుంది. మరోవైపు ఛార్జర్ కోసం వెతికిన కామాక్షి శ్రుతిని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో శ్యామల పడుచు పిల్లలా అందంగా రెడీ అయి వస్తుంది. గజ్జెల గుర్రంలా రెడీ అయ్యావేంటీ అని కామాక్షి అంటుంది. శ్యామలపై సెటైర్లు వేస్తుంది కామాక్షి.
{{/usCountry}}అది సరదాకి. మేము పరిచయం అయినప్పుడు అలాగే పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాం అని చంద్రకళ కవర్ చేస్తుంది. మరోవైపు ఛార్జర్ కోసం వెతికిన కామాక్షి శ్రుతిని గుర్తు చేసుకుంటుంది. ఇంతలో శ్యామల పడుచు పిల్లలా అందంగా రెడీ అయి వస్తుంది. గజ్జెల గుర్రంలా రెడీ అయ్యావేంటీ అని కామాక్షి అంటుంది. శ్యామలపై సెటైర్లు వేస్తుంది కామాక్షి.
{{/usCountry}}ప్రకాష్‌కు నచ్చుతానంటావా అని శ్యామల అడుగుతుంది. సైలెంట్‌గా ఉంటుంది కామాక్షి. ఆ డాక్టర్‌ను నీ పిచ్చి తగ్గించమని చెప్పు అని కామాక్షి అంటుంది. ముదిరిన వయసులో పుట్టిన ప్రేమ పిచ్చిగానే ఉంటుందే అని శ్యామల అంటుంది. మరోవైపు విరాట్ గదిలో అర్జున్ గడ్డం తీస్తాడు. ఇంతలో శ్యామల వచ్చి డోర్ కొడుతుంది. దాంతో కంగారుగా గడ్డం పెట్టుకుంటాడు ప్రకాష్.
బ్లూటూత్ పతి
తర్వాత విరాట్ డోర్ తీస్తాడు. డోర్ తీయడం ఇంతసేపు ఏంట్రా అని శ్యామల అంటే బ్లూటూత్ పతి అని విరాట్ అంటాడు. అదేంట్రా అని శ్యామల అంటే.. పేషంట్స్ మాట్లాడేందుకు మొహమాట పడితే పక్కకు వెళ్లి బ్లూటూత్‌లో కౌన్సిలింగ్ ఇస్తామని అర్జున్ కవర్ చేస్తాడు. ప్రకాశ్ మీకు ఏం ఇష్టం అని శ్యామల అడుగుతుంది.
అదే ఫుడ్, లంచ్ కోసం అని శ్యామల అంటుంది. ఇంతలో చంద్రకళ వస్తే చిరాకు పడుతుంది శ్యామల. నీ పచ్చళ్లదో ఓ కంపెనీ. దానికో పార్టనర్. ఆ అర్జున్‌కు అసలు బుద్ధే లేదు. నీ వల్ల నష్టం వచ్చిన నిన్నే పట్టుకుని ఊగులాడుతున్నాడు అని శ్యామల అంటుంది. దాంతో రిలాక్స్ శ్యామల అని ప్రకాష్ అంటాడు. దానికి పులకరించిపోతుంది శ్యామల.
దొరికిపోయిన అర్జున్
ఎంత మధురంగా ఉందో అంటుంది. అలా టెన్షన్ పడకండి. మీరు మీ హెల్త్ మీద జాగ్రత్త వహించండి అని రొమాంటిక్‌గా చెబుతాడు ప్రకాష్. తర్వాత ప్రకాష్‌కు కాఫీ ఇచ్చేందుకు శ్యామల వెళ్తుంది. అర్జున్ డోర్ తీస్తాడు. కానీ, మీసం ఊడిపోయి కనిపిస్తుంది. అలా అర్జున్ దొరికిపోతాడు. అది శ్యామల చూసిన ఆగ్రహంతో ఊగిపోతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.