నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఫ్రెండ్‌తో మాట్లాడినట్లుగా ప్రకాష్ శాలినికి ట్రాప్ వేస్తాడు. ఈ డాక్టర్‌కు ట్రీట్‌మెంట్‌తో పాటు ఫ్రాడ్ చేసే టాలెంట్ కూడా ఉందన్నమాట. ఈ ముసలోడిని బయటకు పంపించే బదులు దీన్ని వాడుకుంటే అయిపోతుందిగా అని శాలిని అనుకుంటుంది.
శ్రుతికి పులస చేపతో పోలిక

మరోవైపు జాలి రాజ్‌కు ఎంత అమ్మిన చేపలు అమ్ముడు కావు. ఇంట్లో మంచి పులసను పెట్టుకుని ఏంటిది అని ఓ కస్టమర్ అంటాడు. దాంతో అతన్ని తిట్టి పంపిస్తాడు రాజ్. వాడు అంటుంది నా భార్య గురించే. చేపలు అమ్మడానికి శ్రుతిని తీసుకురావడం తప్పు అని రాజ్ అంటాడు. ఇంతలో శ్రుతి అక్కడికి వస్తుంది. దాంతో చాలా కస్టమర్స్ ఒక్కసారిగా వస్తారు.
నేను రెండు రోజులు రాలేదు. ఏది అమ్ముడుపోలేదు. నా గ్లామర్ చూసి వస్తున్నారు అని శ్రుతి అంటుంది. అరగంటలో మొత్తం అమ్ముడుపోతాయి. కానీ, డబ్బు మొత్తం శ్రుతి పట్టుకెళ్తుంది. వారం నుంచి ఇదే తంతు. ఒక్కరూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇవాళ ఊరుకునేది లేదు అని రాజ్ తల్లి అంటుంది.
మరోవైపు ప్రకాష్ దగ్గరికి శాలిని వెళ్తుంది. మీరు చేసిన అప్పులు, తప్పుల గురించి తెలిసింది. ఇందాక మాట్లాడింది నేను విన్నాను. మీ గురించి పోలీస్‌లకు చెబితే జైలులో ఉంటారుగా అని శాలిని అనడంతో భయపడినట్లు నటించిన ప్రకాష్ డోర్ వేస్తాడు. తన గురించి బయటపెట్టొద్దని వేడుకుంటాడు. అయితే, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని శాలిని ట్విస్ట్ ఇస్తుంది.
ట్విస్ట్ ఇచ్చిన శాలిని
ఇదేంటీ బేరం ఆడుతుందనుకుంటే వెళ్లిపోమంటుంది అని డాక్టర్ ప్రకాష్‌గా ఉన్న అర్జున్ షాక్ అవుతాడు. వెళ్తే క్రాంతికి డౌట్ వస్తుందని, మీ మావయ్యకు క్యూర్ అవడం నీకు ఇష్టం లేదా. ఒకరికొకరం సహాయం చేసుకుందామని ప్రకాష్ అంటాడు. అలా అయితే సరే. మీరు మా మావయ్య మెమోరీ మొత్తం ఇరేజ్ చేసేయాలి. ఆయన జ్ఞాపకాలు తీసేసి ఆయన బ్రెయిన్ బ్లాంక్ చేస్తే మీ అకౌంట్లో 10 లక్షలు వేస్తాను అని శాలిని అంటుంది.
{{/usCountry}}ఇదేంటీ బేరం ఆడుతుందనుకుంటే వెళ్లిపోమంటుంది అని డాక్టర్ ప్రకాష్‌గా ఉన్న అర్జున్ షాక్ అవుతాడు. వెళ్తే క్రాంతికి డౌట్ వస్తుందని, మీ మావయ్యకు క్యూర్ అవడం నీకు ఇష్టం లేదా. ఒకరికొకరం సహాయం చేసుకుందామని ప్రకాష్ అంటాడు. అలా అయితే సరే. మీరు మా మావయ్య మెమోరీ మొత్తం ఇరేజ్ చేసేయాలి. ఆయన జ్ఞాపకాలు తీసేసి ఆయన బ్రెయిన్ బ్లాంక్ చేస్తే మీ అకౌంట్లో 10 లక్షలు వేస్తాను అని శాలిని అంటుంది.
{{/usCountry}}నాకున్న అప్పులకు పది లక్షలు సరిపోవు. 15 లక్షలు కావాలి అని అర్జున్ అంటాడు. సరే అని దానికి ఒప్పుకున్న శాలిని వెంటనే పని చేయమని అంటుంది. వెంటనే కుదరదు. కొన్ని అరెంజ్‌మెంట్స్ చేయాలి. స్పెషల్ ఇంజక్షన్, షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. వేరే ప్లేసులో ఇదంతా చేస్తాను అని ప్రకాష్ అంటాడు. వెంటనే జరిగిపోవాలి. మా గెస్ట్ హౌజ్ లొకేషన్. అక్కడ ఎవరుండరు. అక్కడే చేయండి అని శాలిని లొకేషన్ పంపిస్తుంది.
మరోవైపు నుదుట సింధూరం పెట్టించుకుని మురిసిపోతుంది చంద్రకళ. యెల్లో కలర్ చీరలో ముద్దబంతిలా ఉన్నావ్, ముద్దొస్తున్నావ్ అని కిస్ చేయబోతాడు విరాట్. ఇంతలో అర్జున్ డోర్ కొడతాడు. గదిలోకి వచ్చి శాలిని మన దారిలోకి వచ్చిందని, బేరం కుదుర్చుకుందన్న విషయం చెబుతాడు. ఈరోజుతో చంద్రగారి కష్టాలు తీరిపోతాయి అని అర్జున్ అంటాడు.
చంద్ర, విరాట్, అర్జున్ ప్లాన్
గెస్ట్ హౌజ్ గురించి చెబుతాడు ప్రకాష్. అక్కడికి శాలిని కూడా వెళ్లిపోయిందని అంటాడు. అర్జున్‌తో వెళ్లు. కానీ గెస్ట్ హౌజ్‌లోపలికి వెళ్లకు. కాస్తా బయట వెయిట్ చేయు. నేను క్రాంతితో వస్తాను. అప్పుడు శాలిని, డాక్టర్ ఏదో ప్లాన్ చేస్తున్నారని రెచ్చగొట్టు. అప్పుడు శాలిని ఓపెన్ అవుతుంది అని విరాట్ అంటాడు. చంద్ర, అర్జున్ వెళ్తారు.
మరోవైపు పర్మిషన్ గురించి క్రాంతి ఫోన్ మాట్లాడుతాడు. కంపెనీ లైసెన్స్ పేపర్స్ కావాలని శాలినిని పిలుస్తాడు క్రాంతి. ఇంట్లో లేదని కామాక్షి చెబుతుంది. ఆ పేపర్స్ కోసం క్రాంతి వెతుకుతుంటాడు. ఇంతలో విరాట్ వచ్చి మినిస్టర్ పీఏ ఫోన్ చేశాడు. నీ బిజినెస్ గురించి ఓ వ్యక్తిని పంపిస్తానన్నాడు. మన గెస్ట్ హౌజ్‌లో మీటింగ్ ఏర్పాటు చేశానని విరాట్ అంటాడు.
డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నా కాసేపు అయ్యాక వెళ్దామని క్రాంతి అంటాడు. దాంతో సరేనని విరాట్ అంటాడు. మరోవైపు రఘురాంతోపాటు శ్యామల కూడా వస్తానంటుంది. ఈవిడ పిచ్చి ప్లాన్‌కు చిచ్చు పెట్టేలా ఉందని చంద్రకళ అనుకుంటుంది.
మీరు బీరకాయ పప్పు బాగా చేస్తారట కదా. మీరు మాతో వస్తే నేను మిస్ అవుతాను. మీరు ఇంట్లోనే ఉండి రెడీ చేయండంటాడు ప్రకాష్. దాంతో సరేనంటుంది శ్యామల. తండ్రితో చంద్రకళను పంపిద్దామని విరాట్ అంటాడు. మరోవైపు గదిలో ఫైల్స్ కోసం వెతుకుతున్న క్రాంతి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. అవి విరాట్‌కు చూపిస్తాడు.
డేంజరస్ డ్రగ్
వాటి గురించి తెలుసుకోడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవి డేంజరస్ డ్రగ్ అని, మెమోరీ ఇరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెబుతాడు. దాంతో క్రాంతి, విరాట్ షాక్ అవుతారు. గెస్ట్ హౌజ్‌లో రఘురాంను స్పృహ కోల్పోయేలా చేసిన ప్రకాష్ మీరు అన్నట్లుగానే మెమోరీ పూర్తిగా ఇరేజ్ చేస్తానంటాడు. అప్పుడే చంద్రకళ వచ్చి వింటుంది. చంద్రను చూసి శాలిని, ప్రకాష్ షాక్ అవుతారు. గెస్ట్ హౌజ్‌లో శాలిని బాగోతం బయటపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.