నిన్ను కోరి జనవరి 30 ఎపిసోడ్: శాలిని ప్లాన్ ఫెయిల్‌-ట్విస్ట్ ఇచ్చిన చంద్ర‌-భార్య‌పై కోపంతో ఊగిపోయిన విరాట్‌

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 30 ఎపిసోడ్ లో రూమ్ లోకి వెళ్లి చూస్తే చంద్రకళ ఉండదు. దీంతో ఎక్కడ దొరికిపోతామోనని విరాట్ తెగ టెన్షన్ పడతాడు. అప్పుడే బాత్రూమ్ లో నుంచి చంద్ర వచ్చి ట్విస్ట్ ఇస్తుంది. టెన్షన్ పెట్టినందుకు చంద్రపై విరాట్ సీరియస్ అవుతాడు. 

Published on: Jan 30, 2026, 08:04:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 30 ఎపిసోడ్ లో చంద్రకళను రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామనే ప్లాన్ తో రెడీగా ఉంటుంది శాలిని. ట్యాబ్లెట్స్ కోసం అందరూ వెతుకుతారు. మెడిసిన్స్ అన్నీ చంద్రనే చూసుకుంటుంది కదా, ఆవిడనే ఇవ్వమంటే సరిపోతుందని కామాక్షి చెప్తుంది. మామయ్యకు టైమ్ కు మెడిసిన్ ఇవ్వాలని శాలిని కూడా అంటుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

నాటకాలు ఆడుతున్నారా?

అన్నయ్యకు ట్యాబ్లెట్స్ ఇవ్వాలని మీ భార్యను రమ్మను అని విరాట్ కు చెప్తుంది శ్యామల. తలనొప్పితో పడుకుందని విరాట్ చెప్తాడు. ఆమెను నేను లేపుతానని శ్యామల పైకి వెళ్తుంది. అప్పుడే ఆటోలో ఇంటికి వస్తుంది చంద్రకళ. బెడ్ రూమ్ లోకి వెళ్లి వచ్చిన శ్యామల నాటకాలు ఆడుతున్నావా విరాట్? గదిలో చంద్రకళ లేదని అంటుంది.

చంద్ర ట్విస్ట్

విరాట్ లోపలికి వచ్చి చూసి షాక్ అవుతాడు. ఆ చంద్రకళ ఇంటికి రాలేదు కదా అని శ్యామల సీరియస్ అవుతుంది. అప్పుడే బాత్రూమ్ నుంచి వచ్చిన చంద్ర ఎందుకు ఇంత గోల చేస్తున్నారు? తలనొప్పి అని చెప్పినా కాసేపు కూడా పడుకోనివ్వరా? అని అంటుంది. మామయ్యకు మెడిసిన్ ఇచ్చి డిన్నర్ పెడతానని చెప్పిన చంద్ర శాలిని వైపు చూస్తుంది.

విరాట్ సీరియస్

తప్పించుకున్నామని విరాట్ తో చంద్ర అంటుంది. కానీ విరాట్ సీరియస్ అవుతాడు. రెండు మూడు గంటల్లో వస్తానని చెప్పి వెళ్లావు. కానీ ఫోన్ చేసేదాకా రాలేదు. నీ వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకు ఎన్నిసార్లు చెప్పాను చంద్ర. మళ్లీ అదే తప్పు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు. ఏం చెప్పాలో తెలియదు. నాకు టార్చర్ గా ఉంది. మన గురించి అసలు ఆలోచించవని విరాట్ ఫైర్ అవుతాడు.

పాపను మేనేజ్ చేయడం ఎంత ముఖ్యమో ఇంట్లోవాళ్లను మేనేజ్ చేయడం అంతే ముఖ్యం. మనం డ్రామా ఆడుతున్న విషయం క్రాంతి ముందు బయటపెట్టేందుకు శాలిని ప్రయత్నిస్తుంది. నేనెంత ఇబ్బంది పడ్డానో తెలుసా? ఎదుటివాళ్లు తప్పు పట్టే అవకాశం నువ్వే ఇస్తున్నావని విరాట్ కోపంతో వెళ్లిపోతాడు.

ట్యాబ్లెట్స్ దాచిపెట్టానని

పండగ పూట మా అత్తయ్య ఒక్కరే ఉంటారు కదా ఆవిడతో కలిసి ఉంటే సంతోషపడుతుందని శ్రుతి చెప్తుంది. శ్రుతి, రాజ్ వెళ్లిపోతారు. మీ డ్రామా బయటపడుతుందని చాలా టెన్షన్ పడినట్లున్నారు. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం కోసం మామయ్య ట్యాబ్లెట్స్ నేనే దాచిపెట్టా. లక్ బాగుండి సేవ్ అయ్యారని చంద్రతో శాలిని అంటుంది.

చంద్ర కన్నీళ్లు

బావ నువ్వు కోపంగా ఉంటే ఏదోలా ఉంది. త్వరగా వచ్చేయాలని ట్రై చేశా. ఐస్ క్రీమ్ తినేదాకా తనతో ఉండాలని మారాం చేయడంతో తప్పలేదు. నువ్వు సీరియస్ అయితే ఎలాగో ఉంది బావ. నువ్వు కూడా తప్పు పడితే ఎలా అని చంద్ర కన్నీళ్లు కారుస్తుంది. అన్నిసార్లు టైమ్ మనకు అనుకూలంగా ఉండదని చెప్తున్నానని విరాట్ అంటాడు. క్షమించమని విరాట్ కాళ్లమీద పడుతుంది చంద్ర.

ఇంకెప్పుడు ఇలా చేయనని చంద్ర అంటే అలాగేనని విరాట్ చెప్తాడు. చంద్రను కూల్ చేయాలని పూలు కొంటాడు విరాట్. రఘురాం విరాట్ ను ఆపి చేతుల్లో ఏమున్నాయని అడుగుతాడు. మందు కొడుతున్నావా? అని అడుగుతాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More