నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ కోసం విరాట్ తెచ్చిన మల్లెపూలను సోఫాలో చూస్తాడు రఘురాం. నీకోసమేగా వీడు పూలు కొన్నది అని రఘురాం అంటాడు. దాంతో డైనింగ్ టేబుల్‌పై ఉన్న గ్లాస్ కింద పడేస్తుంది చంద్రకళ. దాంతో జరిగింది మర్చిపోతాడు రఘురాం. ఇంతలో అంతా వస్తారు. చేతిలో మల్లెపూలు ఏంటని శ్యామల అడుగుతుంది.
జగదీశ్వరి కోసమే మల్లెపూలు

జగదీశ్వరి కోసమే రఘురాం మల్లెపూలు కొన్నాడని కామాక్షి అంటుంది. కానీ, శాలినికి మాత్రం చంద్ర కోసం విరాట్ పూలు కొన్నాడని, మావయ్య మతిమరుపుతో డైవర్ట్ చేసుకున్నాడని అర్థం చేసుకుంటుంది శాలిని. నీకోసం అప్పుడప్పుడు ఇలాగే పూలు తెచ్చేవాడిని కదా అని రఘురాం అంటే సిగ్గుందా అండి. పిల్లల ముందు అలా అంటారేంటీ అని జగదీశ్వరి అంటుంది.
అయితే రూమ్‌లో అను అన్నయ్య అని రఘురాం, జగదీశ్వరిని గదిలోకి పంపించేస్తారు శ్యామల, కామాక్షి. ప్రకాష్ ఉండుంటే నాకు కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఉండేవని శ్యామల అంటుంది. సరేలే నేను కొనిస్తాలే మల్లెపూలు అని కామాక్షి అంటుంది. బతికిపోయామని విరాట్ అనుకుంటాడు. చంద్రకళ తెగ నవ్వుతుంది. మల్లెపూల మీద చంద్రకళ కవిత్వం చెబుతుంది.
నా ప్లాన్ ఫెయిల్ అయిందని ఏడుస్తుంటే ఎటకారం చేస్తావా అని చంద్ర వెంట పడతాడు. ఇంతలో మంత్రి పీఏ విరాట్‌కు కాల్ చేసి ల్యాండ్ ప్రపోజల్స్ గురించి చెబుతుంది. క్రాంతి ఐడియాను ఎగ్జిక్యూట్ చేయాలని, ల్యాండ్‌కు ప్రపోజల్ పంపించమని, నచ్చితే వెంటనే లాక్ చేస్తారని పీఏ చెబుతుంది. దాంతో విరాట్ సంతోషిస్తాడు. అదే చంద్రకళకు చెబుతాడు విరాట్.
శాలినికి చెప్పిన విరాట్
తర్వాత క్రాంతి దగ్గరికి వెళ్తాడు విరాట్. శాలిని దర్శనం ఇచ్చి క్రాంతి లేడని, మీటింగ్‌లో ఉన్నాడని చెబుతుంది. మినిస్టర్ పీఏ గురించి చెప్పి క్రాంతికి చెప్పమని చెబుతాడు విరాట్. మరోవైపు శ్రుతి తింటూనే ఉంటుంది. రాజ్‌ను తల్లి మారిపోయావని తిడుతుంది. నువ్వు ధన పిశాచివి, అందుకే నీ కొడుకును నా మీదకు ఉసిగొలిపావని శ్రుతి అంటుంది.
{{/usCountry}}తర్వాత క్రాంతి దగ్గరికి వెళ్తాడు విరాట్. శాలిని దర్శనం ఇచ్చి క్రాంతి లేడని, మీటింగ్‌లో ఉన్నాడని చెబుతుంది. మినిస్టర్ పీఏ గురించి చెప్పి క్రాంతికి చెప్పమని చెబుతాడు విరాట్. మరోవైపు శ్రుతి తింటూనే ఉంటుంది. రాజ్‌ను తల్లి మారిపోయావని తిడుతుంది. నువ్వు ధన పిశాచివి, అందుకే నీ కొడుకును నా మీదకు ఉసిగొలిపావని శ్రుతి అంటుంది.
{{/usCountry}}నువ్వు మీ అమ్మ రాకాసి తెగకు చెందినవాళ్లు అని రాజ్ తల్లి అంటుంది. శ్రుతి పుట్టింటికి వెళ్తానని బెదిరిస్తే రాజ్ బతిమిలాడుతాడు. నా భార్యను, అత్తగారిని అంటే ఊరుకునేది లేదని రాజ్ తల్లిని మందలిస్తాడు. రేపటి నుండి అది మార్కెట్‌కు రాకూడదు అని తల్లి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం చంద్రకళ పూజ చేస్తుంది.
విరాట్ హారతి అయిష్టంగా తీసుకుంటాడు. ఇంకా చంద్ర మీద కోపం పోలేదా అని రఘురాం నిలదీస్తాడు. అలా అడగండి అని చంద్ర అంటే.. నా కూతురు విషయంలో మూటగట్టుకున్న పాపం ఊరికే పోతుందా అని కామాక్షి నిందిస్తుంది. ఎంత తిట్టిన దులుపేసుకుంటావ్. సిగ్గులేకుండా అని శ్యామల అంటుంది. మీరు మాత్రం వెళ్లారా. అంత ఒకే కుంపటి అని చంద్రకళ రివర్స్ పంచ్ ఇస్తుంది.
కోట్లల్లో లాభాలు
ఇంతలో మ్యానేజర్ వస్తాడు. మీరు ఎదురుచూసిన వెంచర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చిందని చెబుతాడు. ఇది ఎక్స్‌ట్రార్డినరీ న్యూస్ అని విరాట్ అంటాడు. రేట్ పెరిగినట్లేగా అని జగదీశ్వరి అంటే నాలుగు రెట్లు పెరిగినట్లు అని చంద్రకళ అంటుంది. మంచి రోజు చూసి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని రఘురాం అంటాడు. అదంతా శాలిని చూస్తుంది.
అంతా విరాట్‌కు కంగ్రాట్స్ చెబుతారు. ఈ న్యూస్ వాడుకుని క్రాంతిని రెచ్చగొట్టాలని శాలిని అనుకుంటుంది. క్రాంతి చాలా సంతోషంగా ఉంటాడు. ఒక్క పర్మిషన్ వస్తే చాలు సక్సెస్ సాధించినట్లే అని క్రాంతి అంటాడు. మీ అన్నయ్య ఆల్రెడీ సక్సెస్ సాధించిన సంతోషంలో ఉన్నాడు. ఎప్పుడో కొన్న ల్యాండ్‌కు రేట్ పెరిగిందని, కోట్లల్లో లాభాలు వస్తాయని పొంగిపోతున్నారని శాలిని అంటుంది.
త్వరలో నేను కూడా సక్సెస్ సాధిస్తే అంతా సంతోషిస్తారు అని క్రాంతి అంటాడు. బావ గారు నీ పని చూస్తూనే తన పని చేసుకుని సక్సెస్ అయ్యారు. నువ్వు కూడా సొంతంగా పనులు చేయడం నేర్చుకో. అప్పుడే సక్సెస్ అవుతావ్. బావగారు బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. మినిస్టర్ గారి పీఏతో నువ్వే డైరెక్ట్ మాట్లాడు. నీకు క్లారిటీ వస్తుందని శాలిని అంటుంది.
విరాట్‌ను ఇరికించిన శాలిని
దాంతో మినిస్టర్ పీఏకి క్రాంతి కాల్ చేస్తాడు. నిన్న విరాట్‌కు చెప్పి ల్యాండ్ ప్రపోజల్ పంపించమన్నానుగా. ఎందుకు పంపలేదు. ఇప్పుడు మినిస్టర్ గారి దగ్గర బంధువుకు ఇచ్చేశారు. మీరు ఆశలు వదులుకోండి. నిన్న నేను ఫోన్ చేసిన వెంటనే ఫైల్ పంపిస్తే మీకే వచ్చేది. మీరు పంపించకుంటే ఎలా అని పీఏ కోప్పడుతుంది.
అదే విషయం వెళ్లి విరాట్‌ను అడుగుతాడు క్రాంతి. నిన్నే నీకు చెప్పాను కదా అని శాలినిని విరాట్ అంటాడు. నాకు ఎప్పుడు చెప్పారు అని అబద్ధం చెబుతుంది శాలిని. అలా తమ్ముడి దగ్గర విరాట్‌ను ఇరికిస్తుంది శాలిని. దాంతో విరాట్, చంద్ర షాక్ అవుతారు. ఇక బిజినెస్ లో అన్న సక్సెస్ అయితే తమ్ముడు ఫెయిల్ అవుతాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.